Breaking News Live: బీజేపీ శాంతి ర్యాలీకి పోలీసుల అనుమతి... హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డా
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
సంగారెడ్డిలో ప్రమాదం
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం, నందిగామ గ్రామ పరిధిలోని సవారియా అనే పైపుల తయారీ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. ఇనుప రాడ్లను క్రేన్ సహాయంతో తీసుకువెళ్తుండగా బరువు ఎక్కువై తీగ తెగి నలుగురు కార్మికులపై పడింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రేమ్ కుమార్, పాజ్థార్‌లు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు జితేంద్ర కుమార్, ఆనంద్ కుమార్‌లకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న భానూరు పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
కరోనా కేసులు
తెలంగాణ వ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 482 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 397 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. డిసెంబర్ మూడో వారం వరకు రోజుకు సగటున 100 లోపు కేసులు నమోదు కాగా, నాలుగో వారంలో క్రిస్మస్ వేడుకలు, డిసెంబర్ 31 తర్వాత వైరస్ మరింత వేగంగా వ్యాపించింది. గతంలో ఎన్నడూ లేనంతగా కరోనా కేసులు పెరుగుతుండటంతో విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.
ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నిత్యం కుట్రలు కుతంత్రాలు చేస్తుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. ఏనాడూ సింగిల్ గా ఎన్నికలు వెళ్లి గెలిచిన చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు. మామకు వెన్నుపొటు పొడిచి ఓసారి, వాజిపేయ్ మొహాంతో మరోసారి, మోదీ పేస్ తో ఇంకొసారి బాబు గెలిచారని ఆరోపించారు. మహిళల సహాకారంతో మళ్లీ అధికారంలోకి వస్తామని ధర్మాన ధీమా వ్యక్తం చేశారు. జగన్ మళ్లీ అధికారం చేపట్టకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఒక్కరే నాయకుడు.. అది జగన్ మాత్రమే అని మంత్రి ధర్మాన అన్నారు. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో అత్యధిక మేజార్టీలతో గెలుపొందామని తెలిపారు.
వైసీపీలో ఒక్కరే లీడర్ అది జగన్
రాష్ట్రంలో టీడీపీ లేదని, అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సీఎం జగన్ ను రక్షించుకునేందుకు ప్రాణం ఇచ్చే నాయకులు ఉన్నారన్నారు. ప్రజలకు అభివృద్ది చేస్తుంటే టీడీపీ నేతలకు వచ్చిన ఇబ్బందేంటని ఆయన ప్రశ్నించారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు వైసీపీ ప్రభుత్వం కృషిచేస్తుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వైసీపీలో లీడర్ ఒక్కరే అది జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందన్నారు. రెవెన్యూ మంత్రిగా ముప్పై లక్షల మందికి ఇల్లు ఇచ్చే అవకాశం తనకు లభించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
బీజేపీ శాంతి ర్యాలీకి పోలీసుల అనుమతి... హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డా
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు. జేపీ నడ్డాకు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. జాయింట్ సీపీ కార్తికేయ నడ్డాతో మాట్లాడారు. కరోనా ఆంక్షలను వివరించారు. బీజేపీ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇచ్చారు. కేవలం 40 మందితో ర్యాలీకి అనుమతి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. సికింద్రబాద్ గాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ వరకు బీజేపీ శాంతి ర్యాలీ చేయనుంది.
జేపీ నడ్డాను ఎయిర్ పోర్టులోనే అడ్డుకునే అవకాశం... నోటీసులతో ఎయిర్ పోర్టుకు వెళ్లిన పోలీసులు
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం సమీపంలో మంగళవారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీని బీజేపీ నిర్వహించ తలపెట్టింది. ఈ ర్యాలీలో పాల్గోనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ వస్తున్నారు. ఆయన ఢిల్లీ నుంచి సాయంత్రానికి హైదరాబాద్ రానున్నారు. అయితే ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్న కారణంగా ర్యాలీలు నిర్వహించకూడదని పోలీసు అంటున్నారు. జేపీ నడ్డాను ఎయిర్ పోర్టులో అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు వీఐపీ లాంజ్ లోనే జేపీ నడ్డాను అడ్డుకునేందుకు నోటీసులతో పోలీసులు ఎయిర్ పోర్టుకు వెళ్లారు.
వీకెండ్ కర్ఫ్యూ విధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ కేసులు పెరగడంతో వీకెండ్ కర్ఫ్యూ విధించారు. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ కంపెనీలలో ఆఫీసుకుకు కేవలం 50 శాతం ఉద్యోగులకు అనుమతి ఇచ్చారు.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ భేటీ
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ భేటీ
– దాదాపు గంటసేపు సమావేశం
– రాష్ట్రంలో పలు జాతీయ రహదారులను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన సీఎం
– విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి డీపీఆర్ తయారీ అంశంపై చర్చ.
– విశాఖపట్నానికి ఈ రహదారి చాలా ఉపయోగమని, విశాఖపట్నం పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వెళ్లే సరుకు రవాణా వాహనాలకు తక్కువ దూరం అవుతుందని తెలిపిన సీఎం.
– సముద్ర తీరాన్ని ఆనుకుని బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు సమీపం నుంచి ఈ రోడ్డు వెళ్తుందని తెలిపిన సీఎం
– భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేందుకు, ఈ ప్రాంతంలో పర్యటకరంగం అభివృద్ధికి ఈ రోడ్డు నిర్మాణం అత్యంత దోహపడుతుందని తెలిపిన సీఎం.
– విశాఖ నగరంలో వాహనరద్దీని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 6 లేన్ల రహదారిని కోరిన సీఎం.
– విజయవాడ తూర్పు బైపాస్‌పై గతంలో చేసిన విజ్ఞప్తిని చురుగ్గా పరిశీలించాలని కోరిన సీఎం.
– సంబంధిత శాఖల సమన్వయంతో భూ సేకరణను వీలైనంత త్వరగా పూర్తిచేస్తామన్న సీఎం.
– ప్రాజెక్టు ఖర్చు తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఎస్జీఎస్టీ, రాయల్టీ మినహాయింపులిస్తామన్న సీఎం.
– వీలైనంత త్వరగా ప్రాజెక్టు చేపట్టాలని విజ్ఞప్తిచేసిన సీఎం.
– కత్తిపూడి – ఒంగోలు కారిడర్‌లో భాగంగా ఎన్‌హెచ్–216 నిర్మాణానికి సంబంధించి బాపట్లలో 4 లేన్ల రోడ్డుగా విస్తరించాలని కోరిన సీఎం.
– విద్యాసంస్థలు, పర్యాటకులు, ఎయిర్‌బేస్ కారణంగా మళ్లీ ట్రాఫిక్‌జామ్స్ ఏర్పడే అవకాశం ఉందని, ప్రస్తుతం బాపట్ల ద్వారా వెళ్తున్న రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించాలంటూ విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి.
కిషన్ రెడ్డి కరీంనగర్ పర్యటనలో స్వల్ప మార్పులు
* కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కరీంనగర్ పర్యటన సమయంలో స్వల్ప మార్పులు
* ఉదయం 11.15 నిమిషాలకు కరీంనగర్ జిల్లా జైలులో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గారిని కలుస్తారు.
* ఉదయం 11.45 నిమిషాలకు జ్యోతినగర్ లోని కరీంనగర్ ఎంపీ కార్యాలయం సందర్శన, అనంతరం మీడియా సమావేశం
* ఉదయం 12.15 నిమిషాలకు బండి సంజయ్ కుమార్ నివాసంలో గాయాలపాలైన కార్యకర్తలను, జైల్లో ఉన్నవారి కుటుంబ సభ్యులను కలుస్తారు.