అన్వేషించండి

AP DSC Merit List Controversy: ఏపీ మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు జగన్ డిమాండ్ - భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు

AP DSC Jagan: ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. పేపర్ లీక్, డేటా డిలీట్ , స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందని లోకేష్ రాజీనామాకు డిమాండ్ చేశారు.

AP DSC Merit Scam Allegations by Jagan : గత ఏడాది పూర్తి అయిన మెగా డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపించారు.     ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, ఇదంతా ఒక పెద్ద స్కామ్ అని  జగన్ తాజాగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పేపర్లు లీక్ అవ్వడం, మెరిట్ లిస్టులు మాయం కావడం,  డేటా డిలీట్ చేయడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. ఇది మెగా డీఎస్సీనా లేక నిరుద్యోగులను మోసం చేసిన 'దగా డీఎస్సీనా' అని ఆయన ప్రశ్నించారు. 

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఈ పరీక్షల నిర్వహణలో  డార్క్ ఆపరేషన్ సాగిందని  జగన్ ఆరోపించారు.  ముఖ్యంగా పరీక్షల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఎస్సీఈఆర్టీ అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు రావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.  ఈ అనుమానాస్పద టాపర్ వివరాలను డేటాబేస్ నుండి తర్వాతి కాలంలో డిలీట్ చేయడం వెనుక అసలు మతలబు ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. మెరిట్ లిస్టులను బహిరంగంగా ఉంచకుండా దాచిపెట్టడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని విమర్శలు వస్తున్నాయి.
 
సాధారణంగా ఏ ప్రభుత్వ నియామక ప్రక్రియలోనైనా ఎంపికైన వారి జాబితాలను కలెక్టరేట్‌లలో లేదా అధికారిక వెబ్‌సైట్‌లలో ఉంచడం ఆనవాయితీ. కానీ, ఈసారి కేవలం ఎంపికైన వారికి మాత్రమే నేరుగా మెసేజ్‌లు పంపడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. పబ్లిక్ డొమైన్‌లో జాబితా పెట్టకపోవడం ద్వారా అర్హులైన ప్రతిభావంతులకు అన్యాయం జరిగిందని, వెనుకదారిలో తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలను కట్టబెట్టారని జగన్ ఆరోపించారు. 

మరోవైపు స్పోర్ట్స్ కోటా పోస్టుల విషయంలో భారీ బేరసారాలు సాగాయని జగన్ ఆరోపించారు.  ఒక్కో పోస్టుకు 15 లక్షల రూపాయల వరకు డీల్ కుదిర్చారని, క్రీడా మైదానంలో అడుగు పెట్టని వారికి కూడా అధికార పార్టీ నాయకుల అండదండలతో ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి ఎంపిక చేశారని  అంటున్నారు. రిక్రూట్‌మెంట్‌ను కాస్తా వేలం పాటలా మార్చేశారని, ప్రతిభ ఉన్న అభ్యర్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారన్నారు. 

పరీక్షా కన్వీనర్ల మార్పు విషయంలోనూ ప్రభుత్వం అనుమానాస్పదంగా వ్యవహరించిందని, నిబంధనలకు విరుద్ధంగా జాయింట్ డైరెక్టర్‌ను కన్వీనర్‌గా తీసుకురావడం వెనుక అవినీతి కోణం ఉందని  జగన్ ఆరోపించారు.  ఈ మొత్తం వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్‌ను పదవి నుంచి తప్పించాలని, వెంటనే సీబీఐ   దర్యాప్తు కోరాలన్నారు.  ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయి విచారణ జరిపితేనే అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని జగన్ అన్నారు.                    

టాప్ హెడ్ లైన్స్

BC Reservations: బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్లాన్ బీ తో ఎన్నికలకు కూటమి ప్రభుత్వం
బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్లాన్ బీ తో ఎన్నికలకు కూటమి ప్రభుత్వం
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
KCR Farmhouse 45 Acres Missing Land: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
TDP Janasena Seat Sharing: స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
Embed widget