అన్వేషించండి

Chandrababu In Delhi: రాజధాని అమరావతికి చట్టబద్ధత సహా నదీ జలాల వివాదంపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ

Andhra Pradesh News | ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. అమిత్ షా, సీఆర్ పాటిల్ సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీ అవుతున్నారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ప్రయోజనాలపై చర్చిస్తున్నారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించారు. ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల్లో పురోగతి, కేంద్రం సహకారంపై కేంద్ర మంత్రులో చంద్రబాబు వరుసగా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో అమిత్ షాతో భేటీలో భాగంగా ఇదివరకే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని కేంద్రం నిర్ణయించగా.. అమరావతికి చట్టబద్ధతకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిపినట్లు సమాచారం. పార్లమెంట్ బడ్జెట్‌ రెండో దశ సమావేశాల్లో రాష్ట్రానికి కీలకమైన ఈ బిల్లు పెట్టాలని కేంద్ర మంత్రిని సీఎం చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. 


Chandrababu In Delhi: రాజధాని అమరావతికి చట్టబద్ధత సహా నదీ జలాల వివాదంపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ

సాగునీటి ప్రాజెక్టులు, కేంద్రం సాయంపై చర్చలు..

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయంపై విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రయోజనాలు, రైతుల భవిష్యత్, తాగునీటి భద్రతకు ఇవి ఎంతో ముఖ్యమని వివరించారు. వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై పెండింగ్‌లో ఉన్న అంశాలతో పాటు, అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపైనా చర్చించారు.  ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు అధికారులు ఉన్నారు.


Chandrababu In Delhi: రాజధాని అమరావతికి చట్టబద్ధత సహా నదీ జలాల వివాదంపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలని, ఈ ఆర్డర్‌ కారణంగా ప్రాజెక్టు అమలులో అవరోధాలు ఏర్పడుతున్నాయని చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్‌మెంట్ చేయాలని కోరారు.

పోలవరం ప్రాజెక్టు ఫేజ్–IIకి ఆర్థిక సహాయం అందించాలి... ఫేజ్–IIలో భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టలు వంటి పనులు చేపట్టాలని చంద్రబాబు తెలిపారు. వీటికి అదనంగా దాదాపు రూ.32,000 కోట్ల నిధులు అవసరం అన్నారు. గోదావరి వరద జలాలను వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో పోలవరం– నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు చేశారు.  ఇది తాగునీరు, సాగునీరు, పరిశ్రమల అవసరాలు తీర్చే కీలక ప్రాజెక్టు అని చంద్రబాబు స్పష్టం చేశారు. 

జాతీయ నదుల అనుసంధాన విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసి, సాంకేతిక, ఆర్థిక సాయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ- ఒడిశా మధ్య వంశధార నీటి వివాదాన్ని పరిష్కరించాలని చంద్రబాబు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. వంశధార నీటి వివాద ట్రిబ్యునల్ (వీడబ్ల్యుడీటీ) తుది నివేదిక గెజెట్‌లో ప్రచురించాలని, ట్రిబ్యునల్ నివేదికను వెంటనే గెజెట్‌లో ప్రచురించి, వంశధారపై నిర్మించే నేరడి బ్యారేజ్ నిర్మాణానికి అడ్డంకులు లేకుండా చేయాలని కోరారు. 


Chandrababu In Delhi: రాజధాని అమరావతికి చట్టబద్ధత సహా నదీ జలాల వివాదంపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ

గోదావరి జలాల పంపకంపై ఏపీ- తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతోందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. నదీ జలాల పంపకం కోసం గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలి. ఎగువ కృష్ణాపై ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపునకు కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే దిగువ ప్రవాహ జలాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని కేంద్ర మంత్రికి తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget