Corona Updates: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, కొత్తగా 79 మందికి పాజిటివ్
Corona Updates: ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో 1063 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
Corona Updates: ఏపీలో కరోనా కేసులు(Corona Cases) క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 14,516 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 79 మందికి కోవిడ్ పాజిటివ్(Covid Positive) నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,729కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 167 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 2,302,625 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీ(AP)లో 1063 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,18,417కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 3,31,81,869 నిర్థారణ పరీక్షలు చేశారు.
#COVIDUpdates: 06/03/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) March 6, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,18,417 పాజిటివ్ కేసు లకు గాను
*23,02,625 మంది డిశ్చార్జ్ కాగా
*14,729 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,063#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/yzPkHqWPPu
#COVIDUpdates: As on 6th March, 2022 10:00AM
— ArogyaAndhra (@ArogyaAndhra) March 6, 2022
COVID Positives: 23,18,417
Discharged: 23,02,625
Deceased: 14,729
Active Cases: 1,063#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/XwDFBcCsMS
దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 5,476 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న 9,754 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 158 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇంకా యాక్టివ్ కేసుల సంఖ్య 59,442గా ఉంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. శనివారం మరో 26,19,778 కరోనా డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన కరోనా టీకా డోసుల సంఖ్య 1,78,83,79,249కు చేరింది.
- మొత్తం కరోనా కేసులు : 4,29,62,953
- మొత్తం కోవిడ్ మరణాలు: 5,15,036
- యాక్టివ్ కేసులు : 59,442
- కోలుకున్నవారు : 4,23,88,475
ప్రపంచ వ్యాప్తంగా
ప్రపంచవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 13,70,880 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 44,51,23,303కు చేరింది. మరో 5,639 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 60,15,050కు చేరుకుంది. నిన్న 13,76,645 మంది కరోనా నుంచి కోలుకున్నారు. జర్మనీలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 1,44,427 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. 153 మంది కరోనాతో మరణించారు. అమెరికాలో కొత్తగా 16,213 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా మరో 328 మంది చనిపోయారు. రష్యాలో కూడా కొత్తగా 86,769 కరోనా కేసులు నమోదయ్యాయి. 750 మంది మరణించారు. బ్రెజిల్ లో కొత్తగా 58,737 మందికి కరోనా సోకగా 645 మంది మృతిచెందారు.