Breaking News Live Updates: జూబ్లీహిల్స్‌లో నటుడు బాలకృష్ణ ఇంటి వద్ద రోడ్డు ప్రమాదం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
Road Accident At Balakrishna House: జూబ్లీహిల్స్‌లో నటుడు బాలకృష్ణ ఇంటి వద్ద రోడ్డు ప్రమాదం

Road Accident At Balakrishna House: హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 దగ్గర రోడ్డు ప్రమాదం 

అతివేగంగా వస్తూ డివైడర్ కు డీ కొట్టిన బొలెరో వాహనం 

భారీగా ట్రాఫిక్ జామ్..

అంబులెన్స్ కి దారి ఇవ్వబోయి డివైడర్ ను ఎక్కించిన యువతి 

నటుడు బాలకృష్ణ ఇంటి గెట్ వైపుకి దూసుకెళ్లిన కారు 

యువతికి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసిన ట్రాఫిక్ పోలీసులు 

ఆల్కహాల్ శాతం జీరో 

వాహనాన్ని తొలగిస్తున్న ట్రాఫిక్ పోలీసులు

YSRCP Rajyasabha Candidates: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ప్రకటన, ఆ నలుగురు వీరే

YSRCP Rajyasabha Candidates: ఎస్ఆర్ సీపీ నుంచి రాజ్యసభకు పంపే అభ్యర్థులను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి మళ్లీ అవకాశం ఇచ్చింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య, సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావులను కూడా వైఎస్ఆర్ సీపీ నుంచి రాజ్యసభకు పంపుతున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. మొత్తం నలుగురు అభ్యర్థులలో ఇద్దరు బీసీలకు ఛాన్స్ ఇచ్చారు ఏపీ సీఎం జగన్. తెలంగాణకు చెందిన నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్యలకు ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే అవకాశం లభించింది.

1) విజయసాయి రెడ్డి (రెడ్డి, రాయలసీమ)

2) నిరంజన్ రెడ్డి (రెడ్డి, తెలంగాణ)

3) బీద మస్తాన్ రావు (బీసీ, నెల్లూరు)

4) ఆర్ కృష్ణయ్య (బీసీ, తెలంగాణా)

Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. దీంతో జస్టిస్ సతీష్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయనున్నారు. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌కు ప్రమోషన్ వచ్చింది. అయితే, భుయాన్ ప్రస్తుతం అదే హైకోర్టులో న్యాయమూర్తి హోదాలో ఉన్నారు.

PM Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన 26న?

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న హైదరాబాద్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) ప్రారంభమై 20 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా ఈ నెల 26న ద్వి దశాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధానిని ఆహ్వానించారు. పర్యటన దాదాపు ఖరారైందని, త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ISB పూర్వ విద్యార్థులైన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

CM Jagan Kurnool Tour: నేడు సీఎం జగన్ కర్నూల్ పర్యటన, భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన

నేడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు కోసం శంకుస్థాపన చేయనున్నారు. ఓర్వకల్లు మండలం గుమ్మితం తండా, పాణ్యం మండలం పిన్నాపురంలలో గ్రీన్‌కో ఎనర్జీస్‌ లిమిటెడ్‌ ఈ ప్లాంట్‌ను నెలకొల్పొతుంది. ఒకే యూనిట్‌ నుంచి సోలార్, విండ్, హైడల్‌ పవర్లను ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం ప్రతిష్ఠాత్మక ఈ ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.

Background

ఏపీలో వచ్చే మూడు రోజుల వరకూ రాష్ట్రంలో వానలు పడే అవకాశం ఉన్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. నేడు, రేపు, ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటన విడుదల చేశారు.

బలమైన నైరుతి గాలులు దిగువ ట్రోపో ఆవరణములో వీస్తుండడం వల్ల వర్షపాతం అనేక ప్రాంతాల నుంచి మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. దాంతో పాటు ఆకాశం నిరంతరంగా మేఘాలు పట్టి ఉండడం వల్ల నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఎక్కువ భాగం, అండమాన్ సముద్రంలో మే 16న విస్తరించాయి. నైరుతి రుతుపవనాల పయనం 5 డిగ్రీల ఉత్తర అక్షాంశం/80 డిగ్రీల తూర్పు రేఖాంశం, 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం/85 డిగ్రీల తూర్పు రేఖాంశం, 11 డిగ్రీల ఉత్తర అక్షాంశం/90 డిగ్రీల తూర్పు రేఖాంశం, లాంగ్ ఐలాండ్స్, 14.8 డిగ్రీల ఉత్తర అక్షాంశం/97.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకూ విస్తరించాయి.

రాబోయే 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, మొత్తం అండమాన్ సముద్రం, అండమాన్ దీవులకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు, మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

నిన్న ఉత్తర ఛత్తీస్ గఢ్, విదర్భ మీదుగా బిహార్ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ ఉన్న ఉత్తర - దక్షిణ ద్రోణి ఈ రోజు ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర తమిళనాడు వరకూ విదర్భ మధ్య కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉంది. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల నుంచి 3.1 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. 

Telangana Weather: ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో మే 17న అక్కడకక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో వచ్చే అవకాశం ఉంది. గాలులు కూడా గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.

‘‘హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీల సెంటీ గ్రేడ్ నుంచి 26 డిగ్రీల సెంటీ గ్రేడ్ వరకూ ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది.’’ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ట్వీట్ చేశారు.

‘‘ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, ఖమ్మం, కొమురం భీం, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది.