అన్వేషించండి
Advertisement
AP Revenue Divisions: ఏపీలో కొత్తగా 12 రెవెన్యూ డివిజన్లు ప్రతిపాదన... అవేంటంటే...!
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కొత్తగా మరో 12 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 63కు చేరనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం కొత్త జిల్లాలపై నోటిఫికేషన్ జారీచేసింది. నెల రోజుల్లో అభ్యంతరాలు, సూచనలు, సలహాలు చెప్పాలని కోరింది. అయితే కొత్త జిల్లా ఏర్పాటుతో రెవెన్యూ డివిజన్లు పెరగనున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 12 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఏపీలో 51 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కొత్త జిల్లాలో ఏర్పాటుతో వీటిల్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 63కి చేరనుంది.
Also Read: రాయలసీమకు సముద్రం తెచ్చేసిన సీఎం జగన్ ! అవాక్కయ్యారా.. నిజమేనండి బాబూ.. ఇవిగో డీటైల్స్..
- ఆత్మకూరు
నంద్యాల డివిజన్‌లోని బండి ఆత్మకూరు, కర్నూలు డివిజన్‌లోని శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, నందికొట్కూరు, పగిడ్యాల, జె.బంగ్లా, కొత్తపల్లె, పాములపాడు, మిడుతూరు మండలాలు ఈ డివిజన్‌లోకి తీసువస్తున్నారు. - రాయచోటి
కడప జిల్లాలోని రాయచోటి, సాంబేపల్లి, చిన్నమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాలు, మదనపల్లి డివిజన్‌లోని పీలేరు, గుర్రంకొండ, కలకడ, కేవీ పల్లె మండలాలతో ఈ డివిజన్‌లోనికి వస్తాయి.
- బాపట్ల
తెనాలి డివిజన్‌లోని వేమూరు, కొల్లూరు, చుండూరు, భట్టిప్రోలు, అమృతలూరు, రేపల్లె, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి, బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాలతో ఈ డివిజన్ ను కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. - భీమునిపట్నం
విశాఖ డివిజన్‌లోని భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, విశాఖపట్నం రూరల్, మహారాణిపేట మండలాలతో ఈ రెవెన్యూ డివిజన్ ప్రతిపాదించారు. - భీమవరం
ఏలూరు డివిజన్‌లోని తాడేపల్లిగూడెం, పెంటపాడు, కొవ్వూరు డివిజన్‌లోని తణుకు, అత్తిలి, ఇరగవరం, నరసాపురం డివిజన్‌లోని భీమవరం, వీరవాసరం, ఉండి, కాళ్ల, పాలకోడేరు, ఆకివీడు మండలాలతో ఈ డివిజన్‌లో కలవనున్నాయి. - బొబ్బిలి
విజయనగరం డివిజన్‌లోని గజపతినగరం, దత్తిరాజేరు, మెరకముడిదం, పాలకొండ డివిజన్‌లోని రాజాం, వంగర, రేగిడి ఆముదాలవలస, సంతకవిటి, పార్వతీపురం డివిజన్‌లోని బొబ్బిలి, రామభద్రాపురం, బాదంగి, తెర్లాం మండలాలు ఈ కొత్త డివిజన్‌లోకి రానున్నాయి. - పలమనేరు
మదనపల్లి డివిజన్‌లోని పలమనేరు, గంగవరం, బాలిరెడ్డిపల్లె, వి.కోట, పెద్దపంజని, కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం, రొంపిచర్ల, సోమల, చౌడిపల్లి, పుంగనూరు, సొదం మండలాలు, తిరుపతి డివిజన్‌లోని పులిచెర్ల మండలాలతో ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకానుంది. - డోన్
కర్నూలు డివిజన్‌లోని డోన్, బేతంచర్ల, పీపల్లె, నంద్యాల డివిజన్‌లోని బనగానపల్లి, అవుకు, కొల్లకుంట్ల, సంజామల, కొలిమిగుండ్ల మండలాలతో కొత్త రెవెన్యూ డివిజన్‌ను ప్రతిపాదించారు. - చీరాల
ఒంగోలు డివిజన్‌లోని చీరాల, వేటపాలెం, అద్దంకి, జె.పంగులూరు, సంతమాగులూరు, బల్లికురువ, కొరిశపాడు, పర్చూరు, యద్దనపూడి, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, మార్టేరు మండలాలతో ఈ కొత్త డివిజన్ ఏర్పాటు చేయనున్నారు. - నందిగామ
విజయవాడ డివిజన్‌లోని నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలతో ఈ రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం ప్రతిపాదించింది. - తిరువూరు
విజయవాడ డివిజన్‌లోని మైలవరం, జి.కొండూరు, నూజివీడు డివిజన్‌లోని రెడ్డిగూడెం, తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఎ.కొండూరు మండలాలతో ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. - పుట్టపర్తి
కదిరి డివిజన్‌లోని కదిరి, తలుపుల, నంబులిపులికుంట, గండ్లపెంట, నల్లచెరువు, తనకల్లు, పుట్టపర్తి, నల్లమడ, బుక్కపట్నం, కొత్త చెరువు, ఓడి చెరువు, అమడగుర్ మండలాలతో డివిజన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఐపీఎల్
ఓటీటీ-వెబ్‌సిరీస్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement