అన్వేషించండి

CM Jagan's Review : విశాఖలో ప్రతిష్టాత్మక సదస్సులపై సీఎం సమీక్ష, ఏర్పాట్లపై అధికారులకు కీలక ఆదేశాలు

CM Jagan's Review : విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, జీ-20 సదస్సు ఏర్పాట్లపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

 CM Jagan's Review : విశాఖలో త్వరలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్-2023, జీ-20 వర్కింగ్‌ గ్రూపు సన్నాహక సమావేశాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. మార్చి 3, 4తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్-2023 వాస్తవిక పెట్టుబడులు లక్ష్యంగా ఉండాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.  రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్నఅపార అవకాశాలను సమగ్రంగా వివరించేలా కార్యక్రమం రూపొందించాలన్నారు. కొత్త తరహా ఇంధనాల తయారీ సహా ప్రపంచ వ్యాప్తంగా కొత్త తరహా ఉత్పత్తుల తయారీకి ఏపీ వేదిక కావాలని సీఎం సూచించారు. దీనికి గ్లోబల్‌  ఇన్వెస్టర్స్‌ సదస్సు ఊతం ఇవ్వాలని ఆకాంక్షించారు. 

విదేశాల్లో రోడ్ షోలు నిర్వహించనున్న అధికారులు

గ్లోబల్‌  ఇన్వెస్టర్స్‌ సదస్సు సందర్భంగా వివిధ దేశాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తామని అధికారులు వివరించగా..విదేశాలకు వెళ్తున్నప్పుడు అక్కడున్న పారిశ్రామిక వాడలను పరీశించాలని సూచించారు. అలాగే ఆ దేశాల్లో ఎంఎస్‌ఎంఈలు నడుస్తున్న తీరుపై అధ్యయనం చేయడంతోపాటు వాటి నిర్వహణా పద్ధతులను మన రాష్ట్రంలో అవలంభించడంపై దృష్టిపెట్టాలన్నారు ముఖ్యమంత్రి. 

2019 నుంచి రూ.1.81కోట్ల పెట్టుబడులు

2014 నుంచి 2019లో రూ.18.87 లక్షల కోట్లకు ఎంఓయూలు చేసుకుంటే.. ఏడాదికి పెట్టుబడులు సగటున రూ.11,994 కోట్లు వచ్చాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2019 నుంచి 2022వరకు  సగటున ఏడాదికి పెట్టుబడులు రూ. 15,693 కోట్లు వచ్చాయని వెల్లడించారు. 2019 జూన్‌ నుంచి ఇప్పటివరకూ రూ.1,81,821 కోట్ల పెట్టుబడులు రాగా 1,40,903 మందికి ఉద్యోగాలు వచ్చాయని అధికారులు తెలిపారు. 

జీ-20 సదస్సుకు 250 మంది విదేశీ ప్రతినిధులు

విశాఖలో మార్చి 28 నుంచి 29వరకు జరగనున్న జీ–20 సన్నాహక సదస్సు కోసం ఏర్పాట్లు తదితర అంశాలపైనా సీఎం సమీక్ష చేశారు. ప్రపంచదేశాల నుంచి 250 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. పెట్టబడులకు ఏపీలో ఉన్న అవకాశాలపై ప్రతినిధులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు ఉండాలని సూచించారు. విశాఖపట్నం నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రధాన జంక్షన్లు, బీచ్‌ రోడ్డులో సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. అన్ని రోజుల్లోనూ ఇవి ఇలాగే ఉండేలా తగిన కార్యాచరణ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

ఆతిథ్యంలో లోటులేకుండా చూడాలని సీఎం ఆదేశం

ఆతిథ్యం, రవాణా ఏర్పాట్లల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని, ఏర్పాట్లకు సంబంధించిన ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రతినిధులు పర్యాటక ప్రదేశాల సందర్శన సమయంలో ఎలాంటి లోపాలకు తావులేకుండా చూడాలన్నారు.  ప్రతినిధులకు భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే జీ-20 సన్నాహాక ఈ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు సౌలభ్యంగా ఉండేందుకు ఒక మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్టు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Actor Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
Vaikunta Ekadasi Tirupati Stampede Tragedy :  వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
KTR: 'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP DesamTirupati Pilgrims Stampede 6died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP DesamTirupati Pilgrims Stampede 4died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Actor Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
Vaikunta Ekadasi Tirupati Stampede Tragedy :  వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
KTR: 'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
Tirumala News: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం - తొలి 3 రోజులకు టోకెన్ల జారీ పూర్తి, వారికి మాత్రమే దర్శనానికి ఎంట్రీ
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం - తొలి 3 రోజులకు టోకెన్ల జారీ పూర్తి, వారికి మాత్రమే దర్శనానికి ఎంట్రీ
Athomugam OTT Release Date: భార్య ఫోనులో భర్త స్పై యాప్ ఇన్‌స్టాల్ చేస్తే... ఐఎండీబీలో 7 రేటింగ్ వచ్చిన తమిళ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
భార్య ఫోనులో భర్త స్పై యాప్ ఇన్‌స్టాల్ చేస్తే... ఐఎండీబీలో 7 రేటింగ్ వచ్చిన తమిళ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకం - అర్హతలు, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు, పూర్తి వివరాలివే!
ఇందిరమ్మ ఇళ్ల పథకం - అర్హతలు, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు, పూర్తి వివరాలివే!
MODI WARNS LOKESH: 'నీపై ఓ కంప్లైంట్ ఉంది' - విశాఖలో సభా వేదికపైనే మంత్రి లోకేశ్‌కు ప్రధాని మోదీ స్వీట్‌ వార్నింగ్‌
'నీపై ఓ కంప్లైంట్ ఉంది' - విశాఖలో సభా వేదికపైనే మంత్రి లోకేశ్‌కు ప్రధాని మోదీ స్వీట్‌ వార్నింగ్‌
Embed widget