AP CMRF Scam : ఏపీ సీఎం నిధిని కొల్లగొట్టింది వాళ్లేనా ? ఏసీబీ విచారణలో వెలుగులోకి కీలక విషయాలు
ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధి డబ్బులను కొల్లగొట్టిందెవరు ? ప్రజా ప్రతినిధుల పీఏలు, అనుచరులు, యాభై మంది ఉద్యోగులపై ఏసీబీ కన్ను
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సహాయనిధి నిధుల గోల్ మాల్ వ్యవహారం అంతకంతకూ పెద్దదవుతోంది. యాబై మంది ఉద్యోగుల పాత్రతో పాటు అనేక మంది ప్రజా ప్రతినిధుల పీఏలు, ఇతరులు కలిసి సీఎంఆర్ఎఫ్ నిధులు కొల్లగొట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తం రూ. 117 కోట్లను ఇలా గల్లంతు చేశారని గుర్తించిన ఏసీబీ చాలా కాలంగా విచారణ జరుపుతోంది. దీనికి సంబంధించి గతేడాది సెప్టెంబర్‌లో ఈ కేసు నమోదైంది. అప్పట్నుంచి విచారమ జరుపుతున్నారు. కొంత మంది ఉద్యోగుల్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరికొందరిపై తాజాగా అధారాలు లభించినట్లుగా తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల ఏపీలు, వారి అనుచరులు ఉద్యోగులతో కుమ్మక్కయి స్వాహా చేసినట్లుగా చెబుతున్నారు. వారెవరన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.Also Read : వాళ్లిద్దరు ఎవరు ? వివేకా హత్య కేసులో టీవీ చానళ్లకు సీబీఐ నోటీసులు !
సీఎంఆర్ఎఫ్ పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణ మేరకు వినియోగించే నిధి. ఆరోగ్యశ్రీతో సేవలు పొందలేని రోగాలు.. ఇతర అసాధారణమైన నష్టాల వల్ల రోడ్డున పడ్డకుటుంబాలు.. ఇలాంటి వారిని ఆదుకునేందుకు ఏపీ సీఎం నేరుగా సాయంచేసేందుకు ఈ ఫండ్‌ను ఎక్కువగా వినియోగిస్తారు. ప్రభుత్వానికి ఎవరైనా విరాళాలు ఇవ్వాలంటే సీఎంఆర్ఎఫ్‌కే ఇస్తారు. కరోనా పరిస్థితుల కారణంగా విరాళాలు ఇవ్వాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, ఇతరులు కూడా విరాళాలు సీఎంఆర్ఎఫ్‌కు జమ చేశారు. ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాల వారీగా నిధులు సమీకరించి సీఎంఆర్ఎఫ్‌కు ఇచ్చారు. ఇటీవల ఏపీ సర్కార్ ఉచిత వ్యాక్సిన్లను పంపిణీ చేయాలనుకున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున విరాళాలు కోరారు. అయితే ఆ తర్వాత కేంద్రం ఉచితంగా పంపిణీ చేసింది. Also Read : శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ సర్టిఫికేట్ ఉంటేనే దర్శనం.. కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చిన టీటీడీ
గత ఏడాది సెప్టెంబర్‌లో సీఎంఆర్ఎఫ్ పేరుతో.. అసిస్టెంట్ సెక్రటరీ టు గవర్నమెంట్, రెవిన్యూ శాఖ ఇచ్చినట్లుగా చెబుతున్న మూడు చెక్కులు.. ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు ఎస్‌బీఐ బ్రాంచీల్లో జమ అయ్యాయి. మూడు కలిపి రూ. 117 కోట్లు సొమ్ము తమ ఖాతాలకు మళ్లించుకోవాలనుకున్నారు. అది పెద్ద మొత్తం కావడంతో ఆయా బ్రాంచ్‌ల అధికారులు.. ఇక్కడ వెలగపూడి బ్రాంచ్ అధికారులను సంప్రదించారు. వారు చెక్కులు జారీ చేసిన అధికారులను సంప్రదించారు. అవి నకిలీ చెక్కులని తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: TTD High Court : 52 మంది టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులకు షాక్ .. జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు
అప్పుడే సీఎంఆర్ఎఫ్ విషయంలో విచారణ ప్రారంభమయింది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కార్యాలయంలో పని చేసే ఉద్యోగి ఇలాంటి ఫేక్ చెక్కులతో కొన్ని నిధులు డ్రా చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఆ ఉద్యోగి నారాయణ కాలేజీ మాజీ ఉద్యోగి అని.. అతని అక్రమాలతో తనకు సంబంధం లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ప్రకటించారు. అప్పటి నుంచి ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నారు. యాభై మంది ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, పీఏలు అని చెబుతున్నారు కానీ వారెవరన్నదానిపై మాత్రం స్పష్టత లేకుండా పోయింది.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో సవాళ్ల సీజన్ ! అందరూ కాస్కోమంటారు.. ముందడుగు వేసేదెవరు ?