AP New Ministers : కొత్త కేబినెట్ లో ఊహించని ట్విస్టులు, రోజా, అంబటికి లక్కీ ఛాన్స్, కొడాలి ప్లేస్ గల్లంతు!
AP New Ministers : ఏపీ కొత్త కేబినెట్ లో ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. అసలు మంత్రి పదవి రేసులో లేని వారికి పదవులు దక్కగా, రేసులో ముందున్న వాళ్లు చివరికి చతికిలపడ్డారు. ఆర్కే రోజా, అంబటి రాంబాబు లక్కీ ఛాన్స్ కొట్టేశారు.
AP New Ministers : ఏపీ కొత్త మంత్రి వర్గం ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. ఈ లిస్ట్ లో ఎవరూ ఊహించని ట్విస్ట్ లు ఎన్నో ఉన్నాయి. ఉదయం నుంచి మీడియాలో చక్కర్లు కొట్టిన కొన్ని పేర్లు ఫైనల్ లిస్ట్ లో గల్లంతు అయ్యాయి. అయితే ఆఖరి నిమిషం ఎవరూ ఊహించని విధంగా సీఎం జగన్ ట్విస్ట్ ఇచ్చారు. అనుహ్యంగా ఆర్కే రోజా, అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణకు మంత్రి పదవులు దక్కాయి. అలాగే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పినిపే విశ్వరూప్, గుమ్మనూరు జయరాం, నారాయణ స్వామికి మళ్లీ ఛాన్స్ ఇచ్చారు సీఎం జగన్. అయితే ఎవరూ ఊహించని విధంగా పశ్చిమగోదావరి జిల్లా నుంచి కొట్టు సత్యనారాయణకు ఛాన్స్ దక్కింది. ముందు నుంచి భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించినా చివరి నిమిషయంలో కొట్టు సత్యనారాయణ ఛాన్స్ కొట్టేశారు.
కొత్త కేబినెట్ లో ట్విస్టులు
శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజులకు మంత్రి పదవులు దక్కాయి. విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ మళ్లీ ఛాన్స్ దక్కింది. అలాగే రాజన్న దొరను మంత్రి పదవి వరించింది. విశాఖ జిల్లా నుంచి గుడివాడ అమర్నాథ్, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజాలకు మంత్రి పదవులు దక్కాయి. తూర్పు గోదావరి జిల్లా నుంచి పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను మళ్లీ కొనసాగిస్తున్నారు. పశ్చిమగోదావరి నుంచి తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణకు మంత్రి పదవులు దక్కాయి. కృష్ణా జిల్లా నుంచి ముందు నుంచి కొడాలి నానికి మళ్లీ మంత్రి పదవి వరిస్తుందని అందరూ భావించిన చివరి నిమిషం ఆయనకు నిరాశే ఎదురైంది. ఆ జిల్లా నుంచి జోగి రమేశ్ ఛాన్స్ కొట్టేశారు.
ఆర్కే రోజాకు ఛాన్స్
గుంటూరు జిల్లా నుంచి అంబటి రాంబాబు, మెరుగు నాగార్జున, విడదల రజనీకి మంత్రి పదవులు దక్కాయి. నెల్లూరు జిల్లా నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డికి, కడప జిల్లా నుంచి అంజాద్ బాషాకు మంత్రి పదవులు దక్కాయి. కర్నూలు జిల్లా నుంచి బుగ్గన, గుమ్మనూరి జయరాంను తిరిగి కొనసాగిస్తున్నారు. చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామికి మళ్లీ ఛాన్స్ దక్కగా, ఫస్ట్ కేబినెట్ లో మంత్రి పదవి ఆశించిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు అనుహ్యంగా ఈసారి మంత్రి పదవి దక్కింది. అనంతపురం జిల్లా నుంచి ఉష శ్రీచరణ్, తిప్పే స్వామిలకు మంత్రి పదవులు దక్కాయి. ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్ కు మళ్లీ ఛాన్స్ దక్కింది.
సామాజిక సమీకరణాలు
సామాజిక వర్గ ఈక్వేషన్స్ ప్రకారం మంత్రుల లిస్ట్
బీసీ సామాజిక వర్గం మంత్రులు - 10
ఎస్టీ - 1
ఎస్సీ - 5
కాపు - 4
మైనార్టీ - 1
రెడ్డి - 4
త్వరలో ఏర్పాటు కానున్న ఏపీ స్టేట్ బోర్డ్ డెవలప్మెంట్ బోర్డ్ కి ఛైర్మన్ గా కొడాలి నాని నియమించే అవకాశం ఉంది. ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ గా ఎమ్మెల్యే మల్లాది విష్ణు కేబినెట్ హోదాలో నియామించనున్నట్లు తెలస్తోంది. ప్రభుత్వ చీఫ్ విప్ గా ముసునూరి ప్రసాద్ రాజు, డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామిని నియమించనున్నట్లు సమాచారం.