Ram Gopal Varma: ఆర్జీవీకి గట్టి షాక్ ఇచ్చిన ఫైబర్ నెట్ - డబ్బులన్నీ వడ్డీతో సహా కట్టాలని నోటీసులు
RGV: ఫైబర్ నెట్ నుంచి తీసుకున్న డబ్బులు కట్టాలని ఆర్జీవీకి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్దంగా ప్రజాధనం తీసుకున్నారని ఫైబర్ నెట్ నోటీసుల్లో పేర్కొంది.
AP Government has issued notices to RGV to pay the money taken from fiber net: రామ్ గోపాల్ వర్మకు మరో షాక్ తగిలింది. ఆయన వ్యూహం సినిమా తీసి ఫైబర్ నెట్ లో విడుదల చేశారు. అందు కోసం రూ. కోటి పదిహేను లక్షల రూపాయలు తీసుకున్నారు. ఆ మొత్తం తిరిగి పన్నెండు శాతం వడ్డీతో తిరిగి ఇచ్చేయాలని ఫైబర్ నెట్ నోటీసులు జారీ చేసింది. అసలు వ్యూస్ లేకపోయినా డబ్బులు తీసుకున్నారని నోటీసుల్లో తెలిపింది.
రామ్ గోపాల్ వర్మ గత ఎన్నికలకు ముందు దాసరి కిరణ్ కుమార్ అనే నిర్మాత పెట్టుబడి పెడితే.. రెండు సినిమాలు తీశారు. రెండూ జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదిగారు..ఎంత గొప్ప వ్యక్తి అన్నది చూపించడానికేనని ప్రకటించారు. వ్యూహం, శపథం అనే పేర్లతో ఈ సినిమాలు తీశారు. మొదటగా వ్యూహం రిలీజ్ చేశారు. ధియేటర్లలో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.అయితే దాన్ని ఫైబర్ నెట్ లో రిలీజ్ చేశారు.దానికి తగ్గ ఒప్పందాలేమిటో కూడా బయటపెట్టలేదు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ..ఫైబర్ నెట్ లెక్కలు చూసినప్పుడు అసలు విషయం బయటపడింది.
ఇటీవల సోషల్ మీడియాకేసుల్లో ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి.ఆయన కోర్టుకెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆనయ సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశం,జనసేన నేతలపై అభ్యంతరకంగా ప్రచారం చేశారు.ఈ అంశంపై ఆయా పార్టీల కార్యకర్తలుల చాలా చోట్ల ఫిర్యాదులు చేశారు.ఇప్పుడు ప్రభుత్వ సొమ్ము అక్రమంగా పొందడంపై విచారణ ప్రారంభమయింది.