న్యాయం, ధర్మం ఎటువైపో తేలింది - అవినాష్ రెడ్డి బెయిల్ పై సజ్జల రియాక్షన్ ఇలా
న్యాయం, ధర్మం ఎటువైపో తెలిసిందని ప్రభుత్వ సలహాదారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు
న్యాయం, ధర్మం ఎటువైపో తెలిసిందని ప్రభుత్వ సలహాదారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఓ వర్గం మీడియా చేసిన ప్రచారాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
బెయిల్ పై సజ్జల హాట్ కామెంట్స్...
వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్దానం ఇచ్చిన తీర్పు అనంతరం ప్రభుత్వ సలహాదారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. బెయిల్.. ముందస్తు బెయిల్ అనేది సాధారణంగా జరిగేదేనని అయితే ఈ వ్యవహరంలో జరిగిన ప్రచారం పై సజ్జల తీవ్ర స్దాయిలో అభ్యంతరం తెలిపారు. ఇందులో భాగంగా ఇవాళ వచ్చిన జడ్జిమెంట్ ప్రత్యేకమని ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్ వివేకా హత్య విషయంలో ఓ వర్గానికి చెందిన మీడియాలో రకరకాలు వార్తలు ప్రచారం చేసి తెలుగు దేశం పార్టీని ప్రొటెక్ట్ చేసేందుకు ప్రయత్నం జరిగిందని ఆయన అన్నారు. ఓ వర్గానికి చెందిన మీడియా తన పరిధి దాటి వ్యవహరించిందని న్యాయమూర్తి తీర్పులో చెప్పారని సజ్జల పేర్కొన్నారు.
బయటకు చెప్పుకోలేని పరిస్థితులు...
వైఎస్ వివేకాకున్న బలహీనతల వల్ల బయటకు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇలాంటి పరిస్థితిని అడ్వాంటేజీగా తీసుకుని వైఎస్ వివేకా హత్య విషయంలో ఇబ్బంది పెట్టేందుకు ఒ వర్గం మీడియా ప్రయత్నం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి అదినేత జగన్ మోహన్ రెడ్డి,చెమటోడ్చి ప్రభుత్వాన్ని నిర్మించుకున్నారని సజ్జల అన్నారు.వైఎస్సార్ లెగసీ నాది.. జగన్ ది కాదు అని వైఎస్ వివేకా పోటీ పడ్డారని చెప్పారు. అయితే వైఎస్సార్ లెగసీ జగన్ దేనని ప్రజలే చెప్పారని అందులో భాగంగానే అత్యధికంగా 151 సీట్లు వచ్చాయని తెలిపారు. అయినా ఆ తరువాత పరిస్దితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టిలోకి వివేకానంద రెడ్డి వస్తే.. జగన్ సాదరంగా ఆహ్వానించారని గుర్తు చేశారు.
టార్గెట్ చేసింది టీడీపీనే...
స్థానిక సంస్థల ఎన్నికల్లో వివేకాను ఓడించింది తెలుగు దేశం పార్టినేనని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎంపీ అవినాష్ గెలుపు కోసం వివేకా కూడా ప్రచారం చేశారని, ఆ విషయం సునీతమ్మ కూడా చెప్పారన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం వల్ల.. వివేకా కేసును ఇక్కడి దాకా తెచ్చారని ఆరోపించారు. వైఎస్ వివేకా రాసిన లెటరుని ఎందుకు దాచారో చెప్పాలన్నారు. ఏ లైనులో పోవాలని చెప్పారో.. ఆ లైనులో సీబీఐ వెళ్లిందని, ఇవాళ్టి తీర్పుతో వాటీజ్ వాట్ అనేది తేలిందని సజ్జల హర్షం వ్యక్తం చేశారు. దీంతో న్యాయం, ధర్మం తేలింందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టిని టార్గెట్ చేసుకుంటూ జరిగిన ఈ తరహా ప్రచారం వెనుక తెలుగు దేశం పార్టి ఎందుకుందో విచారణలో తేలిందన్నారు.
ఢిల్లీ పెద్దలు అంటే ఎవరో టీడీపీ చెప్పాలి...
ఢిల్లీ పెద్దలు కోర్టులు ప్రభావితం చేస్తున్నారని తెలుగు దేశం పార్టీ ఉద్దేశ్యమా అని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. జడ్జీలను కూడా కామెంట్లు చేస్తారా అని ప్రశ్నించారు. 2024 ఎన్నికలయ్యాక వైఎస్ వివేకా కేసు గురించి.. సునీతమ్మ గురించి పట్టదని, సునీతమ్మ కుటుంబానికి ఏవో పొలిటికల్ యాంబిషన్స్ ఉండొచ్చని అయితే ఈ విషయాలను ఇప్పటికయినా పరిగణంలోకి తీసుకోవాలన్నారు.వైఎస్ వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డికి బీ.టెక్ రవితో పరిచయాలు ఉన్నాయని,వైఎస్ వివేకాను ఓడించిన వాళ్ల వైపే సునీతమ్మ ఉన్నారన్నారు.
టీడీపీ రాద్దాంతం ఎందుకు...?
నాలుగేళ్లల్లో ఏం ఘోరాలు.. నేరాలు జరిగాయని, తెలగు దేశం రాద్దాంతం చేస్తుందని ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. పేదలకు సంక్షేమం చేయడం నేరం అనేది తెలుగు దేశం ఉద్దేశంగా ఉందన్నారు. ఏపీలో నేరాలు తగ్గాయని, జగన్ చేసే మంచి పనులన్నీ టీడీపీ దృష్టిలో నేరాలు ఘోరాలేని సజ్జల ఫైర్ అయ్యారు.