Assembly Live Updates: సభా కార్యకలాపాలకు ఆటంకం కల్గించారని అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులపై వేటు
AP Assembly: తెలుగు రాష్ట్రాలు అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం అవుతున్నాయి. ఏపీలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా తెలంగాణలో ఈ నెల 8 నుంతి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Background
AP Assembly Sessions: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నుంచి రాజకీయాలు మరో రూపును సంతరించుకోనున్నాయి. ఏపీ(AP), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్నాయి. ఏపీలో సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశం జరగనుంది. కాగా, ఏపీ పదిహేనవ అసెంబ్లీకి ఇవే చివరి సమావేశాలు. ఇక, తెలంగాణలో ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దీంతో ఇప్పటి వరకు బహిరంగ వేదికలపై.. విమర్శలు గుప్పించుకున్న ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు.. అసెంబ్లీల వేదికగా తమ వాణి వినిపించనున్నాయి. తెలంగాణలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలు, ఏపీలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు పైచేయి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ సభా వేదికగా.. తమ తమ వ్యూహాలను రక్తికట్టించనున్నాయని తెలుస్తోంది.
అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్సన్ వేటు
ఉదయం నుంచి స్పీకర పోడియం వద్ద ఉంటూ సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించారన్న కారణంతో టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. టీ బ్రేక్ ఇచ్చిన తర్వాత కూడా మరింత రెచ్చిపోయిన టీడీపీ సభ్యులు విజిల్స్ వేస్తూ నినాదాలు చేశారు. దీంతో వారిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం- టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం
తీవ్ర గందరగోళం మధ్యే అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఇటీవల కాలంలో చనిపోయిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపిన తర్వాత గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభించింది అధికార పార్టీ. ప్రజా సమస్యలపై ముందు చర్చించాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు. వాటిపైనే చర్చ జరగాలని స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఈ టైంలో పేపర్లు చించి విసరడంపై అధికార పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.





















