AP High Court: ఏపీ హైకోర్టులో కొత్త జడ్జిలు, ప్రమాణ స్వీకారం చేసిన ఏడుగురు కొత్త న్యాయమూర్తులు
జస్టిస్ కొనకంటి శ్రీనివాస్ రెడ్డి, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ తర్లడ రాజశేఖర్ రావు, జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ వడ్డిబోయిన సుజాత తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా నియమితులైన ఏడుగురు నేడు జడ్జీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన జడ్జీలను పలువురు అభినందించారు. తుళ్ళూరులోని హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ కొనకంటి శ్రీనివాస్ రెడ్డి, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, జస్టిస్ తర్లడ రాజశేఖర్ రావు, జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ రవి చీమలపాటి, జస్టిస్ వడ్డిబోయిన సుజాతతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పలువురు సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు నూతన నూతన న్యాయమూర్తులకు శుభాభినందనలు తెలియజేశారు.
7 New Judges takes Oath in Andhra Pradesh High Court. Chief Justice Prashant Kumar Mishra Administered the oath of office to all of them.#AndhraPradeshHighCourt #OathCeremony pic.twitter.com/yV6RkxsuoM
— The Court & Law (@TheCourtAndLaw) February 14, 2022