అన్వేషించండి

Andhra News: ఓ చోట ముగ్గురి దారుణ హత్య - మరోచోట నవ దంపతుల ఆత్మహత్య, ఏపీలో ఒకే రోజు 2 ఘటనలు

Brutal Murder: పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ తనను వేధిస్తున్నారని భర్త, అత్తమామలను కుటుంబ సభ్యుల సాయంతో దారుణంగా హతమార్చింది. అనంతరం వారు పోలీసులకు లొంగిపోయారు.

Three People Brutal Murder in Palnadu: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో (Piduguralla) బుధవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. కోనంగి (Konangi) గ్రామంలో ఓ మహిళ తన భర్త, అత్త మామలను బంధువుల సాయంతో హతమార్చింది. ముగ్గురిపైనా దాడి చేసి విచక్షణా రహితంగా కత్తులతో నరికి చంపారు. మృతులను సాంబశివరావు (50) , అతని భార్య ఆదిలక్ష్మి (47), కుమారుడు నరేష్ (30)గా గుర్తించారు. గత కొంతకాలంగా నరేష్, అతని భార్య మాధురి మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మాధురిని భర్త, అత్త మామలు వేధిస్తున్నారన్న కోపంతో ఆమె తరఫు బంధువులు ఈ హత్య చేసినట్లు సమాచారం. హత్య అనంతరం ముప్పాళ్ల (Muppalla) పోలీస్ స్టేషన్ లో కోడలు మాధురి, నిందితులు లొంగిపోయారు. ఈ క్రమంలో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పిడుగురాళ్లకు తరలించారు. ముందు జాగ్రత్తగా గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నవ దంపతుల ఆత్మహత్య

అటు, సత్యసాయి జిల్లా రామగిరి మండలం గంగంపల్లి గ్రామానికి చెందిన నవ దంపతులు బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన దూదేకుల దాదాఖలందర్ (24), బోయ జ్యోత్స్న (20) 2 నెలల క్రితమే ఇంట్లో నుంచి పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అనంతరం గ్రామానికి తిరిగి రాగా, ఇరు కుటుంబాల్లో కొద్ది రోజులు వివాదం నెలకొంది. అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించి ఇంట్లోనే ఉంటున్నారు. ఏం జరిగిందో తెలియనప్పటికీ, బుధవారం రాత్రి ఇద్దరూ కలిసి తోటకు వెళ్లి వస్తామని చెప్పి అక్కడ చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వారు ఎంత సేపటికీ రాకపోయే సరికి గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తోటకు వెళ్లి చూడగా చెట్టుకు విగత జీవులుగా కనిపించారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది.

Also Read: Caste Census: వారం రోజుల్లోనే కుల గణన సర్వే పూర్తి - గ్రామ, వార్డు సచివాలయాలకు సర్కారు కీలక ఆదేశాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget