అన్వేషించండి

Rayapati Family Politics: రాయపాటి వర్సెస్ రాయపాటి- ఇంతకీ ఆ కుటుంబం దారెటు?

Rayapati Ranga Rao: రాయపాటి వ్యవహారం రచ్చకెక్కింది. పార్టీ మారింది రంగారావు మాత్రమేనా, రాయపాటి కుటుంబం కూడానా అనే చర్చ మొదలైంది. రెండు మూడు రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. 

Rayapati Aruna: ఏపీలో రాయపాటి కుటుంబం టీడీపీకి షాకిచ్చింది అంటూ ఇటీవల వార్తలొచ్చాయి. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (Rayapati Sambasiva Rao) తనయుడు రాయపాటి రంగారావు టీడీపీకి గుడ్ బై చెప్పడంతోపాటు తన ఆఫీస్ రూమ్ లో ఉన్న చంద్రబాబు (Chandrababu) ఫొటోని నేలకేసి కొట్టడం, ఆ తర్వాత సీరియస్ కామెంట్స్ చేయడం తెలిసిందే. అయితే ఆ రాజీనామాకు రాయపాటి ఫ్యామిలీ మొత్తాన్ని ముడిపెట్టొద్దంటూ కొత్త వాదన మొదలైంది. 

ఎవరీ రంగారావు..?
రాయపాటి సాంబశివరావు అందరికీ తెలిసిన నేత, మాజీ ఎంపీ. ఆయన తనయుడు రాయపాటి రంగారావు ఎవరు..? ఆయన ఎక్కడినుంచి గెలిచారు..? అనే విషయాలను ఇప్పుడు టీడీపీ సానుభూతి పరులు హైలైట్ చేస్తున్నారు. రాయపాటి రంగారావు ఎవరో కూడా ప్రజలకు తెలియదని, అలాంటి వ్యక్తి టీడీపీని వీడి వెళ్తే దానికి రాద్ధాంతం ఎందుకంటున్నారు ఆ పార్టీ నేతలు. రాయపాటి రంగారావు పార్టీని వీడి వెళ్లినంత మాత్రాన అది షాకింగ్ న్యూస్ అనుకోవడం వైసీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా అల్పసంతోషం అని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో అమరావతి రాజధాని ఉద్యమ నాయకురాలు రాయపాటి శైలజ వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. 

రాయపాటి సాంబశివరావు తమ్ముడి కుమార్తె రాయపాటి శైలజ. అమరావతి రాజధాని ఉద్యమ సమయంలో న్యాయస్థానం టు దేవస్థానం అంటూ మొదలు పెట్టిన పాదయాత్రతో ఆమె రాష్ట్రవ్యాప్తంగా అందరికీ పరిచయమయ్యారు. పాదయాత్రలో ముందుండి నడిచిన శైలజ మీడియాలో కూడా ప్రముఖంగా కనిపించారు. ఆమె ఇప్పుడు మళ్లీ మీడియా ముందుకొచ్చారు. రాయపాటి ఫ్యామిలీ టీడీపీకి ఎప్పుడూ దూరం కాలేదని అంటున్నారామె. రాయపాటి రంగారావు టీడీపీ నుంచి బయటకు వెళ్లిపోయినంత మాత్రాన ఆ కుటుంబం అంతా బయటకు వచ్చినట్టు కాదని చెప్పారు. రాయపాటి కుటుంబం టీడీపీతోనే ఉంటుందని, ఫరెవర్ చంద్రబాబుకోసమే పనిచేస్తామని సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు శైలజ. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

రంగారావు కౌంటర్..
రాయపాటి శైలజ వీడియో వైరల్ గా మారడంతో మళ్లీ రంగారావు తెరపైకి వచ్చారు. చంద్రబాబు ఇంటర్నేషనల్ స్మగ్లర్, కరప్షన్ కింగ్ అంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబాల్లో చిచ్చు పెట్టడం చంద్రబాబుకి అలవాటేనన్నారు రంగారావు. విజయవాడలో కేశినేని నాని కుటుంబంలో చిచ్చుపెట్టారని, ఇప్పుడు రాయపాటి కుటుంబంలో చిచ్చు పెట్టడానికి శైలజతో తనపై ఆరోపణలు చేయిస్తున్నారన్నారు. అమరావతి ఉద్యమం పేరుతో ఎంత ఎంత వసూలు చేశారో ముందు రాయపాటి శైలజ చెప్పాలని డిమాండ్ చేశారు. వసూలు చేసిన డబ్బులు ఎవరెవరి బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళాయో అంతా తనకు తెలుసన్నారు. అసలు రాయపాటి శైలజకు టీడీపీలో సభ్యత్వం ఉందా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు వాడుకుని వదిలేస్తారని హెచ్చరించారు. యువగళం పాదయాత్ర అయిపోయిన తర్వాత లోకేష్ డబ్బులు వసూలు చేసే పనిలో పడ్డారని ఆరోపించారు. 

మొత్తమ్మీద మరోసారి రాయపాటి వ్యవహారం రచ్చకెక్కింది. పార్టీ మారింది రంగారావు మాత్రమేనా, రాయపాటి కుటుంబం కూడానా అనే చర్చ మొదలైంది. రెండు మూడు రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Embed widget