By: ABP Desam | Updated at : 27 May 2022 08:49 AM (IST)
మహానాడుకు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలు (PC:Twitter)
Mahanadu Traffic Directions: నేటి నుంచి రెండు రోజుల పాటు (మే 27, 28) ఒంగోలు సమీపాన మండువారిపాలెంలో జరిగే మహానాడు కార్యక్రమం దృష్ట్యా వాహనాల రాకపోకలకు, ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా జిల్లా ఎస్పీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాబట్టి, ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలను అనుసరించి ఇబ్బంది లేకుండా ప్రయాణించాలని పోలీసులు సూచించారు.
మహానాడు కార్యక్రమానికి వచ్చే వాహనాల కోసం మార్గాలు
1. గుంటూరు, విజయవాడ, చీరాల వైపు నుండి మహానాడుకు వచ్చే వాహనాలు త్రోవగుంట ఫ్లై ఓవర్ ఎక్కకుండా బై లైన్/సర్వీస్ రోడ్ లో ఎంటర్ ఆయ్యి కిమ్స్ అండర్ పాస్ ద్వారా విష్ణు ప్రియ కళ్యాణ మండపం మీదగా పార్కింగ్ ఏరియా కు ఎంట్రీ అయ్యి మీటింగ్ ప్లేస్ కు వెళ్ళాలి.
2. నెల్లూరు, కావలి వైపు నుండి మహానాడుకు వచ్చే వాహనాలు ఒంగోలు టౌన్ లోకి ప్రవేశించకుండా పెళ్లూరు ఫ్లైఓవర్ ఎక్కి కిమ్స్ ఫ్లైఓవర్ పక్కన గల సర్వీస్ రోడ్డు నుండి కిమ్స్ అండర్ బైపాస్ పాస్ మీదగా విష్ణు ప్రియ కళ్యాణ మండపం మీదగా పార్కింగ్ ఏరియా కు ఎంట్రీ అయ్యి మీటింగ్ ప్లేస్ కు వెళ్ళవలెను.
3. కడప, కర్నూలు, చీమకుర్తి వైపునుండి మహానాడుకు వచ్చే వాహనాలు కర్నూల్ బై పాస్ సెంటర్ మీదగా సర్వీస్ రోడ్డు ద్వారా విష్ణు ప్రియ కల్యాణ మండపం మీదగా పార్కింగ్ ఏరియా కు ఎంట్రీ అయి మీటింగ్ ప్లేస్ కు వెళ్ళాలి.
4. కొత్తపట్నం వైపు నుండి వచ్చే వాహనాలు కొప్పోలు ఫ్లైఓవర్ మీదగా కిమ్స్ ఫ్లైఓవర్ పక్కన గల సర్వీస్ రోడ్డు నుండి కిమ్స్ అండర్ పాస్ మీదగా విష్ణు ప్రియ కల్యాణ మండపం మీదగా పార్కింగ్ ఏరియాకు ఎంట్రీ అయ్యి మీటింగ్ ప్లేస్ కు వెళ్ళాలి.
5. విజయవాడ, గుంటూరు, చీరాల వైపునుండి ఒంగోలు టౌన్ లోకి ప్రవేశించే వాహనదారులు కిమ్స్ ఫ్లైఓవర్ మీదగా కొప్పోలు ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు మీదగా కొత్తపట్నం బస్టాండ్ మీదుగా ఒంగోలు టౌన్ లోకి ప్రవేశించాలి.
మహానాడు నుండి బయటకు వెళ్ళే వాహన మార్గాలు
1. మహానాడుకు వచ్చి పార్కింగ్ నుండి వెళ్ళే వాహనాలు గుంటూరు, విజయవాడ వైపుకు వెళ్ళటానికి (ఎన్.హెచ్ 16) ఎడమవైపు నుండి NH -16 రోడ్డుకి ఎంట్రీ అయ్యి త్రోవగుంట ఫ్లైఓవర్ ఏక్కి వెళ్ళాలి.
2. చీరాల వైపు వెళ్లే వాహనాలు త్రోవగుంట ఫ్లైఓవర్ అండర్ పాస్ నుండి వెళ్ళాలి.
3.మహానాడుకు వచ్చి పార్కింగ్ నుండి వెళ్ళే వాహనాలు త్రోవగుంట ఫ్లైఓవర్ అండర్ పాస్ నుండి యూటర్న్ తీసుకుని కావలి, నెల్లూరు వైపుగా NH 16 లోకి ఎంట్రీ అయి వెళ్ళాలి.
4. మహానాడుకు వచ్చి పార్కింగ్ నుండి వెళ్ళు వాహనాలు త్రోవగుంట ఫ్లైఓవర్ అండర్ పాస్ నుండి యూటర్న్ తీసుకుని నేరుగా కిమ్స్ ఫ్లైఓవర్ ఎక్కి, పెళ్ళూరు ఫ్లై ఓవర్ దిగి యూటర్న్ తీసుకుని, ఒంగోల్ మినీ బైపాస్ మీదగా కర్నూల్, కడప మరియు చీమకుర్తి రోడ్ లో గుండా వెళ్ళాలి.
5. ఒంగోలు టౌన్ నుండి గుంటూరు, విజయవాడ వైపుకు వెళ్లే వాహనాలు కొత్తపట్నం బస్టాండ్ వైపు నుండి కొప్పోలు ఫ్లై ఓవర్ కు లెఫ్ట్ సైడ్ లో గల సర్వీస్ రోడ్డు మీదగా ఎన్ హెచ్ -16 కు వెళ్లి గుంటూరు, విజయవాడ వైపు వెళ్ళాలి.
6. ఒంగోలు టౌన్ నుండి కావలి, నెల్లూరు వైపు వెళ్లే వాహనాలు ఒంగోలు సౌత్ బైపాస్ మీదగా రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ మీదగా పెళ్లూరు ఫ్లై ఓవర్ అండర్ పాస్ ద్వారా NH 16 కు వెళ్ళాలి.
7. ఒంగోలు టౌన్ నుండి చీరాల వైపుకు వెళ్ళే వాహనాలు కొత్తపట్నం బస్టాండ్ మీదుగా కొప్పోలు ఫ్లైఓవర్ కు లెఫ్ట్ సైడ్ లోని సర్వీస్ రోడ్డు ద్వారా ఎన్ హెచ్.16 రోడ్డుకు వెళ్లి, కల్వరి టెంపుల్ ఆపోజిట్ రోడ్ లోని లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్డు ద్వారా త్రోవగుంట ఫ్లైఓవర్ అండర్ పాస్ నుండి చీరాల రోడ్డు వైపు వెళ్ళాలి.
Rains in AP Telangana: నేటి నుంచి 48 గంటలపాటు వర్షాలు, ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్ - ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
CM Jagan : తెలంగాణ నుంచి ఆ డబ్బులు ఇప్పించండి, ప్రధానిని కోరిన సీఎం జగన్
PM Modi Black Balloons : ఏపీలో నల్ల బెలూన్లపై రాజకీయ రచ్చ, ఎవరు చేశారో తెలుసంటున్న బీజేపీ
PM Modi In Bhimavaram : ప్రధాని ఏపీ పర్యటనలో అరుదైన ఘటన, స్వాతంత్య్ర సమర యోధుల కుమార్తెకు మోదీ పాదాభివందనం
Modi Helicopter Black Balloons: మోదీ హెలికాప్టర్ పక్కనే నల్ల బెలూన్లు, ఏపీ పర్యటనలో భద్రతలోపం! ఎవరు వదిలారంటే
Nandamuri Kalyan Ram New Movie: గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్
Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?
MLA Kotamreddy Protest: మురికి కాల్వలో దిగి YSRCP ఎమ్మెల్యే వింత నిరసన - వద్దని వేడుకుంటున్న ప్రజలు
Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్