Nara Lokesh Meets Google CEO: డ్రోన్ సిటీలో అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయండి: గూగుల్ సీఈఓను కోరిన నారా లోకేష్
అమెరికా పర్యటనలో భాగంగా ఏపీ మంత్రి నారా లోకేష్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో భేటీ అయ్యారు. డ్రోన్ సిటీలో అసెంబ్లింగ్ యూనిట్ పై చర్చించారు.

వాషింగ్టన్: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన నాలుగో రోజున కీలక సమావేశాలలో పాల్గొన్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆయన గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేయనున్న ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిపై లోకేశ్ సమీక్షించారు. ఏపీలో డ్రోన్ సిటీలో అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని సుందర్ పిచాయ్‌ను మంత్రి లోకేష్ కోరారు.
ఇంటెల్, ఎన్ విడియా, అడోబ్‌లతో చర్చలు
అమెరికాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన నాలుగోరోజు కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా ఆయన ఇంటెల్ ఐటీ సీటీవో శేష కృష్ణపురతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీలో ఇంటెల్ ఏటీఎంపీ యూనిట్ ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. రాజధాని అమరావతిలో ఇంటెల్ ఏఐ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసే దిశగా ప్లాన్ చేయాలని కోరారు. అనంతరం, ఎన్ విడియా ప్రతినిధి రాజ్‌మిర్ పురితోనూ మంత్రి లోకేశ్ భేటీ అయి... రాష్ట్రంలో ఎన్ విడియా స్మార్ట్ ఫ్యాక్టరీ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించాలని, భాగస్వామ్య సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా సహకరించాలని మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
#GoogleChoosesAP
— Lokesh Nara (@naralokesh) December 10, 2025
It was a pleasure to meet Sundar Pichai, CEO @Google, along with Thomas Kurian & Bikash Koley in San Francisco. I thanked Google for their landmark $15B investment in the Visakhapatnam AI Data Center - set to be one of the largest FDI projects outside the US. We… pic.twitter.com/55wgy7mBDM
అడోబ్, జూమ్ సంస్థలతో సమావేశాలు
అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌తో మంత్రి లోకేశ్ సమావేశమై, ఏపీలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆ తర్వాత, జూమ్ ప్రెసిడెంట్ శంకరలింగంతోనూ లోకేశ్ భేటీ అయ్యారు. ఏపీలో జూమ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. నారా లోకేశ్ చేసిన ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆ సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు.
సుందర్ పిచాయ్‌తో నారా లోకేశ్ భేటీ: ఎక్స్ ఖాతాలో పోస్ట్
శాన్‌ఫ్రాన్సిస్కోలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తో పాటు థామస్ కురియన్, బికాష్ కోలే లను కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న $15 బిలియన్ల విలువైన ఏఐ డేటా సెంటర్ (Vizag AI Data Center) పెట్టుబడి పెడుతున్నందుకు నా తరఫున గూగుల్‌కు ధన్యవాదాలు తెలిపాను. ఇది అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుంది.
డేటా సెంటర్ ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించి, నిర్మాణ సమయాన్ని మరింత వేగవంతం చేసే పనులు, మార్గాలపై మేం చర్చించాము. ఆంధ్రప్రదేశ్‌లో రాబోతున్న డ్రోన్ సిటీలో డ్రోన్ అసెంబ్లీ, కాలిబ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని, అలాగే రాష్ట్రంలో సర్వర్ల తయారీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని గూగుల్‌ను ఆహ్వానించాను.
#GoogleChoosesAP’ అని నారా లోకేశ్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.






















