Mudragada Letter: మరో లేఖాస్త్రం సంధించిన ముద్రగడ... ఈసారి వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్...
మాజీ మంత్రి ముద్రగడ మరో లేఖ రాశారు. తన లేఖలకు కొందరు భుజాలు తడుముకుంటున్నారని, అలాంటి వాళ్ల విమర్శలకు తానెప్పుడూ వెనకడుగు వెయ్యనన్నారు.
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మంగళవారం ప్రజలకు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో ముద్రగడ పలు కీలక అంశాలు ప్రస్తావించారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ప్రజలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. ఇటీవల తాను రాసిన లేఖపై వస్తున్న విమర్శలకు ఆయన సమాధానం ఇచ్చారు. తన లేఖలకు కొంత మంది పెద్దలు భుజాలు తడుముకుంటున్నారని ఆరోపించారు. గత ఐదు ఏళ్లుగా దళిత, బీసీ నాయకులు మూడో ప్రత్యామ్నాయం చూస్తున్నారన్నారు. తాను ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి అవుతానంటే కోట్లు ఖర్చు చేసే స్నేహితులు ఉన్నాయరన్నారు. అలా కోట్లు ఖర్చు పెట్టి పదవులు సంపాదించుకోవడం తనకు ఇష్టం లేదన్నారు.
Also Read: విశాఖలో అదిరిపోయే టూరిస్ట్ స్పాట్.. పాల సముద్రం లాంటి లుక్‌తో మైమరచిపోవచ్చు! ఈ టైంలో ది బెస్ట్
'గతంలో రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు నేను ఆయనతో ఉండే వాడిని. అప్పుడప్పుడు కలిసినప్పుడు మీకు కూడా ప్రజాదరణ బాగానే ఉంది ప్రజల్లో తిరగండన్నారు. తోటి శాసనసభ్యులు ముద్రగడకు అప్పులెక్కువ అని ఆయనతో ప్రస్తావిస్తే... ఆ లిస్ట్ ఇవ్వండి నా మిత్రులతో చెప్పి క్లియర్ చేయిస్తాను అన్నారు రాజశేఖర్ రెడ్డి గారు. నేను ఆయన సహాయాన్ని తిరస్కరించాను' అని ముద్రగడ లేఖలో పేర్కొ్న్నారు.
ఎవరికి భయపడే ప్రసక్తే లేదు
ఇటీవల సోషల్ మీడియాలో బూతుపురాణం ఎక్కువైందని, ఎవరి గురించైనా ఓ మాట అంటే బూతులు తిడుతున్నారని ముద్రగడ అన్నారు. తాను అలాంటి వారి పోస్టింగులకు బెదిరిపోయే వాడినికానన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బెదిరే ప్రసక్తి లేదన్నారు. ప్రజలకు చేసే సేవలో ఎప్పుడూ ఫలితం ఆశించని మనిషినని ముద్రగడ అన్నారు. తాను ఎన్‌ఆర్‌ఐని కాదని, ఏపీలోనే పుట్టాన్నారు. బంతిని ఎంతగట్టిగా కొడితే అంత స్పీడుగా తిరిగి వస్తుందన్నారు. తనకున్న బలమైన ఆలోచనలను ఎన్ని అడ్డంకులు ఎదురైనా చెప్తానన్నారు. న్యాయమైన ఆలోచనలు, అభిప్రాయాలు అమలు చేయవద్దని చెప్పడానికి ఎవరికి హక్కు లేదని ముద్రగడ ప్రజలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
Also Read: ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్’ ప్రారంభించిన సీఎం జగన్.. నేటి నుంచే దరఖాస్తులు, వెబ్‌సైట్ వివరాలు ఇవీ..