అన్వేషించండి

ప్రభుత్వం చాలా పెద్దది.. ఎవరూ ఏం చేయలేరు.. మీరే నష్టపోతారు జాగ్రత్త: అజయ్ జైన్ 

కొంతమంది ఉద్దేశపూర్వకంగా సచివాలయ ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని అజయ్ జైన్ అన్నారు. తర్వాత నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ ఎలాంటి నిరసనలు చేపట్టకుండా వెంటనే విధులకు హాజరు కావాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ చెప్పారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో హౌసింగ్ డిపార్ట్ మెంట్ పై సమీక్ష నిర్వహించిన ఆయనకు.. సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పదకొండు శాఖలతో అనుబంధం కలిగిన విభాగాలు ఉన్నందున ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ కాస్త ఆలస్యమైందని ఆయన చెప్పారు. 

రాష్ట్రంలో అన్ని అర్హతలు కలిగిన వారు 60 వేల మంది ఉన్నట్లు ఇప్పటికే గుర్తించామని, మిగతావారు కూడా అర్హత సాధించిన వెంటనే ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని అజయ్ జైన్ వెల్లడించారు. ఇబ్బందులు తలెత్తుతాయని సచివాలయ ఉద్యోగులు భావించాల్సిన అవసరం లేదన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా సచివాలయ ఉద్యోగుల ను రెచ్చ గొడుతున్నారని, అపోహలు సృష్టించాలని చూస్తున్నారని, వారి మాటలను నమ్మి మోసపోవద్దని హితవు పలికారు.

విధులకు హాజరు కావాలి

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ ఎలాంటి నిరసనలు చేపట్టకుండా విధులకు హాజరు కావాలని అజయ్‌ జైన్‌ చెప్పారు. వెలగపూడిలోని రాష్ట్ర తాత్కాలిక సచివాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సోమవారం సమావేశమై, ప్రొబేషన్‌ ప్రకటన తదితర సమస్యలపై మాట్లాడారు. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు చాలా దారులున్నాయని చెప్పారు. ఇంకా 30 ఏళ్లు ఉద్యోగాలు చేయాల్సి ఉందని.. మెుదట్లోనే ఇలా చేస్తే.. మీపై తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుందని చెప్పారు.

సచివాలయ ఉద్యోగులంటే సీఎం జగన్ కు మంచి అభిప్రాయం ఉందని అజయ్ జైన్ అన్నారు. కానీ.. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు తప్పుడు మార్గంలో వెళ్తున్నాయని చెప్పారు. ఎలాంటి వినతులు లేకుండా విధులకు హాజరుకాకపోవడం, అధికారిక గ్రూపుల నుంచి వైదొలగడం సరికాదని హితవు పలికారు. ఆశించేవి జరగాలంటే.. ప్రశాంతమైన వాతావరణ ఉండాలన్నారు. అన్నీ సరిగా ఉంటేనే.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.

Also Read: Dragon Fruit Cultivation: మీ పొలంలోకి ఎంటర్ ది 'డ్రాగన్ ఫ్రూట్'... సాగుకు సబ్సిడీ 35 వేలు అందుకోవచ్చు

Also Read: Mudragada Letter: మరో లేఖాస్త్రం సంధించిన ముద్రగడ... ఈసారి వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్...

Also Read: MP Bharat: ఆమె మెుదటి మహిళ.. ఎంపీ భరత్ అభినందనలు.. కామెంట్స్ తో ఆడేసుకుంటున్న నెటిజన్లు 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Embed widget