AP IPS Officers Transfers : ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలు, కోనసీమ ఎస్పీపై బదిలీ వేటు!
AP IPS Officers Transfers : ఏపీలో ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఐదుగురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అమలాపురం అల్లర్ల నేపథ్యంలో కోనసీమ ఎస్పీపై వేటు పడింది.
AP IPS Officers Transfers : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. కృష్ణా జిల్లా ఎస్పీగా జాషువా, కర్నూలు ఎస్పీగా సిద్ధార్థ్ కౌశల్ నియమించింది. కోనసీమ ఎస్పీ సుబ్బారెడ్డి పై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం, కోనసీమ ఎస్పీగా సుధీర్ కుమార్ రెడ్డి నియమించింది. విజయవాడ డీసీపీగా విశాల్ గున్నిని నియమించిన ప్రభుత్వం, కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ బదిలీ చేసింది.
కోనసీమ ఎస్పీగా
కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ బదిలీ అయ్యారు. జిల్లా ఎస్పీగా పని చేస్తున్న ఆయన్ను కర్నూలు జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీగా పి.జాషువాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోనసీమ జిల్లా ఎస్పీ కె.ఎస్.ఎస్.వి సుబ్బారెడ్డి బదిలీ అయ్యారు. ఇటీవల అమలాపురంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఎస్పీ సుబ్బారెడ్డిపై బదిలీ వేటు పడింది. జిల్లా నూతన ఎస్పీగా సీహెచ్ సుధీర్ కుమార్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. కోనసీమ ఎస్పీ సుబ్బారెడ్డి ఆరో బెటాలియన్ కమాండెంట్ కి బదిలీ అయ్యారు.