అన్వేషించండి

Kodali Nani: జగన్ హీరో, చంద్రబాబు విలన్, ఆర్జీవీతో డైరెక్షన్ - నేను మాట్లాడతా: కొడాలి నాని సెటైర్లు

2024 ఎన్నికల తర్వాత సీఎం జగన్‌ ప్రతిపక్ష నేతలందరినీ నడి రోడ్డుపై నిలబెడతారని కొడాలి నాని జోస్యం చెప్పారు. ఎన్నికల తర్వాత పవన్‌కు మిగిలేది ప్యాకేజీ డబ్బులు, సినిమాలే అంటూ కౌంటర్‌ ఇచ్చారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ ‘పాపం పసివాడు’ అంటూ చేసిన వ్యంగ్యపు ట్వీట్‌కు వైఎస్ఆర్ సీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిజ జీవితంలో హీరో​ అని, ఆయన పాత్రతో సినిమా తీస్తే ఆ సినిమాలో చంద్రబాబును విలన్‌గా నటింప చేయాలని అన్నారు. ఈ సినిమాలో చంద్రబాబుకు 420 అసిస్టెంట్‌గా ఉండాలని అన్నారు. అవసరమైతే ఆ సినిమాకు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ డైరెక్షన్‌ చేస్తారని అన్నారు. రామ్ గోపాల్ వర్మను ఒప్పించడానికి తాను ఆయనతో మాట్లాడతానని చెప్పారు. 

2024 ఎన్నికల తర్వాత సీఎం జగన్‌ ప్రతిపక్ష నేతలందరినీ నడి రోడ్డుపై నిలబెడతారని జోస్యం చెప్పారు. ఎన్నికల తర్వాత పవన్‌కు మిగిలేది ప్యాకేజీ డబ్బులు, సినిమాలే అంటూ కొడాలి నాని కౌంటర్‌ ఇచ్చారు.

Also Read: Telangana News : ఏపీలో ఉండలేం తెలంగాణలో కలపండి - ఆ ఐదు గ్రామాల ప్రజల డిమాండ్ !

సునీల్ దియోధర్ పైనా స్ట్రాంగ్ కౌంటర్స్

ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ గుడివాడలో చేసిన వ్యాఖ్యలపైన కూడా మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. సునీల్ దియోధర్ ను సునీల్ పకోడి అంటూ ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. ‘‘సునీల్ పకోడీ వాళ్ల వల్లే, కర్ణాటకలో బీజేపీ దిగజారింది. ప్రజలకు ప్రభుత్వ మంచి చెప్పమని పంపితే.. సునీల్ పకోడీ లాంటి వాళ్లు ఇక్కడకు వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఫ్లైట్ టికెట్లు, లగ్జరీ రూంలు, కార్లు ఏర్పాటు చేసి పార్టీ కార్యకలాపాల కోసం పంపితే వీళ్లు నాశనం చేస్తున్నారు. ఆ మత విద్వేషాల వల్లే కర్ణాటకలో బీజేపీ ఓడిపోయింది. దేశంలో సునీల్ పకోడీ లాంటి నేతలపై అమిత్ షా, మోదీ దృష్టి పెట్టాలి. లేదంటే కర్ణాటకలో వచ్చిన పరిస్థితే ఇతర రాష్ట్రాల్లో వస్తుంది’’ అని  సునీల్ దియోధర్‌పై కొడాలి నాని కౌంటర్ వేశారు.

సునీల్ దియోధర్ కామెంట్స్ ఇవీ..

కొడాలి నాని సంక్రాంతి పండుగను క్యాసినో, క్యాబిరే డ్యాన్స్‌లుగా మార్చేశారని, గుడివాడ యువతను సర్వనాశనం చేస్తున్నారని బీజేపీ ఏపీ ఇన్‌చార్జ్ సునీల్ దియోధర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బీజేపీ ఛార్జిషీట్ కార్యక్రమంలో పాల్గొ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే కొడాలి నాని లాంటి వాళ్లను జైలుకు పంపిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని మాటలతో రాష్ట్రం పరువు పోతోందని అన్నారు. గాడిదలా, కుక్కలా బూతులు మాట్లాడుతూ కొడాలి నాని ఫేమస్ అయ్యారని ఆక్షేపించారు. కొడాలి నాని మాటలతో ఏపీ పరువు పోతోందని, ఆయన చేష్టలతో గుడివాడ యువత నాశనం అవుతున్నారని సునీల్ దియోధర్ మండిపడ్డారు. కొడాలి నానిని జీవితాంతం అసెంబ్లీ గడప తొక్కకుండా ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చారు.

Also Read: Andhra News : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ - మార్గదర్శకాలు రిలీజ్ చేసిన ప్రభుత్వం !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
Secunderabad- Tirupati Vande Bharat Express: తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
IBOMMA Ravi Custudy: ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
Advertisement

వీడియోలు

Women's Kabaddi World Cup | కబడ్డీ వరల్డ్ కప్‌ ఇండియాదే
Karun Nair Crypitc Post Ind vs SA | ట్విట్టర్ వేదికగా కరుణ్ నాయర్ విమర్శలు
India vs South Africa Test Match | కుప్పకూలిన భారత బ్యాట్స్‌మెన్
Who is Senuran Muthusamy | ఎవరి సెనూరన్ ముత్తుసామి ? | ABP Desam
Blind T20 Women World Cup | చారిత్రాత్మక విజయం సాధించిన అంధుల మహిళ క్రికెట్ టీమ్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
Secunderabad- Tirupati Vande Bharat Express: తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
IBOMMA Ravi Custudy: ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
ABP Southern Rising Summit 2025: చెన్నైలో ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్.. కీలక అంశాలపై మాట్లాడనున్న దక్షిణాది ప్రముఖులు
చెన్నైలో ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్.. కీలక అంశాలపై మాట్లాడనున్న దక్షిణాది ప్రముఖులు
Kokapet land auction: కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం
కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం
Dharmendra : బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి - అభిమానుల కన్నీటి వీడ్కోలు
బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి - అభిమానుల కన్నీటి వీడ్కోలు
Pawan Kalyan: నాడు ఆలయానికి ఇచ్చిన మాట నేడు నెరవేర్చిన పవన్ - జగన్నాథపురం గుడి దశ తిరిగినట్లే  !
నాడు ఆలయానికి ఇచ్చిన మాట నేడు నెరవేర్చిన పవన్ - జగన్నాథపురం గుడి దశ తిరిగినట్లే !
Embed widget