అన్వేషించండి

Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు

ఖరీఫ్, రబీ పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం (PMFBY) అమలుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల నిర్ణయం ప్రకారమే ప్రీమియం వసూలు చేసి, ఈ బీమా నమోదు వివరాలను ఈ-పంటతో అధికారులు ధ్రువీకరిస్తారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • AP ప్రభుత్వం ఖరీఫ్, రబీకి పంటల బీమా అమలుకు ఉత్తర్వులు.
  • రైతులు వాటా ప్రీమియం చెల్లిస్తేనే బీమా, చేరడం ఐచ్ఛికం.
  • పంట నమోదు గడువులు, జిల్లా సంస్థల వివరాలు స్పష్టం చేశారు.
  • ఫార్మర్ ఐడీ తప్పనిసరిపై కేంద్రానికి రాష్ట్రం మినహాయింపు కోరింది.

Pradhan Mantri Fasal Bima Yojana | అమరావతి: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులందరికీ శుభవార్త అందించింది. ఖరీఫ్, రబీ సీజన్లలో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం (PMFBY)తో పాటు, సవరించిన వాతావరణ ఆధారిత బీమా పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద సాగు చేసిన పంటల వారీగా తమ వాటా ప్రీమియం చెల్లించిన రైతులకు మాత్రమే బీమా వర్తిస్తుంది. ఇందుకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా మొత్తాలను ఆయా ప్రభుత్వాలు భరించనున్నాయి. ఏయే జిల్లాల్లో ఏ బీమా సంస్థలు ఈ పథకాన్ని అమలు చేస్తాయి, ఏ పంటలకు ఇది వర్తిస్తుంది, నమోదు చేసుకోవడానికి చివరి తేదీలపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.

రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య, ఈ-క్రాప్ ధ్రువీకరణ
పంటల బీమా పథకానికి నమోదు చేసుకోవడానికి రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధారంగా ప్రక్రియ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. 2026–27 నుంచి ఫసల్ బీమా యోజనలో నమోదు చేసుకునే రైతులకు అగ్రిస్టాక్‌ ఫార్మర్‌ రిజిస్ట్రీలో నమోదైన ఫార్మర్‌ ఐడీ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం పేర్కొంది. అయితే, దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విజ్ఞప్తి చేసినప్పటికీ, ఇంకా ఆదేశాలు రాలేదు. ఒకవేళ కేంద్రం అనుమతిస్తే, ఈ ఫార్మర్ ఐడీతో సంబంధం లేకుండానే రైతులు నమోదు చేసుకోవచ్చు. 

Also Read: Dalit Christian Vote Bank Politics: వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?

ఈ బీమా పథకంలో చేరాలా వద్దా అనేది పూర్తిగా రైతుల వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. పంట రుణాలు పొందే రైతుల నుంచి బ్యాంకులు ప్రీమియం వసూలు చేస్తాయి. ఒకవేళ బీమా వద్దనుకుంటే రైతులు ఆ మేరకు పత్రం సమర్పిస్తే బ్యాంకుల్లో ప్రీమియం మినహాయించరు. ఈ పథకాన్ని రాష్ట్రంలోని 26 పాత జిల్లాల ప్రాతిపదికన అమలు చేయనుండగా, బీమా నమోదు సమాచారాన్ని ఈ-పంట (e-Panta) డేటాతో అధికారులు ధ్రువీకరించనున్నారు.

ఖరీఫ్‌లో: ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం (PMFBY) కింద వరికి ఆగస్టు 15, ఇతర అన్నిరకాల నోటిఫైడ్‌ పంటలకు జులై 31 వరకు నమోదు చేసుకోవచ్చు. వాతావరణ ఆధారిత బీమా పథకం కింద అన్నిరకాల నోటిఫైడ్‌ పంటలకు జులై 15లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. 

రబీలో: ఈ పథకం కింద వరికి డిసెంబర్‌ 31, ఇతర అన్నిరకాల నోటిఫైడ్‌ పంటలకు డిసెంబర్‌ 15 వరకు గడువు ఇచ్చారు. అయితే వాతావరణ ఆధారిత బీమా పథకం కింద జీడిమామిడికి నవంబర్‌ 15 వరకు, టమాటాకు డిసెంబర్‌ 15లోగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

పీఎంఎఫ్‌బీవై అమలు సంస్థ, జిల్లాలు

జనెరాలి సెంట్రల్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ: అనంతపురం, తిరుపతి, వైఎస్సార్‌ కడప, నంద్యాల, పల్నాడు, విశాఖపట్నం, గుంటూరు, శ్రీకాకుళం.

టాటా ఏఐజీ జనరల్‌ ఇన్సూరెన్స్‌: చిత్తూరు, కర్నూలు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కృష్ణా, బాపట్ల, అనకాపల్లి, అంబేడ్కర్‌ కోనసీమ, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం.

ఐసీఐసీఐ లాంబార్డ్‌: ప్రకాశం, అన్నమయ్య, ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు.

అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ: విజయనగరం, పశ్చిమ గోదావరి, శ్రీసత్యసాయి.

Also Read: ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు

వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు సంస్థ, జిల్లాలు

ఇండస్‌లాండ్‌ ఇన్సూరెన్స్‌: కర్నూలు జిల్లా

అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ: అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అంబేడ్కర్‌ కోనసీమ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, ఏలూరు, నంద్యాల, అనంతపురం, 

ఇఫ్‌కో టోకియో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ:  శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, తూర్పు గోదావరి, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, తిరుపతి

Frequently Asked Questions

ఏపీ ప్రభుత్వం రైతుల కోసం ఏ బీమా పథకాలను అమలు చేస్తోంది?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం (PMFBY) మరియు సవరించిన వాతావరణ ఆధారిత బీమా పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలు ఖరీఫ్, రబీ సీజన్లలో పంటలకు బీమాను అందిస్తాయి.

ఈ బీమా పథకంలో చేరడం తప్పనిసరా?

ఈ బీమా పథకంలో చేరాలా వద్దా అనేది పూర్తిగా రైతుల వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. బీమా వద్దనుకుంటే రైతులు ఆ మేరకు పత్రం సమర్పిస్తే బ్యాంకుల్లో ప్రీమియం మినహాయించరు.

ఖరీఫ్ సీజన్‌కు పంట బీమా నమోదు చివరి తేదీలు ఏమిటి?

ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద వరికి ఆగస్టు 15, ఇతర పంటలకు జులై 31 వరకు గడువు ఉంది. వాతావరణ ఆధారిత బీమా పథకానికి అన్ని పంటలకు జులై 15 చివరి తేదీ.

రబీ సీజన్‌కు పంట బీమా నమోదు చివరి తేదీలు ఏమిటి?

PMFBY కింద వరికి డిసెంబర్ 31, ఇతర పంటలకు డిసెంబర్ 15 వరకు గడువు. వాతావరణ ఆధారిత పథకానికి జీడిమామిడికి నవంబర్ 15, టమాటాకు డిసెంబర్ 15 చివరి తేదీ.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Breaking News:మహిళల రక్షణలో చారిత్రాత్మక తీర్పు.. లైవ్-ఇన్ వేధింపులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మహిళల రక్షణలో చారిత్రాత్మక తీర్పు.. లైవ్-ఇన్ వేధింపులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Embed widget