అన్వేషించండి

Anantapur: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం-ఇన్నోవాను ఢీకొట్టిన లారీ, 9 మంది మృతి

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉరవకొండ మండలం బూదగవి వద్ద ఇన్నోవా కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు.

అనంతపురం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరినట్లు సమాచారం.  ఉరవకొండ మండలం బూదగవి వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. కారులో బళ్లారి నుంచి అనంతపురం వెళ్తుండగా మార్గమధ్యలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోకా వెంకటప్ప దుర్మరణం పాలయ్యారు. 

పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్లికి వెళ్లి బళ్లారి నుంచి ఉరవకొండకు వస్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇన్నోవా వాహనం నుజ్జునుజ్జయింది. వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఈ ఘటనలో ఉరవకొండ మండలం నింబగల్లు, బూదగవి, లత్తవరం గ్రామాలకు చెందిన తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. 

బీజేపీ నేత దుర్మరణం

ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఒక బాలుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు బొమ్మనహళ్‌కు, ఉరవకొండ మండలం లక్కవరం గ్రామానికి చెందిన ముగ్గురు ఉన్నట్లు గుర్తించారు. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మృత దేహాలను ఘటనా స్థలం నుంచి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా బళ్లారిలో పెళ్లికి హాజరై తిరిగి స్వస్థలానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోకా వెంకటప్ప మరణించారు. ఆయన కుమార్తె వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, కారు వేగంగా ఢీకొనడంతో కారు నుజ్జు నుజ్జయింది. 

మృతుల వివరాలు

1.అశోక్- బొమ్మణహల్ గ్రామం 
2. రాధమ్మ- బొమ్మణహల్ గ్రామం
3. సరస్వతి-బొమ్మణహల్
4. శివమ్మ-పిల్లల పల్లి
5. శుభద్రమ్మ-రాయల దొడ్డి
6.స్వాతి(38)-లత్తవరం
7.జాహ్నవి(12) లత్తవరం
8.వెంకటప్ప(60)-నింబగల్లు
9.జశ్వంత్(12)లత్తవరం

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం
గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం
Breaking News: గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులు దిద్దారు: చంద్రబాబు
గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు,సెక్యూరిటీ గార్డులు దిద్దారు: చంద్రబాబు
Historic Test Victory: సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
Historic Cricket Diplomacy: కరాచీలో టెస్ట్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ లో వెల్ల‌డి!
కరాచీలో టెస్ట్ మ్యాచ్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ !

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget