AP PRC: ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదు... మెరుగైన పీఆర్సీ కోసం మరోసారి ఉద్యోగులతో చర్చలు... సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఆర్థిక పరిస్థితిని బ్యాలెన్స్ చేస్తూ పీఆర్సీపై ప్రకటన ఉంటుందని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. పీఆర్సీపై మరోసారి ఉద్యోగులతో చర్చిస్తామన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ సమీర్ శర్మ ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఉద్యోగులకు ఎంత ఫిట్‌మెంట్ ఇవ్వాలనే దానిపై ఈ సమావేశంలో సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. 14.29 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని సీఎస్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 14.29 ఫిట్‌మెంట్‌ను ఉద్యోగ సంఘాలు తిరస్కరించడంతో మరోసారి ఉద్యోగులతో ప్రభుత్వం చర్చించింది. ఫిట్‌మెంట్‌పై ఉద్యోగ సంఘాలతో ఇప్పటికే సీఎస్ పలుమార్లు సమావేశం అయ్యారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను అధికారులు సీఎంకు వివరించారు. త్వరలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశం అవ్వనున్నట్లు తెలుస్తోంది. పీఆర్సీ, ఇతర డిమాండ్ల పరిష్కారంపై సీఎం చర్చించనున్నారు. ఫిట్‌మెంట్‌పై ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.
Also Read: గన్‌మెన్లను తిరస్కరించిన వంగవీటి.. రెక్కీ ఎవరు నిర్వహించారన్నదానిపై పోలీసుల అంతర్గత విచారణ !
ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ
పీఆర్‌సీ ప్రకటనకు మరికొంత సమయం పడుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎంతో సమీక్ష అనంతరం మాట్లాడిన ఆయన.. సీఎం ఆదేశాల మేరకు పీఆర్‌సీపై మళ్లీ ఉద్యోగులతో చర్చించనున్నామన్నారు. పీఆర్‌సీ నివేదికలో స్వల్ప మార్పులు చేస్తు్న్నామని, ఈ ప్రక్రియ త్వరలో పూర్తవుతుందన్నారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని సజ్జల తెలిపారు. ఉద్యోగులు అసంతృప్తి చెందకుండా ఫిట్‌మెంట్ ప్రకటించాలనే లక్ష్యంగా ప్రభుత్వం ఉందన్నారు. బడ్జెట్‌పై పీఆర్‌సీ ప్రభావం అంచనా వేస్తున్నామన్నారు. పీఆర్‌సీ ప్రభావం అంచనాల వల్లే ప్రక్రియ ఆలస్యమవుతోందని సజ్జల పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలతో త్వరలో సీఎం జగన్ చర్చలు ఉంటాయని సజ్జల వివరించారు.
Also Read: మందు బాబులకు గుడ్ న్యూస్.. మద్యం విక్రయ వేళలు పొడిగింపు.. న్యూ ఇయర్ కు తగ్గేదేలే అంటారేమో..
ఆర్థిక పరిస్థితి బాగోలేదు
'ఉద్యోగులకు మెరుగైన పీఆర్సి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ ఆలోచిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఆర్థిక పరిస్థితిని బ్యాలన్స్ చేసుకుంటూ సీఎం నిర్ణయం తీసుకుంటారు. ఏపీలో రామరాజ్యం ఉంది. బీజేపీ వెనుక చంద్రబాబు ఉన్నారు. తన అనుచరుల చేత వెనక ఉండి నడుపుతున్నారు.' అని సజ్జల రామకృష్ణా రెడ్డి వివరించారు.
Also Read: ఏపీలో సన్ ఫార్మా పెట్టుబడులు... సీఎం జగన్ తో సన్ ఫార్మా ఎండీ దిలీప్ షాంఘ్వీ భేటీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి