అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Housesites to Journalists in Andhrapradesh: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు - మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
Andhrapradesh News: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది.
Journalists Hose sites: జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇటీవలే కేబినెట్ లో నిర్ణయం తీసుకోగా, తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అర్హతలకు సంబంధించి మార్గదర్శకాలు వెలువరించింది. ప్రతీ జర్నలిస్టుకు 3 సెంట్ల స్థలం ఇవ్వనుంది. 60:40 శాతం చెల్లింపు పద్ధతిలో ఇళ్ల స్థలం కేటాయింపు ఉంటుందని పేర్కొంది. స్థలాల కేటాయింపునకు జిల్లా ఇంఛార్జీ మంత్రి, కలెక్టర్ తో కూడిన కమిటీ ఏర్పాటుకు నిర్ణయిస్తూ సమాచారం పౌర సంబంధాల శాఖ ఆదేశాలిచ్చింది. ఈ కమిటీలో జర్నలిస్టులకు సభ్యులుగా కూడా అవకాశం కల్పించింది. ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించి, 45 రోజుల్లోగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
అర్హతలివే
- ప్రస్తుతం గుర్తింపు పొందిన, మీడియాలో కనీసం 5 ఏళ్ల అనుభవం ఉన్న జర్నలిస్టులు మాత్రమే ఇంటి స్థలాలకు అర్హులు.
- జర్నలిస్ట్/జర్నలిస్ట్ జీవిత భాగస్వామికి ఏదైనా ప్రభుత్వ పథకం కింద ఇంతకు ముందు ఇంటి స్థలం ఉంటే వారు ఈ పథకం కింద ఇంటి స్థలం కేటాయింపునకు అనర్హులు.
- జర్నలిస్టులు ఇప్పటికే తమ పేరు మీద లేదా వారి జీవిత భాగస్వామి పేరు మీద, వారు పని చేస్తున్న/నివసిస్తున్న స్థలంలో ఇంటి స్థలం/ఫ్లాట్/ఇల్లు కలిగి ఉంటే, ఇంటి స్థలం మంజూరు చేయరు.
- ప్రభుత్వ శాఖలు, PSUS కార్పొరేషన్లలో అక్రిడిటేషన్ కార్డులు కలిగి ఉన్న ఏ సాధారణ ఉద్యోగి అయినా 'జర్నలిస్ట్‌ల హౌసింగ్ స్కీమ్' కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
- జర్నలిస్ట్ పనిచేస్తున్న/నివసిస్తున్న జిల్లాలోనే ఇంటి స్థలాలు కేటాయించవచ్చు. జర్నలిస్ట్ పనిచేస్తున్న/నివసిస్తున్న మండలంలో కేటాయింపులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.
- ప్రతి జర్నలిస్టుకు గరిష్టంగా ఉన్న భూమి 0.03 సెంట్లు మాత్రమే. భూమి ధరను 60:40 నిష్పత్తిలో పంచుకోవాలి (ప్రభుత్వం: జర్నలిస్టులు)
- జర్నలిస్టుకు కేటాయించిన ఇంటి స్థలంలో నిర్మాణాన్ని సదరు వ్యక్తి పూర్తి చేయాలి. సైట్‌ను అప్పగించిన తేదీ నుంచి పదేళ్ల లోపు నిర్మాణాన్ని పూర్తి చేయకుంటే కేటాయింపు రద్దు చేస్తారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
సినిమా
రాజమండ్రి
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement