By: ABP Desam | Updated at : 03 Mar 2022 03:29 PM (IST)
Writ Of Mandamus అంటే ఏంటి?
మూడు రాజధానుల(Three Capital) విషయంలో ఏపీ హైకోర్టు(AP High Court) సంచలన తీర్పు ఇచ్చింది. సీఆర్డీఏ(CRDA) చట్టప్రకారమే ప్రభుత్వం నడుచుకోవాలని ఆదేశించిన ఏపీ హైకోర్టు...ఆ చట్టాన్ని ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి శాసనపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని తేల్చిచెప్పింది. అసలు ఒకసారి ఆ చట్టం చేసి...అంత మంది రైతులను ఇన్ వాల్వ్ చేసి...అన్ని వేల ఎకరాలు తీసుకున్న తర్వాత అంత తేలికగా నిర్ణయాన్ని మార్చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ ఓ సంచలన తీర్పు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిందనే చెప్పాలి.
రిట్ ఆఫ్ మాండమాస్ అంటే ఏంటి?
అయితే తీర్పు ఇస్తూ రిట్ ఆఫ్ మాండమాస్(Writ Of Mandamus) ఇస్తున్నామని పేర్కొంది ఏపీ హైకోర్టు. అసలేంటీ రిట్ ఆఫ్ మాండమస్ అంటే. ముందు దీని అర్థం చూద్దాం. మాండమస్ అనే పదం తెలుగు పదం కాదు. 16వ శతాబ్దానికి చెందిన ఓ లాటిన్(Latin) పదం. మాండమస్ అనే పదానికి అర్థం We Command అని. అంటే మా మాటే శాసనం అని. మాండమస్ అనే పదానికి ఉన్న నిర్వచనం ఓ సారి చూద్దాం .. Mandamus is a Judicial Remedy in the form of an order from a court to any government, subordinate court, corporation, or public authority to do some specific act. which is in the nature of public duty, and in certain cases one of a statutory duty. అంటే ఓ ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ తాము చట్ట పరంగా చేయాల్సిన తప్పనిసరి విధులను చేయకపోతే...అంటే చేయని పక్షంలో ఆ పనులను చేసి తీరాల్సిందే అని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే తప్పనిసరి ఆదేశాలు అన్నమాట. మాండమస్ ఇచ్చారు అంటే చేసి తీరాల్సిందే అని అర్థం.
తప్పని సరి పరిస్థితుల్లో జారీ చేయాల్సిన ఆదేశం
అయితే మాండమస్ అనేది అన్ని సందర్భాల్లోనూ కోర్టు ఇవ్వదు. చాలా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఉన్నత న్యాయ స్థానాలకు ఉండే అత్యున్నత అధికారం ఇది. ప్రభుత్వం ద్వారా ఓ సర్టైన్ కేస్‌లో ప్రజలకు న్యాయం జరగటం లేదన్నపుడు మాత్రమే కోర్టు మాండమస్ ఇస్తుంది. మాండమస్ అనేది ఉన్నత న్యాయస్థానాలకు ఉండే అంతిమ ప్రత్యామ్నాయం. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ మాండమస్ ను జారీ చేస్తాయి.
తొలిసారి 1962లోనే
ఇండియాలో వారన్ హెస్టింగ్ గవర్నర్ జనరల్ హోదా లో మాండమస్ రిట్ ను ఉపయోగించినట్లు ఉంది. మాండమస్ రిట్ ను ఉపయోగించిన కేసుల్లో ఎక్కువ వినిపించేది 1962లో వెస్ట్ బెంగాల్ లో ఆల్ ఇండియా టీ ట్రేడింగ్ కంపెనీ వర్సెస్ సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ మంగళ్ దాయ్ కేసు. ఈ కేసులో భూమి కోల్పోయిన ఓ బాధితుడికి పరిహారం అందించటంలో చాలా ఆలస్యం జరిగింది. దీంతో బాధితుడు తనకు రావాల్సిన పరిహారంపై వడ్డీని కూడా చెల్లించాలంటూ కోర్టును ఆశ్రయించాడు. పలు సార్లు చెప్పినా అధికారులు వినకపోవటంతో మాండమస్ ను వినియోగించి కోర్టు బాధితుడుకి న్యాయం చేసింది.
కానీ కోర్టులకు మాండమస్ జారీ చేయటానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఉన్నత న్యాయ స్థానాలైన హైకోర్టు, అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులకు మాత్రమే మాండమస్ ఇచ్చే అధికారం ఉంటుంది. రాష్ట్రపతి, గవర్నర్ లకు మాండమస్ వర్తించదు. ప్రత్యేకంగా ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు వ్యతిరేకంగా ఈ ఆదేశాలను కోర్టు జారీ చేయలేదు. మాండమస్ రిట్ ను అంతిమ ప్రత్యామ్నాయంగానే కోర్టులు వినియోగించాలనే ఆదేశం ఉంది. సో ఇప్పుడు అమరావతిలోనే రాజధానిని అభివృద్ధి చేసి ఎప్పటికప్పుడు నివేదికలు కూడా సమర్పించాలని ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మాండమస్ జారీ చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Pawan Kalyan: మహానేతలను ఒక్క జిల్లాకే పరిమితం చేస్తారా ? వైసీపీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ ఇదే: పవన్ కళ్యాణ్
Vegetable Rates: ఏపీలో కూరగాయల రేట్ల నియంత్రణకు ప్రత్యేక యాప్, సీఎస్ ఆదేశాలు
Pawan Kalyan On Konaseema Violence: ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య కేసును కవర్ చేసుకునేందుకు ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది : పవన్ కళ్యాణ్ ఆరోపణలు
AP Government On CPS: సీపీఎస్ అమలు సాధ్యం కాదు- తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం, జీపీఎస్‌కు సహకరించాలని సూచన
Guntur: పెళ్లికి ముందు వరుడి మాజీ లవర్ ఊహించని ట్విస్ట్, అసలు విషయం తెలిసి వధువు ఫ్యామిలీ షాక్
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి