Amaravati: అమరావతిలో రెండో విడత భూసమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ - త్వరలో నోటిఫికేషన్ - ఈ గ్రామాల్లోనే
Andhra Cabinet: అమరావతి రెండో విడత భూసమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పదకొండు గ్రామాల్లో భూసమీకరణ చేయనున్నారు.

Amaravati Land Pooling Andhra Cabinet: ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధాని అభివృద్ధికి రెండో విడత భూసమీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈ అంశంపై విస్తృత చర్చ జరిగింది. త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
గురువారం రైతులతో చర్చించిన చంద్రబాబు
గురువారం రాష్ట్ర సెక్రటేరియట్‌లో రాజధాని ప్రాంత రైతులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. సమావేశంలో వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి సహా 11 గ్రామాల రైతులు రెండో విడత భూసమీకరణకు మద్దతు ప్రకటించారు. ఈ గ్రామాల్లోని ల భూములను సమీకరించి, అమరావతిని హైదరాబాద్ స్థాయి మెగా మెట్రోగా అభివృద్ధి చేయాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
పదకొండు గ్రామాల నుంచి తాజాగా భూముల సమీకరణ
కేబినెట్ మీటింగ్‌లో ముఖ్యంగా అమరావతి కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, రెండో విడత భూసమీకరణ విధానాలు ప్రధాన అజెండాగా ఉన్నాయి. మొదటి విడతలో 29 గ్రామాల నుంచి 34 వేల ఎకరాలు, ఎండోమెంట్, అటవి, వక్ఫ్, పొరంబోకు భూములతో కలిపి 50 వేల ఎకరాలు సమీకరించారు. రెండో విడతలో కోర్ క్యాపిటల్ గ్రిడ్ వెలుపల ఉన్న 11 గ్రామాల నుంచి భూములను సమీకరించాలని ప్రణాళిక.
ఈ గ్రామాల్లో భూముల వివరాలు:
వైకుంఠపురం : 3,361 ఎకరాలు
పెదమద్దూరు : 1,145 ఎకరాలు
ఎండ్రాయి : 2,166 ఎకరాలు
కర్లపూడి, లేమల్లె : 2,944 ఎకరాలు
వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి వంటిమిగిలిన గ్రామాల భూములను పూలింగ్ స్కీమ్ (LPS) ద్వారా చర్చల ద్వారా సమీకరించాలని నిర్ణయించారు. రాజధాని గ్రామాల రైతులు మొదట రెండో విడతకు వ్యతిరేకించారు. కానీ ముఖ్యమంత్రి, మంత్రులతో చర్చల తర్వాత మద్దతు ప్రకటించారు.
కేబినెట్ సబ్ కమిటీ చర్చల ద్వారా విధివిధాానాల ఖరారు
రెండో విడత విధానాన్ని కేబినెట్ సబ్-కమిటీ చర్చల ఆధారంగా రూపొందించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రైతులతో నాలుగైదు నెలల్లో భూసమీకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామకంఠం భూముల సర్వేలు ఒక నెలలో పూర్తి చేస్తామని, ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్‌లు చేస్తామని అధికారులు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమరావతి ఏపీ రాజధానిగా గెజిట్ ప్రకటించే ఆలోచనలో ఉంది. అలాగే రైతులు క్యాపిటల్ గెయిన్స్ ఎక్సెంప్షన్ పీరియడ్‌ను మరో రెండు సంవత్సరాలు పొడిగించమని కోరుతున్నరాు. ప్లాట్ అలాట్‌మెంట్, అసైన్డ్ ల్యాండ్స్, జరీబ్ డిస్‌ప్యూట్‌ల పరిష్కారానికి ముగ్గురు సభ్యుల కమిటీ రైతులతో నెలవారీ సమావేశాలు నిర్వహిస్తోంది.
అమరావతి ప్రాజెక్ట్ 2014లో ప్రారంభమైంది. 2019లో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనతో ఆపేసింది. TDP అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 2025లో కేబినెట్ రెండో విడతకు ఆమోదం తెలిపింది. జూలైలో CRDA 20,494 ఎకరాల సమీకరణకు ఆమోదం ఇచ్చింది. జూలై 12న ఆలస్యం చేసినా, అక్టోబర్‌లో మళ్లీ పట్టాలెక్కుతోంది.





















