అన్వేషించండి

CM Jagan: 'మైనారిటీల అభివృద్ధికి పెద్దపీట' - సాధికారత చేతల్లో చూపించామన్న సీఎం జగన్

Vijayawada News: గతంలో ఎన్నడూ లేని విధంగా మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం జగన్ తెలిపారు. విజయవాడలో అబుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

CM Jagan Comments on Minorities: రాష్ట్రంలో మైనారిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్దపీట వేసిందని సీఎం జగన్ (CM Jagan) తెలిపారు. విజయవాడలో (Vijayawada) పర్యటిస్తున్న ఆయన, మైనారిటీస్ వెల్ఫేర్‌ డే, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే సందర్భంగా ఇంది­రా­గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆ­జా­ద్‌ జయంతి (Abul Kalamazad Jayanthi) ఉత్సవాల్లో పాల్గొన్నారు. మైనారిటీలను గత ప్రభుత్వం గాలికొదిలేసిందని, డిప్యూటీ సీఎం హోదాతో మైనార్టీలను తమ ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు. 2019 నుంచి మైనార్టీల అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని, గతానికి, ఇప్పటికి మధ్య తేడాలు గమనించాలన్నారు. పేద ముస్లింలందరికీ దివంగత నేత వైఎస్సార్ రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తు చేశారు. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నామని, మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించామని వివరించారు.

'చేతల్లో చేసి చూపించాం'

దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను గుర్తు చేసుకున్న సీఎం జగన్.. ఆయన జయంతిని మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా జరుపుకొంటున్నామని తెలిపారు. 'అన్ని రంగాల్లో మైనారిటీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ముస్లిం మహిళకు అవకాశం కల్పించాం. సాధికారతను మాటల్లో కాదు.. చేతల్లో చేసి చూపించాం. మైనారిటీల అభ్యున్నతి కోసం 2019 నుంచి అనేక మార్పులు తీసుకొచ్చాం. మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చేందుకు గత సర్కారు ఏనాడు చొరవ చూపలేదు. లంచాలు, వివక్షకు తావులేకుండా పాలన కొనసాగిస్తున్నాం. భిన్నత్వంలో ఏకత్వం అనేదే మన బలం. ప్రతి పేదవాడి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోంది. ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. రూ.2.40 లక్షల కోట్లు నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో వేశాం. గత ప్రభుత్వం హయాంలో ఇంత సంక్షేమం జరగలేదు.' అని సీఎం జగన్ వివరించారు.

అన్ని పదవుల్లో అవకాశం

'నలుగురు మైనారిటీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాం. నలుగురు మైనారిటీలకు శాసనమండలి సభ్యత్వం ఇచ్చాం. మండలి డిప్యూటీ ఛైర్మన్ గా ఓ మైనారిటీ మహిళకు అవకాశం కల్పించాం. ఈ నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయి. అన్ని పదవుల్లో 50 శాతం అవకాశం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చేలా ఏకంగా చట్టమే చేశాం. ఉర్దూను రెండో అధికార భాషగా చేశాం. హజ్ యాత్రకు విజయవాడ నుంచి నేరుగా వెళ్లే అవకాశం రావాలని చర్యలు తీసుకున్నాం. దీని కోసం రూ.14 కోట్ల భారం పడినా వెనుకడుగు వేయలేదు.' అని సీఎం జగన్ వివరించారు.

Also Read: Housesites to Journalists in Andhrapradesh: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు - మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Embed widget