CM Jagan Warns IPAC : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐప్యాక్ అట్టర్ ఫ్లాప్, పీకే టీంకు సీఎం జగన్ వార్నింగ్!
CM Jagan Warns IPAC : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి అనూహ్య పరాభవం ఎదురైంది. ఐప్యాక్ వ్యూహాలు ఈ ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాయని, దీంతో సీఎం జగన్ సీరియస్ అయ్యారని తెలుస్తోంది.
CM Jagan Warns IPAC : ఏపీలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐప్యాక్ వ్యూహం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఐప్యాక్ లెక్క తప్పి వైసీపీని చావు దెబ్బ కొట్టాయి. గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మూడింట్లోనూ టీడీపీ తీన్మార్ మోగించింది. ఊహించని ఫలితాలను చూసి అధికార పార్టీ దిమ్మతిరిగింది. ఓవర్ కాన్ఫిడెన్స్ లెక్క తప్పిందని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అంచనా ఎక్కడ తప్పిందో వైసీపీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. వైసీపీకి గత ఎన్నికల నుంచి ఐప్యాక్ టీం వ్యహకర్తగా పనిచేస్తోంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐప్యాక్ వ్యూహాలు బెడిసికొట్టాయి. ఐప్యాక్ ఒక చోట టార్గెట్ చేస్తే దెబ్బ మరోచోట పడిందని చెబుతున్నారు. టీచర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారని భావించారు, యువత తమవైపు ఉంటుందని ఊహల్లో తేలిపోయారు. కానీ ఫలితం మరోలా వచ్చింది. యువత వైసీపీపై పీకల్లోతు కోపంతో ఉన్నారని తేలింది. అసలు డ్యామేజ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దగ్గర జరిగింది.
ఈ ఫలితాలు వచ్చే ఎన్నికలపై ప్రభావం
పట్టభద్రులు సైతం జగన్ పై తీవ్ర ఆగ్రహంలో ఉన్నారని, వారిని ఆకట్టుకునేందుకు ఏదోటి చేయాలన్న ఆలోచన ఐప్యాక్ టీం రాకపోవడం పెద్ద మైనస్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలిచే స్పష్టమైన వ్యూహాన్ని అమలు చేయడంలో ఐప్యాక్ ఫ్లాపైంది. దానితో బోర్లా పడి, మూడు ఎమ్మెల్సీల్లో ఘోరపరాజయం మూటగట్టుకున్నారు. ఈ ఎఫెక్ట్ వచ్చే ఎన్నికలపై పడుతుందని టీడీపీ ఇకపై రెచ్చిపోతుందని ఐప్యాక్ వర్గాలే అంగీకరించడం కొసమెరుపు.
ఐప్యాక్ టీంపై సీఎం జగన్ ఆగ్రహం
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటమి తర్వాత ఐప్యాక్ టీమ్ తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమైనట్లుగా టాక్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాలు తప్పితే, వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తారని మండిపడ్డారట. ఇంత చిన్న ఎన్నికను కూడా మేనేజ్ చేయలేకపోతే మీ వ్యూహాలు ఎందుకని ఆయన నిలదీసినట్లు తెలుస్తోంది. కోట్లకు కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నప్పుడు..ఎందుకు పనిచేయలేకపోయారని జగన్ నిలదీస్తుంటే ఐప్యాక్ టీం దగ్గర సమాధానం లేకపోయిందట. వచ్చే ఎన్నికల్లో తాను టార్గెట్ 175 ఫిక్స్ చేసుకున్నానని...ఇలాగైతే వేరే దారి చూసుకోవాల్సి వస్తుందని ఐప్యాక్ ను చెడామడా వాయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ విజయం
ఆంధ్రప్రదేశ్‌గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఘనవిజయం సాధించింది. ఎవరూ ఊహించని విధంగా మూడు స్థానాలను గెలుపొందింది. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. పశ్చిమ రాయలసీమ స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి భూమి రెడ్డి రామగోపాలరెడ్డి వైసీపీ బలపర్చిన అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై 7543 ఓట్ల తేడాతో గెలిచారు. ఉత్తరాంధ్రలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు ఘన విజయం సాధించగా, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలిచారు. ఈ విజయం టీడీపీ కేడర్ లో జోష్ పెంచింది. సెమీ ఫైనల్స్ లో విజయం సాధించామని ఇక ఫైనల్స్ కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు ఈ విజయాలపై సంబరాలు చేసుకుంటున్నారు.