AP New Cabinet Issues : మంత్రి వర్గంలో నో ఛాన్స్ - అలిగిన బాలినేని, కన్నీళ్లు పెట్టుకున్న కోటంరెడ్డి
AP New Cabinet Issues : ఏపీ కొత్త కేబినెట్ ఫైనల్ లిస్ట్ విడుదల అయింది. దీంతో మంత్రి పదవులు దక్కని వైసీపీ నేతల్లో అసంతృప్తి స్వరాలు మొదలయ్యాయి. మాజీ మంత్రి బాలినేనిని బుజ్జగించేందుకు సజ్జల రంగంలోకి దిగారు.
AP New Cabinet Issues : ఏపీ కొత్త కేబినెట్ లో మంత్రి పదవులు దక్కకపోవడంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని బుజ్జగించడానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు. కొత్త కేబినెట్ కూర్పులో బాలినేనికి చోటు దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాలినేనిని బుజ్జగించాలని సజ్జలకు సీఎం జగన్ సూచించినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ఆదేశాల మేరకు సజ్జల, బాలినేని నివాసానికి వెళ్లి మాట్లాడారు. సుమారు 10 నిమిషాల పాటు బాలినేనితో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. బాలినేనిని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా కలిశారు. జిల్లాలో సీనియర్‌గా ఉన్న తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నానని ఉదయభాను అన్నారు. బాలినేనికి మంత్రి పదవి దక్కకపోవడంతో వైసీపీ నాయకులు ఆయన ఇంటికి బారులుతీరుతున్నారు. అలకపూనిన బాలినేనిని బుజ్జగించేందుకు ఇప్పటికే సజ్జల ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లా పరిస్థితులు దృష్టిలో ఉంచుకోవాలని బాలినేని ఘాటుగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. బాలినేనిని బుజ్జగించేందుకు సామినేని ఉదయభాను కూడా ఆయన ఇంటికి వచ్చినట్లు సమాచారం.
ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిన పిన్నెల్లి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్లినట్లు తెలుస్తోంది. సీఎం సెక్రటరీ ధనుంజయరెడ్డి నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్‍కాల్ వెళ్లింది. "మీరు, ప్రభుత్వం చూపిన అభిమానానికి థాంక్స్ అంటూ పిన్నెల్లి ఫోన్ పెట్టేశారు", ఆ తర్వాత ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేసినట్లు తెలుస్తోంది.
కన్నీటి పర్యంతం అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
మంత్రి వర్గంలో చోటుదక్కకపోవడంతో వైసీపీలో అసమ్మతి స్వరాలు మొదలయ్యాయి. తన పేరును కనీసం పరిశీలించకపోవడంపై కోటంరెడ్డి శ్రీధర్‍రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఆశించడం తప్పా అని ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. కాకాణిని వైసీపీలోకి తీసుకొచ్చింది ఎవరో తెలుసుకోవాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. వైసీపీలో ముందు నుంచి తనకు ప్రాధాన్యతలేదని కోటంరెట్టి అసహనం వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం కల్పించలేదని సన్నిహితుల ఆవేదన చెందారు. రేపటి నుంచి నియోజకవర్గంలో తలపెట్టిన గడపగడపకు ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఆయన వాయిదా వేశారు. మాచర్ల, చిలకలూరిపేట వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. పిన్నెల్లి పేరు లేదంటూ ఆయన అనుచరులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. విడదల రజనీకి మంత్రి పదవి ఇవ్వొద్దని వ్యతిరేకించారు.
Also Read: Mekapati Gautham Reddy: రాజకీయాల్లోకి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి, ఉప ఎన్నికల్లో పోటీకి సై!
Also Read : AP New Ministers : కొత్త కేబినెట్ లో ఊహించని ట్విస్టులు, రోజా, అంబటికి లక్కీ ఛాన్స్, కొడాలి ప్లేస్ గల్లంతు!