Gudivada Politics : వంగవీటి రాధా మద్దతు కోసం రావి ప్రయత్నాలు - కొడాలి నానికి చెక్ పెట్టగలరా ?
వంగవీటి రాధా మద్దతుతో గుడివాడలో కొడాలి నానిని ఓడించాలని రావి వెంకటేశ్వరరావు ప్రయత్నిస్తున్నారు. రాధాతో స్నేహం చూపించి కాపు వర్గాల ఓట్లు ప్రతీ సారి కొడాలి నాని పొందుతున్నారని .. ఈ సారి అలా జరగకుండా చూడాలనుకుంటున్నారు.
![Gudivada Politics : వంగవీటి రాధా మద్దతు కోసం రావి ప్రయత్నాలు - కొడాలి నానికి చెక్ పెట్టగలరా ? Ravi Venkateswara Rao is trying to defeat Kodali Nani in Gudivada with the support of Vangaveeti Radha. Gudivada Politics : వంగవీటి రాధా మద్దతు కోసం రావి ప్రయత్నాలు - కొడాలి నానికి చెక్ పెట్టగలరా ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/24/11b3dbec1385aab81cdcffd3028ddd011671876392703480_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gudivada Politics : గుడివాడ రాజకీయం రసవత్తరంగా మారబోతోంది. - గుడివాడ నియోజకవర్గంలో మాజీ మంత్రి కొడాలి నానికి రాజకీయం ఎదురు లేదన్నట్లుగా ఉంది. ఆయన చెప్పిందే శాసనం, చేసిందే సంక్షేమం. అందులోనూ అధికారపక్షంలో ఉండటంతో గుడివాడలో స్దానికంగా మాస్ లీడర్ గా కొడాలి నాని పాతుకుపోయారు. కొడాలి నానికి వంగవీటి రాధా మిత్రుడు. ఇద్దరు మిత్రులు గురించి తెలియని వారు లేరు. గత ఎన్నికల ముందు వరకూ కూడ కొడాలి నాని, వంగవీటి రాధా వైసీపీలోనే కొనసాగారు. అయితే ఎన్నికలకు ముందు ఆఖరు నిమిషంలో వంగవీటి రాధా టీడీపీలో చేరటం సంచంలనం రేపింది. అయినా ఈ ఇద్దరు నేతల మధ్య స్నేహం మాత్రం కొనసాగుతోంది.
వంగవీటి రాధాతో స్నేహం వల్ల రాజకయంగా లబ్ది పొందుతున్న కొడాలి నాని
రాజకీయాలు వేరు ఫ్రెండ్ షిఫ్ వేరంటూ ఇరువురు నాయకులు చెట్టాపట్టాలు వేసుకొని అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటారు. వీరు కలిసినప్పుడల్లా రాజకీయ వర్గాల్లో పదే పదే చర్చనీయాంశంగా ఉంటుంది. ఇద్దరు నాయకులు మాస్ లీడర్లు గా ఫాలోయింగ్ ఉంది. వంగవీటి మోహన రంగా తనయుడిగా వంగవీటి రాధాకు తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్ బాగా ఉంది. ఇక గుడివాడలో స్దానికంగా కొడాలి నానికి మంచి ఇమేజ్ ఉంది. ఆ మధ్య వంగవీటి రాధా వరుసగా గుడివాడ నియోజకవర్గంలో పర్యటించడంతో టీడీపీ తరపున గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారన్న చర్చ జరిగింది. అయితే ఈ ఈ విషయంపై క్లారిటీ రాలేదు.
కొడాలి నానికి వ్యతిరేకంగా వంగవీటితో ప్రచారం చేయించాలనే ఉద్దేశంలో టీడీపీ
కొడాలి నాని రాజకీయంగా ఉన్న ఫాలోయింగ్ తో పాటుగా వంగవీటి రాధాతో ఉన్న స్నేహాన్ని ఆధారంగా చేసుకుని కొడాలి నానికి కాపు వర్గాలు కూడా మద్దతు ఇచ్చాయనే ప్రచారం ఉంది. ఇప్పుడు గుడివాడ టీడీపీ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు కాపు వర్గాన్ని తనకు తగ్గర చేసుకునేందుకు వంగవీటి రాధానే ఆశ్రయిస్తున్నారు. కాపు వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు గుడివాడ టీడీపీ ఇంచార్జ్ రావి వెంటకేశ్వరరావు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాంగానే ఇప్పుడు వంగవీటి రాధా వద్దకు కొందరు పెద్దల ద్వారా మధ్యవర్తిత్వం పంపినట్లుగా తెలుస్తోంది. స్నేహం వేరు,రాజకీయం వేరు అన్న కోణంలో రాజకీయంగా కొడాలి నానికి వ్యతిరేకంగా పని చేయాలని.. ఓడించేందుకు సహకరించాలని రావి వెంకటేశ్వరరావు కోరుతున్నారని చెబుతున్నారు.
కొడాలి నానిని ఓడించడాన్ని టార్గెట్ గా పెట్టుకున్న టీడీపీ
వైఎస్ఆర్‌సీపీలో తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న వంగవీటి రాధా.. ఆ పార్టీని ఓడించడానికి శక్తివంచన లేకుండా సహకారం అందిస్తానని చెబుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయంగా టీడీపీ గుడివాడలో కొడాలి నాని ఓడించటం ప్రధాన టార్గెట్ గా పెట్టుకుంది. ఏపీలో అధికారం హస్తగతం చేసుకోవటం టీడీపీకి ఎంత ముఖ్యమో...గుడివాడలో కొడాలి నానిని ఓడించడం కూడా అంతే ముఖ్యంగా టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.
చంద్రబాబు విమర్శలకు చెక్, పులివెందుల బస్ స్టాండ్ ను ప్రారంభించిన సీఎం జగన్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)