అన్వేషించండి

Bandi Sanjay: బ్యాలెట్, బుల్లెట్ ఒకే ఒరలో ఉండలేవు- నక్సల్స్‌తో చర్చలు అనడం హాస్యాస్పదం: బండి సంజయ్

Bandi sanjay about Operation Kagar | బుల్లెట్, బ్యాలెట్ ఒకే ఒరలో ఉండవని.. ప్రజాస్వామ్యంలో తుపాకీ ఒక్కరే పట్టాలి, అది పోలీసుడే కావాలి” అన్నారు బండి సంజయ్.

Bandi Sanjay | కరీంనగర్: పేదరికం ఉన్నంతకాలం నక్సలిజం కొనసాగుతుందన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు అసంబద్ధమైనవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. “నక్సల్స్‌తో చర్చలు జరపాలంటూ మాట్లాడటం హాస్యాస్పదం. గతంలో కాంగ్రెస్ నక్సలైట్లతో చర్చలు జరిపి ఏం సాధించింది?” అంటూ ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు నక్సలైట్లపై నిషేధం విధించిన కేసీఆర్, అధికారానికి దూరమైన తర్వాత చర్చల మాటలు తీసుకురావడాన్ని ఆయన ఆక్షేపించారు. నక్సల్స్ చేతిలో వేలాది మంది అమాయకులు మరణించినప్పుడు ఆ సంఘటనలను "సామాజిక కోణం"గా ఎందుకు చూడలేకపోయారు అని పౌర హక్కుల నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

నక్సల్స్ వల్ల ఇప్పటివరకు సుమారు 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, 9 వేల మంది పోలీసులూ అమరులయ్యారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆపరేషన్ కగార్‌ను నిలిపేయాలన్న ఆలోచనే లేదని, నక్సల్స్ నిర్మూలన పూర్తి అయేంత వరకూ ఈ యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2026 మార్చి నాటికి ‘నక్సల్స్ ముక్త్ భారత్’ సాధించడమే లక్ష్యమని తెలిపారు.

విద్యార్థి దశలోనే ఏబీవీపీలో ఫుల్ టైమర్‌గా పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, విద్యార్థుల సమస్యలపై పోరాడే సమయంలో తలపడ్డ కేసులే తనను రాజకీయాల్లోకి నడిపించాయని బండి సంజయ్ చెప్పారు. కరీంనగర్‌లో ABVP ఆధ్వర్యంలో జరిగిన “నక్సల్స్ నరమేధం - మేధోమథనం” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, నక్సల్స్ హింసకు గురైన ABVP కార్యకర్తలకు నివాళి అర్పించారు.

నక్సలిజం నిర్మూలనకు కేంద్రం కట్టుబడి ఉంది
ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 2026 మార్చిలోపు దేశాన్ని నక్సల్స్ విముక్తంగా మార్చాలనే సంకల్పంతో ముందుకెళ్తోంది. హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ‘ఆపరేషన్ కగార్’ ప్రారంభించి, దిశగా దశలవారీగా చర్యలు తీసుకుంటోంది. గతంలో యూపీఏ పాలనలో 200కి పైగా జిల్లాల్లో ఉన్న నక్సలిజం, నేడు కేవలం 12 జిల్లాలకు పరిమితమైందని తెలిపారు.

నక్సలిజం వల్ల అభివృద్ధి ఆగిపోవడమే కాక, వేలాది మంది ప్రజలు, పోలీసులు ప్రాణాలు కోల్పోయిన దుస్థితిని గుర్తు చేశారు. విద్య, ఆరోగ్యం, రవాణా రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఇది ప్రజాస్వామ్యాన్ని సంక్షోభంలోకి నెట్టిందని అన్నారు. తుపాకులు చేతపట్టి పోరాటం చేస్తూ, పేదల అభివృద్ధిని అడ్డుకుంటూ వచ్చే వారు దేశ భక్తులుగా ఎలా పరిగణించగలమని ప్రశ్నించారు.

నక్సల్స్ చర్చలతో మారరని చరిత్రే చూపింది
నక్సల్స్‌తో గతంలో జరిగిన చర్చలు ఫలితాలివ్వలేదని గుర్తు చేస్తూ, తుపాకి కింద చర్చలేంటని ప్రశ్నించారు. నక్సలైట్లపై ప్రేమ చూపుతున్న నాయకులు నిజంగా గట్టిగా ఉండాలంటే, రాష్ట్రంలో నక్సలైట్లపై విధించిన నిషేధాన్ని ఎత్తేయమని సవాల్ విసిరారు. పదేళ్లపాటు సీఎంగా ఉన్నప్పుడు చర్చల సంగతి ఎందుకు గుర్తుకు రాలేదని కేసీఆర్‌పై బండి సంజయ్ మండిపడ్డారు.

అర్బన్ నక్సల్స్ అనే పేరుతో నిషేధిత సంఘాలకు మద్దతు ఇచ్చే నాయకులు విద్యా సంఘాల్లో సభ్యులను నియమించడం ఏమాత్రం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. మానవ హక్కుల పేరుతో నక్సల్స్ కార్యకలాపాలను సమర్థించడం అమానుషమని, తుపాకుల వీడే వరకు సామాజిక కోణం చర్చకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

నక్సల్స్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు
చత్తీస్‌గఢ్‌లో ‘జనతన సర్కార్’ పేరిట తుపాకులతో ప్రజల్ని చంపిన నక్సల్స్, పాఠశాలలు నిషేధించి విద్యను అడ్డుకున్నారన్నారాయన. పేదరికాన్ని నిర్మూలిస్తామంటూ హింసచేశారనీ, వారి కారణంగా అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. దేశంలో పేదరికం ఎక్కువగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనే ఉందని, ఇది వారిచేతమే సృష్టించబడిందని తేల్చిచెప్పారు.

బాలెట్ కాదు, బుల్లెట్ తత్వం నక్సలిజం
“మేము బాలెట్‌తో సమాధానం చెబుతాం, వాళ్లు బుల్లెట్‌తో జవాబిస్తం అంటున్నారు. ప్రజాస్వామ్యంలో తుపాకీ ఒక్కరే పట్టాలి, అది పోలీసుడే కావాలి” అన్నారు. తుపాకులు చేతబట్టి హింసకు పాల్పడే వారికి ఏ మాత్రం చలించేది లేదని, పూర్తి స్థాయిలో నక్సల్స్ నిర్మూలనకే కేంద్రం కట్టుబడిందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
CM Revanth Reddy: తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీకి ఎన్నిసార్లైనా వెళ్తా: కరీంనగర్‌లో సీఎం రేవంత్
తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీకి ఎన్నిసార్లైనా వెళ్తా: కరీంనగర్‌లో సీఎం రేవంత్
Konda Surekha Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ తీసుకున్న మంత్రి కొండా సురేఖ- వివాదం తర్వాత తొలిసారి భేటీ!
సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ తీసుకున్న మంత్రి కొండా సురేఖ- వివాదం తర్వాత తొలిసారి భేటీ!
Singareni Gold Copper Exploration : బంగారం, రాగి ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి! పనులు ప్రారంభించిన భట్టి! విద్యుత్‌ సప్లైలో జాయింట్ వెంచర్!
బంగారం, రాగి ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి! పనులు ప్రారంభించిన భట్టి! విద్యుత్‌ సప్లైలో జాయింట్ వెంచర్!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Dharani I Love You: రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
Embed widget