అన్వేషించండి

Minister Roja: ఎన్నికల తర్వాత చంద్రబాబు, పవన్ పారిపోతారు- మంత్రి రోజా హాట్ కామెంట్స్

Andhra Pradesh News: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వల్లే రాష్ట్ర విభజన జరిగిందని ఆరోపించారు.

Nagari Roja News: వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఓటమి తప్పదని మంత్రి రోజా జోస్యం చెప్పారు. పొత్తులో భాగంగా జనసేన  24 సీట్లు తీసుకుందని, కూటమికి  జనసేనకు ప్రకటించినన్నీ సీట్లు కూడా రావని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175కు 175 సీట్లు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు, పవన్ రాష్ట్రంలో కనిపించరని, హైదరాబాద్‌కు పారిపోతారని ఆరోపించారు. టీడీపీ, జనసేన కూటమికి ఓటు వేస్తే మళ్లీ కష్టాలు మొదలవుతాయని, మోసగాళ్ల చేతికి రాష్ట్రాన్ని అప్పగించేందుకు ప్రజలు సిద్దంగా లేరని దుయ్యబట్టారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని రోజా ధీమా వ్యక్తం చేశారు.

బుధవారం చిత్తూరు జిల్లాలోని పుత్తూరులో మంత్రి రోజా పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ జగనన్న మహిళా మార్ట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు కారణంగానే తెలుగు రాష్ట్రాలు విడిపోయాయని, ఆయన లాంటి మోసకారి ప్రపంచంలో ఎవరూ ఉండరని విమర్శించారు. మరోసారి నగరి నియోజకవర్గంలో గెలిచి హ్యాట్రిక్ కొడతానని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని రోజా అన్నారు. ఎండాకాలంలో చల్లగా ఉండాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

రోజాకు ఇంటి పోరు

ఎన్నికల వేళ నగరి నియోజకవర్గంలో రోజాకు సొంత పార్టీలో సెగ తప్పడం లేదు. ఆమెకు టికెట్ ఇవ్వవద్దంటూ ఐదు మండలాలకు చెందిన వైసీపీ నేతలు తీర్మానించారు. రోజాకు టికెట్ కేటాయిస్తే ఓడించి తీరుతామని అధిష్టానానికి హెచ్చరికలు పంపారు. రాజకీయాల్లో రోజా ఐరన్ లెగ్ అని, ఆమెకు టికెట్ ఇస్తే వైసీపీకి నష్టమని విమర్శిస్తున్నారు. తమ వల్లనే రోజా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని,  అయితే ఆమె నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో కమిషన్లు రౌడీయిజం, భూకబ్జాలు పెరిగిపోయాయని, ఆమె లాంటి మంత్రిని ఇప్పటివరకు చూడలేదని ఐదు మండలాలకు చెందిన వైసీపీ ఇంచార్జ్‌లు తీవ్ర విమర్శలు చేశారు. రోజా సోదరులు కూడా నియోజకవర్గంలో దోపిడీకి పాల్పడుతూ పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చారని, అవి ప్రశ్నించినందుకే తమను దూరం పెట్టారని అంటున్నారు. మంత్రి రోజాకు సీటు ఇచ్చే విషయంలో జగన్ పునరాలోచన చేయాలని కోరారు. రోజాకు టికెట్ ఇస్తే గెలిచే పరిస్థితి లేదని, ఆమెకు కాకుండా ఇంకెవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.

రోజాకు టికెట్ ఉంటుందా..?

నగరి నియోజకవర్గంలో రోజాపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆమె గెలిచే పరిస్థితి లేదని పలు సర్వే నివేదికలు జగన్‌కు అందినట్లు చెబుతున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో రోజాకు టికెట్ దక్కదనే టాక్ నడుస్తోంది. రోజాకు ప్రత్యామ్నాయంగా మరో బలమైన నేత కోసం జగన్ చూస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే నియోజకవర్గంలో బలమైన నేత ఎవరూ లేకపోవడంతో రోజాకే మరోసారి టిెకెట్ ఇచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. వచ్చే వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నియోజకవర్గ ఇంచార్జ్‌లను మారుస్తూ అభ్యర్థులను జగన్ ఖరారు చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Allu Arjun Political Party Rumors: ఐకాన్ స్టార్ టు పొలిటికల్ స్టార్? అల్లు అర్జున్ నయా పార్టీ ప్రచారం వెనుక అసలు నిజమెంత?
ఐకాన్ స్టార్ టు పొలిటికల్ స్టార్? అల్లు అర్జున్ నయా పార్టీ ప్రచారం వెనుక అసలు నిజమెంత?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Embed widget