Param Sundari: జాన్వీ కపూర్ 'పరమ్ సుందరి' మూవీపై కాంట్రవర్సీ - ఆ ప్లేస్‌లో రొమాంటిక్ సీన్స్ ఏంటి?
Param Sundari Trailer Reaction: జాన్వీ కపూర్, సిద్దార్థ్ మల్హోత్రా లేటెస్ట్ మూవీ 'పరమ్ సుందరి' తాజాగా వివాదంలో చిక్కుకుంది. ట్రైలర్‌లో కొన్ని సీన్స్‌పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Janhvi Kapoor's Param Sundari Trailer Controversy: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్, సిద్దార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'పరమ్ సుందరి'. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. దినేష్ విజన్ మూవీని నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటుండగా తాజాగా కొత్త వివాదం మొదలైంది.
అక్కడ ఆ సీన్స్ ఏంటి?
మూవీలో కేరళ అమ్మాయిగా జాన్వీ కనిపించగా ఢిల్లీ అబ్బాయిగా సిద్దార్థ్ కనిపించారు. వీరిద్దరి మధ్య లవ్, రొమాంటిక్ ఎమోషనల్ ట్రాక్‌ను అందంగా చూపించనున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. అయితే, ట్రైలర్‌లో చర్చిలో వచ్చే కొన్ని సీన్స్‌పై పలువురు అభ్యంతరం తెలిపారు. ట్రైలర్ స్టార్టింగ్‌లోనే చర్చిలో ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని... ప్రార్థన మందిరంలో అలాంటి సీన్స్ ఏంటని అసహనం వ్యక్తం చేశారు.
సీబీఎఫ్‌సీతో పాటు ప్రభుత్వానికి లేఖ
దీనిపై వాచ్ డాగ్ ఫౌండేషన్ సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ సీన్స్ వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. ఓ ప్రార్థనా స్థలంలో అలాంటి కంటెంట్ షూట్ చెయ్యడం కరెక్ట్ కాదంటూ ఫౌండేషన్ లాయర్ గాడ్ ఫ్రే పిమెంటా అన్నారు. ఇలా చేయడం తమ ఆధ్యాత్మిక పవిత్రతను అగౌరవపరచడమే అని లేఖలో పేర్కొన్నారు. దర్శక నిర్మాతలపై కేసులు నమోదు చేసేలా ఆదేశించాలని డిమాండ్ చేశారు. మరి దీనిపై మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
Also Read: బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ స్పెషల్ ఆఫర్ - జస్ట్ 2 డేస్ ఫర్ 'సితారే జమీన్ పర్'
టాలీవుడ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు
అంతకు ముందు సోషల్ మీడియా వేదికగానూ ఈ మూవీ ట్రైలర్‌పై పెద్ద చర్చే సాగింది. సౌత్ ఇండియన్ టాప్ హీరోస్ అంటూ మోహన్ లాల్, రజినీకాంత్, అల్లు అర్జున్, యష్ పేర్లు చెప్పారు జాన్వీ. మలయాళంలో మోహన్ లాల్, తమిళనాడులో రజినీ కాంత్, ఆంధ్ర తెలుగులో అల్లు అర్జున్ అంటూ పుష్ప మేనరిజం, స్టైల్‌లో అలరించారు. అయితే, దీనిపైనే ఫ్యాన్స్ మధ్య రచ్చ మొదలైంది.
టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, కిింగ్ నాగార్జున, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ టాప్ హీరోలని... కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను టాప్ హీరో అంటూ ఎలా చూపిస్తారంటూ కొందరు ఫ్యాన్స్ నెట్టింట ప్రశ్నిస్తున్నారు. జాన్వీ ఆ డైలాగ్స్‌తో చెప్పిన వీడియోను షేర్ చేస్తున్నారు. బన్నీ కంటే ముందే 'బాహుబలి'తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారని రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా ఎందరో ఉన్నా కేవలం బన్నీనే హైలైట్ చేయడం ఏంటి అంటూ కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. ఇదే టైంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సైతం మెగా హీరోస్ ఉండగా... అల్లు అర్జున్ ఒక్కరే గొప్ప అంటూ చెప్పడం ఏంటని అభిప్రాయపడుతున్నారు. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ 'పరమ్ సుందరి'ని ట్రోల్ చేస్తున్నారు.






















