అన్వేషించండి

Weather Updates: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. విశాఖ, అల్లూరి జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

Rains In Andhra Pradesh | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో బుధవారం వరకు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. రేపు వాయుగుండంగా బలపడి 19న తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు.

Andhra Pradesh Rains | అమరావతి: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. అలాగే, ఆగస్టు 19 మధ్యాహ్నానికి ఇది దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందన్నారు. తీరం వెంట గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, మత్స్యకారులు బుధవారం (ఆగస్టు 20) వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించారు. భారీ వర్షాల కారణంగా సోమవారం విశాఖ, అల్లూరి జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు.

వర్షాలపై అంచనా:
అల్పపీడనం ప్రభావంతో రాబోయే రెండు రోజులు కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుండి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపారు. ప్రభావిత జిల్లాల అధికారులను ముందుగానే అప్రమత్తం చేసినట్టు ప్రఖర్ జైన్ వెల్లడించారు. భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే పరిస్థితులు ఉన్నందున ప్రజలు చెట్ల కింద, శిథిల భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండకూడదని హెచ్చరించారు.

నదుల వరద పరిస్థితి:
కృష్ణా నది: ప్రకాశం బ్యారేజీ వద్ద ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికి ఇన్‌ఫ్లో మరియు అవుట్‌ఫ్లో 2.87 లక్షల క్యూసెక్కులు నమోదు కాగా, వర్షాల నేపథ్యంలో ఇది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశం ఉందన్నారు.

గోదావరి నది: ధవళేశ్వరం వద్ద వరద ప్రవాహం 4.07 లక్షల క్యూసెక్కులు నమోదైందన్నారు.

ప్రజలు నదులు, పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నాలు చేయరాదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల ప్రభావంతో పలు జిల్లాల్లో రాకపోకలకు వరద నీటితో ఇబ్బందులు కలుగుతున్నాయి. కొన్నిచోట్ల వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోాయాయి.

వాతావరణ, వర్షాల వివరాలు:
సోమవారం (18-08-2025):
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడొచ్చు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మంగళవారం (19-08-2025):
శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడొచ్చు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

ఆదివారం సాయంత్రానికి వర్షపాతం వివరాలు:
విశాఖ జిల్లా
కాపులుప్పాడ: 144 మిల్లీమీటర్లు
పరదేశీపాలెం: 129 మిల్లీమీటర్లు
మధురవాడ: 122 మిల్లీమీటర్లు
ఆనందపురం: 114 మిల్లీమీటర్లు
శ్రీరామ్ నగర్, పెందుర్తి: 111 మిల్లీమీటర్లు

శ్రీకాకుళం జిల్లా
హరిపురం: 113.5 మిల్లీమీటర్లు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Visakhapatnam Airport Service Ends: కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget