News
News
X

AP Plastic Flex Ban : ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధం, నవంబర్ 1 నుంచి అమల్లోకి!

AP Plastic Flex Ban : ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించింది. నవంబర్ 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది.

FOLLOW US: 

AP Plastic Flex Ban : ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధిస్తామని ఇటీవల సీఎం జగన్ ప్రకటించారు. ఇటీవల విశాఖలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధిస్తామన్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారికంగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. నవంబర్‌ 1వ తేదీ నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం అమల్లోకి తీసుకోస్తామని స్పష్టం చేసింది. ఇకపై రాష్ట్రంలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల ఉత్పత్తి, దిగుమతికి అనుమతి లేదని నోటిఫికేషన్ లో పేర్కొంది. 

ఉత్తర్వులు అతిక్రమిస్తే చర్యలు 

ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల వినియోగం, తయారీ, రవాణా, ప్రదర్శనపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ముఖ్యంలో నగరాలు, పట్టణాల్లో ఈ నిషేధం అమలుకు పూర్తి అధికారులు బాధ్యత వహించాలని రాష్ట్ర గ్రామాల్లో ఫ్లెక్సీలు వాడకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని ప్రభుత్వం స్పష్టంచేసింది. నిబంధనలు అతిక్రమిస్తే ఫ్లెక్సీకి రూ.100 చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం ఉత్తర్వులు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జీవోలో వెల్లడించింది. నిషేధం అమలును పోలీస్‌, రవాణా, జీఎస్టీ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్లాస్టిక్‌కు బదులుగా కాటన్‌, నేత వస్త్రాలు వినియోగించాలని పేర్కొంది.

NTR: ఇలా చేస్తే YSR స్థాయి పెరగదు - ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై తారక్ స్పందన

2027 కల్లా ప్లాస్టిక్ ఫ్రీ ఏపీ 

ఏపీలో ప్లాసిక్‌ ఫ్లెక్సీలను పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇకపై రాష్ట్రంలో ఫ్లెక్సీలు పెట్టాలంటే ప్లాస్టిక్ ఫ్లెక్సీలు పెట్టకూడదని, కాస్త రేటు ఎక్కువైనా గుడ్డతో తయారుచేసినవే పెట్టాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పౌరులుగా సముద్ర తీరాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిదని జగన్ అన్నారు. సముద్రతీర స్వచ్ఛత, ప్టాస్టిక్‌ రహిత నదీ జలాల అంశంపై పార్లే ఫర్‌ ది ఓషన్‌ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఇటీవల ఎంవోయూ కుదుర్చుకుంది. సీఎం జగన్‌ సమక్షంలో పార్లే ఫర్‌ ది ఓషన్‌ సంస్థతో ఈ ఎంవోయూ కుదిరింది. భూమిపై 70 శాతం ఆక్సిజన్‌ సముద్రం నుంచే వస్తోంది. అందుకే సముద్రాన్ని కాపాడుకోవాలి. పార్లే ఫర్ ది ఓషన్ సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను బయటకు తీస్తుంది. రీ సైకిల్‌ చేసి కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తుంది. అంతేకాకుండా, పార్లే ఫ్యూచర్‌ ఇనిస్టిట్యూట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనున్నారని సీఎం జగన్‌ వెల్లడించారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల బ్యాన్‌ ని ఏపీలో తొలి అడుగుగా సీఎం జగన్‌ చెప్పారు. 2027 కల్లా ఏపీని ప్లాస్టిక్‌ ఫ్రీ స్టేట్‌గా మారుస్తామని సీఎం జగన్ ప్రకటించారు.  

Also Read : APSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్, దసరా నాటికి నాన్ ఏసీ స్లీపర్ బస్సులు!

Also Read : CM Jagan Review : డిసెంబర్ నాటికి లబ్దిదారులకు ఇళ్లు, మౌలిక సదుపాయాల కల్పనలో రాజీపడొద్దు - సీఎం జగన్

Published at : 22 Sep 2022 07:17 PM (IST) Tags: AP News CM Jagan AP Govt Plastic flex ban November 1st

సంబంధిత కథనాలు

YSR Kalyanamasthu : నేటి నుంచి అమల్లోకి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా- వెబ్ సైట్ ప్రారంభించిన సీఎం జగన్

YSR Kalyanamasthu : నేటి నుంచి అమల్లోకి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా- వెబ్ సైట్ ప్రారంభించిన సీఎం జగన్

Chittoor Crime : కన్న కూతురిపై అత్యాచారం కేసులో తల్లిదండ్రులకు జీవిత ఖైదు, ఫోక్సో కోర్టు సంచలన తీర్పు

Chittoor Crime : కన్న కూతురిపై అత్యాచారం కేసులో తల్లిదండ్రులకు జీవిత ఖైదు, ఫోక్సో కోర్టు సంచలన తీర్పు

Nagarjuna No Politics : విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Nagarjuna No Politics :  విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Minister Jogi Ramesh : సత్య కుమార్ ఒళ్లు దగ్గర పెట్టుకో, నీ వెనకాల ఎవరున్నారో మాకు తెలుసు- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh : సత్య కుమార్ ఒళ్లు దగ్గర పెట్టుకో, నీ వెనకాల ఎవరున్నారో మాకు తెలుసు- మంత్రి జోగి రమేష్

Kurnool News : రోజంతా మేత పెట్టలేదు, కర్నూలు మున్సిపల్ ఆఫీసులో గాడిదలతో నిరసన

Kurnool News : రోజంతా మేత పెట్టలేదు, కర్నూలు మున్సిపల్ ఆఫీసులో గాడిదలతో నిరసన

టాప్ స్టోరీస్

68th National Film Awards: జాతీయ అవార్డుల ప్రధానోత్సవం - ఐదు అవార్డులతో ఓ మెరుపు మెరిసిన సూర్య, జ్యోతిక, ప్రత్యేక ఆకర్షణగా తమన్!

68th National Film Awards: జాతీయ అవార్డుల ప్రధానోత్సవం - ఐదు అవార్డులతో ఓ మెరుపు మెరిసిన సూర్య, జ్యోతిక, ప్రత్యేక ఆకర్షణగా తమన్!

JioPhone 5G Launch: రూ.8 వేలలోపే జియో 5జీ ఫోన్! - ఫీచర్లు కూడా లీక్!

JioPhone 5G Launch: రూ.8 వేలలోపే జియో 5జీ ఫోన్! - ఫీచర్లు కూడా లీక్!

Nanjiyamma: ఎవరీ నంజియమ్మ - మొదటి ప్రొఫెషనల్ సినిమాతోనే నేషనల్ అవార్డు!

Nanjiyamma: ఎవరీ నంజియమ్మ - మొదటి ప్రొఫెషనల్ సినిమాతోనే నేషనల్ అవార్డు!

Vivo X Fold Plus: రూ.లక్షకు పైగా రేటుతో వివో కొత్త ఫోన్ - మొబైల్ మడిచి జేబులో పెట్టుకోవడమే!

Vivo X Fold Plus: రూ.లక్షకు పైగా రేటుతో వివో కొత్త ఫోన్ - మొబైల్ మడిచి జేబులో పెట్టుకోవడమే!