By: Harish | Updated at : 13 Dec 2022 05:38 PM (IST)
సంక్రాంతి తర్వాత ప్రభుత్వంపై సమరమే !
APNGOs Fire : ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరోసారి ఆందోళన బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. పెండింగ్ లో ఉన్న డిమాండ్ల పై ఉద్యోగుల సంఘం నేతలు సమావేశం అయ్యారు. జనవరి 15 ప్రభుత్వం కు డెడ్ లైన్ ఇచ్చారు.అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె చేస్తామని ప్రకటించారు. విజయవాడలో ఎపీ జేఎసి అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని నాయకులు ఆవేదన వెలిబుచ్చారు.
బకాయిలు అడగకూడదనే జీతాలు ఆలస్యం చేస్తున్నారన్న ఉద్యోగ నేతలు
ఏపీజేఏసీ అమరావతి మూడో మహా సభ కర్నూలు లో ఫిబ్రవరి ఐదో తేదీన జరుపుతామని..వేలాదిగా ఉద్యోగులు అంతా తరలి రావాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఉద్యోగుల సమస్యలు పై సమావేశంలో వాడివేడిగా చర్చ సాగిందని.. మాకు రావాల్సిన వేలకోట్లు రూపాయలు ఇవ్వకపోగా..ప్రతి నెలా భత్యాలు కూడా ఒకటో తేదీకి ఇవ్వడం లేదన్నారు.రెండేళ్లు పాటు భరించాం..ప్రభుత్వానికి ఇది ఒక అలవాటు గా మారిందని ఫైర్ అయ్యారు. జీతాలు, పెన్షన్ లు ఇరవై తేదీ అయినా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీత, భత్యాల కోసం ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి తెచ్చారన్నారు. బకాయిలు అడగకూడదనే... జీతాలు ఆలస్యం చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉందని మండిపడ్డారు.
సీఎం హామీ ఇచ్చినా బకాయిలు ఇవ్వడం లేదన్న బొప్పరాజు
మేము దాచి పెట్టుకున్న డబ్బులు కోట్ల రూపాయలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, ఆ డబ్బులు ఇవ్వకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారని నిలదీశారు. పదవీ విరమణ చేసిన రోజే బెన్ ఫిట్స్ ఇచ్చి పంపాలని నిబంధన ఉందని, అయితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో రిటైర్ అయిన ఉద్యోగులు మధన పడుతున్నారని వివరించారు.రిటైర్ అవ్వాలంటే ఉద్యోగులు భయపడుతయన్నారన్నారు. ఉద్యోగి చనిపోతే మట్టి ఖర్చు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వెలిబుచ్చారు.అధికారి తన జేబులో డబ్బు ఇస్తున్నారని, ఉద్యోగులు, పెన్షనర్ల వద్ద డబ్బు కట్ చేసి వెనక్కి తీసుకున్నారని తెలిపారు. సిఎం తో చర్చల్లో బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఒక్క రూపాయి ఇవ్వకపోగా, జీతాలు కూడా ఇవ్వడం లేదన్నారు.
జీతాలు ఒకటో తేదీనే ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్
తమకు రావాల్సిన బకాయిల పై గతలో ఉద్యోగులంతా ఛలో విజయవాడ ఉద్యమాన్ని నిర్వహించారని,ఆ తరువాత కూడా చెల్లింపులో పురోగతి లేదన్నారు. సీపీఎస్ రద్దు, ఉద్యోగాలు పర్మినెంట్, జీత భత్యాల చెల్లింపు అన్నారని,స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయలేదన్నారు.తమ డబ్బు తిరిగి ఇస్తారా లేదా..కష్టపడి పని చేసినా జీతం ఇవ్వకపోవటం దారుణమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి తామంతా సహకరిస్తూనే ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. బకాయిలు చెల్లింపు, ఒకటో తేదీన జీత భత్యాల పై సిఎం సమావేశం నిర్వాహించాలని బొప్పరాజు డిమాండ్ చేశారు.ఉద్యోగ సంఘాలు తో చర్చ చేసి హామీ ఇవ్వాలని,అధికారులు, మంత్రి వర్గ ఉప సంఘం హామీ ఇవ్వలేక పోతుందన్నారు.సిఎం స్వయంగా వీటి పై స్పందించాలని కోరుతున్నామన్నారు.
సంక్రాంతి తరువాత ఉద్యమం..!
ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోతే, సంక్రాంతి తరువాత ప్రత్యక్ష కార్యాచరణ కు దిగుతామని హెచ్చరించారు.సిపియస్ పై పదే పదే చర్చ ల పేరుతో ఎందుకు పిలుస్తున్నారని ప్రశ్నించారు.ఓపియస్, సిపియస్ రెండే దేశంలో ఉన్నాయని,వీటి పై సమావేశం పేరుతో మమ్మలని ఎందుకు ఇబ్బంది పెడతారో అర్దం కావటం లేదని మండిపడ్డారు.ఆరు రాష్ట్రాల్లో సిపియస్ రద్దు చేశారని తెలిపారు.తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో రద్దు, సిక్కిం కూడా కమిటీ వేసిందని వివరించారు.ఇక చర్చలతో పని లేదు... మేము వెళ్లేది లేదని స్పష్టంచేశారు.
Gudivada Politics : గుడివాడలో పోటీ చేస్తా - కొడాలి నానిని ఇంటికి పంపిస్తా !
VJA Durga Temple Politics : దేవాదాయ శాఖలో వెల్లంపల్లి జోక్యం చేసుకుంటున్నారా? వైఎస్ఆర్సీపీలో మరో వివాదం
Breaking News Live Telugu Updates: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా?: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
AP Cabintet : ఏపీ మంత్రి వర్గం కీలక నిర్ణయాలు - వాటన్నింటికీ గ్రీన్ సిగ్నల్
Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్న్యూస్! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్ తెస్తున్నారు!
PM Modi On Opposition: ఈడీ దెబ్బకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి,ప్రజలే నా రక్షణ కవచం - ప్రధాని మోదీ