Corona Updates: ఏపీలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా... ఒక్క రోజే 13 వేలకు పైగా కేసులు, ఐదుగురు మృతి
ఏపీలో కొత్తగా 13,212 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో 64,136 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
![Corona Updates: ఏపీలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా... ఒక్క రోజే 13 వేలకు పైగా కేసులు, ఐదుగురు మృతి Andhra Pradesh Telangana latest corona omicron updates 21th January records 13,212 new covid 19 cases five deaths in 24 hours Corona Updates: ఏపీలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా... ఒక్క రోజే 13 వేలకు పైగా కేసులు, ఐదుగురు మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/21/83480885c55dd61b0421e0801037c28d_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఏపీలో కరోనా ఉగ్రరూపం చూపుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 44,516 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 13,212 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ఐదురుగు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,532కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 2,942 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,74,600 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 64,136 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
#COVIDUpdates: As on 21st January, 2022 10:00AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 21, 2022
COVID Positives: 21,50,373
Discharged: 20,71,705
Deceased: 14,532
Active Cases: 64,136#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/5kNti7071m
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,53,268కి చేరింది. గడిచిన 24 గంటల్లో 2,942 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 64,136 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,532కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,20,56,618 శాంపిల్స్ పరీక్షించారు.
దేశంలో కరోనా విజృంభణ
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 3,47,254 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 29,722 కేసులు ఎక్కువగా వచ్చాయి. ఒక్కరోజులో 2,51,777 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. కొత్తగా 703 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
- యాక్టివ్ కేసులు: 20,18,825
- డైలీ పాజిటివిటీ రేటు: 17.94%
దేశంలో ఇప్పటివరకు 9,692 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 20,18,825కి చేరింది. రికవరీ రేటు 93.50%గా ఉంది. మహారాష్ట్రలో కొత్తగా 46,197 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 125 ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. 37 మంది మృతి చెందారు. తాజాగా 52,000 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 73,71,757కి చేరింది. మృతుల సంఖ్య 1,41,971కి పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,58,569కి చేరింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)