Anantapur Road Accident: ఏపీలో ఘోర రోడ్డుప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, ఎక్స్‌గ్రేషియా ప్రకటన
Anantapur Road Accident Latest News: ఏపీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
PM Modi On Anantapur Road Accident: అనంతపురం జిల్లాలో ఆదివారం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారును లారీ ఢీకొట్టిన ఘటనలో 9 మంది మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. ఉరవకొండ మండలం బూదగవి వద్ద కారు, లారీ ఢీకొనడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు PMNRF నుండి 2 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తాం ప్రధాన మంత్రి మోదీ ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ ద్వారా వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షలు ఎక్స్ గ్రేషియా PMNRF నుండి చెల్లిస్తాం: ప్రధానమంత్రి @narendramodi
— PMO India (@PMOIndia) February 7, 2022
ఏపీలో జరిగిన ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. అనంతపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చాలా ప్రాణాలు పోవడం నిజంగా విషాదదాయకం. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. వారి గురించే ఆలోచిస్తున్నానంటూ రాష్ట్రపతి ట్వీట్ చేశారు.
The loss of lives at district Ananthapuramu, Andhra Pradesh in a road accident is deeply disturbing. My condolences to the bereaved families. In this hour of grief, my thoughts and prayers are with them.
— President of India (@rashtrapatibhvn) February 7, 2022
ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఒక బాలుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా బళ్లారిలో పెళ్లికి హాజరై తిరిగి స్వస్థలానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కుమార్తె వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోకా వెంకటప్ప మరణించారు.
Also Read: Anantapur: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం-ఇన్నోవాను ఢీకొట్టిన లారీ, 9 మంది మృతి
Also Read: India Corona Cases: దేశంలో లక్ష దిగువకు పాజిటివ్ కేసులు, తాజాగా కొవిడ్‌తో 895 మంది మృతి