News
News
X

Achenna On Ysrcp : దొంగ ఓట్లపై సంతకాలు పెట్టిన అధికారులు జైలుకే - తిరుపతిలో అచ్చెన్నాయుడు హెచ్చరిక!

దొంగ ఓట్లకు సంతకాలు పెట్టిన గెజిటెడ్ ఆఫీసర్లు జైలుకెళ్లడం ఖాయమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

FOLLOW US: 
Share:

Achenna On Ysrcp : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  దొంగ ఓట్లకు సంతకాలు పెట్టిన గెజిటెడ్ ఆఫీసర్లు జైలు కెళ్ళడం ఖాయంమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రతీ ఎన్నికలనూ జగన్ దౌర్భాగ్యంగా మార్చారని మండిపడ్డారు. ఒక్క తిరుపతి నగరంలోనే 15 వేలకు పైగా దొంగ ఓట్లను నమోదు చేశారని మండిపడ్డారు.. ఆధారాలతో పాటు పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఇంత వరకు పట్టించుకోలేదని, దొంగ ఓట్లకు సంతకాలు పెట్టిన గెజిటెడ్ ఆఫీసర్లు జైలు కెళ్ళడం ఖాయంమని ఆయన చెప్పారు.. అధికార పార్టి దొంగ ఓట్లతో గెలవడం ఒక గెలుపేనా అని ఆయన ప్రశ్నించారు.                                           

ప్రజాస్వామ్య బద్థంగా ఎన్నికలు జరిగితే గెలుపు టిడిపిదే అని, ఎపి పేరు వింటేనే పక్క రాష్ట్రాల వారు అసహ్యించుకునే దౌర్భాగ్య పరిస్ధితికి జగన్ తీసుకొచ్చారన్నారు. ఉపాధ్యాయులంతా  ఆలోచించాలని జీతాలు సక్రమంగా ఇవ్వని వ్యక్తి జగన్ అన్నారు.  టిడిపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ ను గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు మళ్ళీ సిఎం కావాలని, ఉపాధ్యాయులను ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని, 5 వేలు ఫోన్ పే చేసి ఓటును వైసీపి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన ఆరోపించారు.. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులను మరోసారి నమ్మించి మోసం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు.                               

ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయన్న కారణంగానే ఉద్యోగులను చర్చకు పిలిచారన్నారు.. ఇచ్చిన హామీని నెరవేర్చే పరిస్థితిలో సిఎం లేరని, ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఖాళీగా అయ్యిందని, ప్రభుత్వ ఉద్యోగస్తులు త్వరలోనే వైసిపి ప్రభుత్వానికి బుద్థి చెప్పే రోజులు దగ్గర పడిందన్నారు.. టిడిపి ఎమ్మెల్సీ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకుందని, దొంగ ఓట్లపై ఆధారాలతో సహా కోర్టును ఆశ్రయిస్తాంమని, దొంగ ఓట్ల విషయంలో హస్తం ఉన్న వారు ఎవరైనా సరే వదిలి పెట్టే పరిస్ధితి లేదని స్పష్టం చేశారు.                                  

ఎన్టీఆర్ మహిళలను ఎంతగానో గౌరవించారని, చంద్రబాబు మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారని ఆయన చెప్పారు.. వైసీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎపిలో శాంతి భద్రతలు పూర్తిగా కరువయ్యాయని, రోజుకొక హత్య, అత్యాచారం జరుగుతోందని, ప్రజలంతా భయాందోళనకు గురి అవుతున్న పరిస్ధితులు నెలకొందన్నారు.. అసలు సిఎం ఇంటికి దగ్గరగా ఓ మహిళపై అఘాయిత్యం జరిగినా సీఎం బయటకు రాలేదన్నారు..                         

కవితకు ఈడీ నోటీసులపై దుమారం - తెలగాణ ఆత్మగౌరవం చుట్టూ రాజకీయం !
     
Published at : 08 Mar 2023 06:15 PM (IST) Tags: Achchennaidu AP MLC Elections Fake votes in MLC elections

సంబంధిత కథనాలు

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Cyber Crime : కమీషన్ కోసం కక్కుర్తి పడితే అకౌంట్ ఖాళీ, వాట్సాప్ చాటింగ్ తో చీటింగ్!

Cyber Crime : కమీషన్ కోసం కక్కుర్తి పడితే అకౌంట్ ఖాళీ, వాట్సాప్ చాటింగ్ తో చీటింగ్!

Lokesh on Sand Mafia: ఎమ్మెల్యే కేతిరెడ్డిపై ఇసుక దందా ఆరోపణలు, టిప్పర్ల ముందు లోకేష్ సెల్ఫీలు వైరల్

Lokesh on Sand Mafia: ఎమ్మెల్యే కేతిరెడ్డిపై ఇసుక దందా ఆరోపణలు, టిప్పర్ల ముందు లోకేష్ సెల్ఫీలు వైరల్

MP Nandigam Suresh : పథకం ప్రకారమే దాడి, ఆదినారాయణ రెడ్డి మనుషులే కవ్వించారు- ఎంపీ నందిగం సురేష్

MP Nandigam Suresh : పథకం ప్రకారమే దాడి, ఆదినారాయణ రెడ్డి మనుషులే కవ్వించారు- ఎంపీ నందిగం సురేష్

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?