అన్వేషించండి

AP Speaker Ayyanna Patrudu: అసెంబ్లీకి రాని సభ్యులపై త్వరలో నిర్ణయం.. రీకాల్ విధానంపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Assembly Speaker Ayyanna Patrudu | అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్న వైసీపీ సభ్యులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

Ap Assembly Session | అమరావతి: అసెంబ్లీకి రాకుండా కొందరు సభ్యులు జీతాలు తీసుకుంటున్నారని, వారిపై త్వరలో చర్యలు తీసుకుంటామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. చాలా దేశాల్లో రీ కాల్ విధానం ఉందని, తాను లక్నో లో చేసిన రీ కాల్ వ్యాఖ్యలు మళ్లీ గుర్తు చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉదయం ఆలస్యంగా ప్రారంభం కావడానికి గల కారణాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు వివరించారు. సభ ఆలస్యానికి కారణం కోరం లేకపోవడం కాదని, కేవలం సాఫ్ట్‌వేర్, టెక్నికల్ సమస్యల వల్లే జాప్యం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. సభ్యులు చాలా మంది సమయానికే వచ్చారని, అయితే వైసీపీ నేతలు ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో రాజకీయాలు ముఖాముఖిగా ఉండేవని, కానీ ఇప్పుడు వెనుక ఉండి గుంతలు తవ్వే సంస్కృతి పెరిగిందని అసహనం వ్యక్తం చేశారు.

ఆ ఎమ్మెల్యేల విషయంలో త్వరలోనే నిర్ణయం
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని స్పీకర్ అన్నారు. సభ్యులు సభకు రావడమే కాకుండా, లోపల ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు కూర్చున్నారో కూడా ఈ వ్యవస్థ ద్వారా ఖచ్చితంగా నమోదవుతుందని అయ్యన్న పాత్రుడు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా కేవలం జీతాలు తీసుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో త్వరలోనే కఠిన నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్యోగం చేయకుండా జీతాలు తీసుకుంటే ఎవరూ ఊరుకోరని, మరి అసెంబ్లీకి రాకుండా ప్రజా ధనాన్ని జీతాల రూపంలో ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు.

ఈ సమస్యపై గతంలో లక్నోలో జరిగిన స్పీకర్ల సమావేశంలో కూడా తాను మాట్లాడానని అయ్యన్నపాత్రుడు గుర్తుచేశారు. విధులకు రాని ప్రజాప్రతినిధులను వెనక్కి పిలిపించే రికాల్ (Recall) విధానం చాలా దేశాల్లో ఉందని, మన దేశంలో కూడా దీనిని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై పార్లమెంటుకు కూడా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. విశాఖపట్నం సభలో తాను ఈ విషయం చెప్పినప్పుడు 80 శాతం మంది ప్రజలు ఏకీభవించారని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, అసెంబ్లీలో నిర్వహించిన చిన్న పిల్లల 'మాక్ అసెంబ్లీ' గురించి స్పీకర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుత మంత్రులు, ఎమ్మెల్యేల కంటే ఆ పిల్లలే అద్భుతంగా మాట్లాడారని కొనియాడారు. ఇప్పుడు అసెంబ్లీని సందర్శించడానికి పాఠశాలల నుండి సుమారు 200 దరఖాస్తులు వచ్చాయని, రాయలసీమ నుండి విశాఖ వరకు అన్ని ప్రాంతాల విద్యార్థులు అసెంబ్లీని చూడటానికి ఆసక్తి చూపుతున్నారని ఆయన వెల్లడించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Addanki Police Controversy: అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget