News
News
X

Best Places in Vizag: విశాఖలో అదిరిపోయే టూరిస్ట్ స్పాట్.. పాల సముద్రం లాంటి లుక్‌తో మైమరచిపోవచ్చు! ఈ టైంలో ది బెస్ట్

విశాఖ మన్యంలోని పాడేరు, వంజంగి హిల్స్‌లో అబ్బుర పరిచే రమణీయ దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. దానితో భారీ స్థాయిలో పర్యాటకులు పాడేరు ఏజెన్సీకి పోటెత్తుతున్నారు.

FOLLOW US: 

విశాఖపట్నం జిల్లాలో శీతకాలం అందాల గురించి మాట్లాడితే వెంటనే లమ్మసింగి పేరు చెబుతారు. నిజానికి అంతకంటే అద్భుతమైన ప్రకృతి రమణీయ దృశ్యాలకు పాడేరు ఏజెన్సీ నెలవైంది. విశాఖ మన్యంలోని పాడేరు, వంజంగి హిల్స్‌లో అబ్బుర పరిచే రమణీయ దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. దానితో భారీ స్థాయిలో పర్యాటకులు పాడేరు ఏజెన్సీకి పోటెత్తుతున్నారు. ప్రతిరోజూ సూర్యోదయం కాగానే కళ్ళ ముందు సాక్షాత్కరించే మంచు దుప్పటి, చేతికి అందేంత దూరంలో తేలియాడే మబ్బులు, చుట్టుపక్కల ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. 

ఈ ఏడాది చలి మరింత ఎక్కువగా ఉండడంతో గతంలో కంటే విశాఖ మన్యం మరిన్ని కొత్త అందాల్ని సంతరించుకుంది. వాటిని ఆస్వాదించడానికి, పాడేరు దగ్గర ఉన్న వంజంగి కొండల పైనుంచి సూర్యోదయాన్ని కళ్లారా చూడడానికి పర్యాటకులు భారీగా వస్తున్నారు. ఎత్తైన కొండల మధ్యలో నిలబడి తమను తాకుతూ వెళ్లే మబ్బులను చూడడం ఒక తీయని అనుభూతిగా వారు గుర్తుంచుకొంటున్నారు. శని,ఆది వారాలకు తోడు సంక్రాంతి శెలవులు కలిసి రావడంతో చిన్నా, పెద్దతో పాటు అధిక సంఖ్యలో యువత ఛలో పాడేరు అంటున్నారు. ముఖ్యంగా వంజంగి హిల్స్ తో పాటు సముద్ర మట్టానికి 4,500 అడుగుల ఎత్తున ఉన్న బోలెంగమ్మ పర్వత శిఖరం ప్రకృతి ప్రియులకు స్వర్గధామంగా మారింది. మారుమూల ఏజెన్సీలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఏడాది వ్యవధిలో రెండు లక్షల మంది పర్యాటకులు సందర్శించి వెళ్లినట్టు అధికారులు చెబుతున్నారు. శీతకాలం వచ్చిందంటే చాలు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గిరిజన పల్లెలకు వంజంగి హిల్స్ పర్యాటక కేంద్రంగా గిరిజనులకు జీవనోపాధి సైతం కల్పిస్తోంది.

వంజంగి హిల్స్‌‌తో గిరిజనులకూ ఉపాధి
వంజంగి హిల్స్‌తో పాటు సముద్ర మట్టానికి సుమారు 4,500 అడుగుల ఎత్తులో ఉన్న బోలెంగమ్మ పర్వత శిఖరం ప్రకృతి ప్రియులకు స్వర్గధామం. మారుమూల వంజంగి పంచాయతీ శివారు గ్రామాలకు వంజంగి హిల్స్‌ వరంగా మారింది. గిరిజనులకు జీవనోపాధి కల్పిస్తోంది. మరోవైపు వంజంగి, పాడేరు ఏజెన్సీ అందాలను చూడడానికి పర్యటకులు పోటెత్తడం వల్ల ఇక్కడ వారి వాహనాలతో రద్దీ నెలకొంటుంది. ఘాట్ రోడ్డులో గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో టూరిస్టులు ఇరుక్కుపోతున్నారు. అయినప్పటికీ సూర్యోదయ సమయంలో తెల్లని పాల సముద్రంలా కనిపించే మంచు అందాలను చూడడానికి వచ్చే ప్రకృతి ప్రేమికుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

Also Read: ఎమ్మెల్యే రోజా దత్తత గ్రామం ఎక్కడుంది? ఆ ఊరినే ఎందుకు ఎంపిక చేశారు? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే..

వంజంగి హిల్స్‌కు ఎలా వెళ్లాలంటే.. 
విశాఖపట్నం నుంచి పాడేరుకు 117 కిలోమీటర్ల దూరం. ప్రయాణ సమయం 3 గంటలు. పాడేరుకు 8 కిలోమీటర్ల దూరంలో వంజంగి కొండలున్నాయి. పాడేరు నుంచి వంజంగి హిల్స్‌ జంక్షన్‌ వరకు పక్కా తారు రోడ్డు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి వంజంగి హిల్స్‌గా పేరొందిన బోనంగమ్మ కొండ వరకు సుమారు రెండు కిలోమీటర్ల వరకు మట్టి రోడ్డు ఉంది. జంక్షన్‌ నుంచి బోనంగమ్మ కొండకు కాలినడకన వెళ్తే రెండు గంటలు సమయం పడుతుంది.

Also Read: ఆంధ్ర యూనివర్సిటీలో వేలాడుతున్న  తిమింగలాలు... దశాబ్దాలుగా విద్యార్థులకు విజ్ఞానం అందిస్తున్న అరుదైన జీవులు

Also Read: విశాఖ తీరంలో హై టెన్షన్... భగ్గుమన్న రింగ్ వలల వివాదం... బోటు తగలబెట్టిన మత్స్యకారులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 10 Jan 2022 09:12 AM (IST) Tags: Visakhapatnam tourists places Vanjangi hills vizag tourists places Vanjangi cloud hill top paderu agency tourist places

సంబంధిత కథనాలు

SSC CPO Notification 2022 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 4300 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!

SSC CPO Notification 2022 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 4300 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!

Tricolour In Eye : కంటిలో త్రివర్ణ పతాకం, కోయంబత్తూరు ఆర్టిస్ట్ సాహసం!

Tricolour In Eye : కంటిలో త్రివర్ణ పతాకం, కోయంబత్తూరు ఆర్టిస్ట్ సాహసం!

Vangalapudi Anitha : గోరంట్ల మాధవ్ వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయాలి, ఎన్సీడబ్ల్యూకు అనిత లేఖ

Vangalapudi Anitha : గోరంట్ల మాధవ్ వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయాలి, ఎన్సీడబ్ల్యూకు అనిత లేఖ

Breaking News Live Telugu Updates: ఆగస్టు 15 నుంచి తెలంగాణలో పింఛన్ల జాతర- మరో పది లక్షలకు క్యాబినెట్ ఆమోదం

Breaking News Live Telugu Updates: ఆగస్టు 15 నుంచి తెలంగాణలో పింఛన్ల జాతర- మరో పది లక్షలకు క్యాబినెట్ ఆమోదం

What's App Calls Cheating : అందమైన అమ్మాయి వాట్సప్ వీడియో కాల్ చేస్తే, మీకు చిక్కులే!

What's App Calls Cheating : అందమైన అమ్మాయి వాట్సప్ వీడియో కాల్ చేస్తే, మీకు చిక్కులే!

టాప్ స్టోరీస్

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల

TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల

‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!

‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!