Murali Nayak: మురళి నాయక్ పేరుతో “యువ పురస్కారం” -ప్రభుత్వానికి బీజేపీ నాయకుల విజ్ఞప్తి
Vishnu: మురళీనాయక్ పేరుతో యువ పురస్కారం ఇవ్వాలని ఏపీ బీజేపీ నేతలు కోరారు. మురళీనాయక్ కుటుంబసభ్యుల్ని ఏపీ బీజేపీ నేతలు పరామర్శించారు.

Murali Nayak youth award: భారతదేశ రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన తెలుగు బిడ్డ, అమరవీరుడు మురళి నాయక్ పేరు మీద యువ పురస్కారం ఇవ్వాలన్న ప్రతిపాదను ఏపీ బీజేపీ నేతలు చేశారు. మరళీనాయక్ త్యాగంతో యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. మురళీనాయక్ కుటుంబాన్ని ఏపీ బీజేపీ నేతలు పరామర్శించారు. దేశ సేవలో తాను చూపిన త్యాగాన్ని స్మరించుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మురళి నాయక్ రాష్ట్ర స్థాయి యువ పురస్కారం ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు.
సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లి తాండ గ్రామంలో మురళి నాయక్ తల్లిదండ్రులను బీజేపీ నేతల బృందం ప్రత్యేకంగా పరామర్శించారు. మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు. ఆ తరువాత పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తుల సమక్షంలో మురళి నాయక్ గారి సమాధిని సందర్శించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు.
యువ పురస్కారాన్ని ప్రజాసేవ, సైనిక సేవ, సామాజిక సేవ, విద్య, క్రీడలు వంటి విభాగాల్లో విశిష్ట సేవలందిస్తున్న యువతకు ప్రోత్సాహంగా నిలుస్తుందని తెలిపారు. అదే విధంగా, మురళి నాయక్ స్వగ్రామం సమీపంలోని జాతీయ రహదారి కూడలిలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ఇది ఒక స్మారక చిహ్నంగా యువతలో దేశభక్తిని పెంపొందించే దిశగా దోహదపడుతుందని ప్రభుత్వానికి సూచించారు.
Puttaparthi, May 28, 2025 –
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) May 28, 2025
We have urged the Andhra Pradesh government to institute a state-level youth award in memory of martyr Shri Murali Naik, who sacrificed his life for the nation.
At a memorial held in Kalli Tanda, we paid tributes and met the martyr’s family &… pic.twitter.com/IYGRQlcmLe
ఈ అంశాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సత్యకుమార్ రికి వివరించి, త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లి చర్చిస్తామని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు . వీరజవాన్ మురళి నాయక్ వంటి వీరుల త్యాగాలను శాశ్వతంగా గుర్తుంచుకోవడం, వారిని ఆదర్శంగా నిలిపే కార్యక్రమాలు చేపట్టడం సమాజానికి ఎంతో అవసరమన్నారు.





















