అన్వేషించండి

TDP YSRCP Clash: మాచర్లలో ఎవరేం చేశారో వీడియోలున్నాయి, బాధ్యులపై కఠిన చర్యలు: డీఐజీ త్రివిక్రమ్‌

TDP Ysrcp Clash at Macharla : మాచర్ల ఘటనలో ఎవరెవరు ఏం చేస్తారో తమ వద్ద వీడియోలు ఉన్నాయని, వాటిని పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ అన్నారు.

పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన హింసాత్మక ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ అన్నారు. మాచర్లలో దాడులు, ఉద్రిక్తతలకు సంబంధించి తమ వద్ద వీడియో ఫుటేజీ ఉందని, పరిశీలించిన తరువాత నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ, వైసీపీ శ్రేణులు మధ్య మూడు రోజుల కిందట ఘర్షణ తలెత్తింది. టీడీపీ, వైసీపీ శ్రేణులు కర్రలు, రాళ్లు, గాజు సీసాలతో దాడులకు పాల్పడగా 144 సెక్షన్ విధించారు. ఈ మేరకు డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ ఆదివారం మీడియాతో మాట్లాడారు. అధికార వైసీపీ, టీడీపీ రెండు పార్టీల నేతలు పరస్పరం రెచ్చగొట్టుకుని దాడులకు పాల్పడ్డారని తెలిపారు. మాచర్లలో సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల మధ్య ఘర్షణలు జరిగాయన్నారు. 

ఈ ఘటనలో గాయపడిన వారి నుంచి పోలీసులు ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. మాచర్లలో జరిగిన ఘటనలో అన్ని అంశాలు పరిశీలించి, బాధ్యులపై ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. చట్టాన్ని చేతుల్లోకి ఎవరు తమ చేతుల్లోకి తీసుకున్నా, సహించేది లేదని హెచ్చరించారు. టీడీపీ నేతలు తమ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కార్యకర్తలు, ప్రజల్ని సేకరించారని.. వారి వివరాలు సేకరించే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారని డీఐజీ తెలిపారు. ఏదైనా పార్టీ ర్యాలీలు, నిరసనలు తలపెడితే కచ్చితంగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. 

అసలేం జరిగిందంటే..
టీడీపీ ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ కార్యకర్తలు స్థానిక రింగురోడ్డు వద్ద శుక్రవారం ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మున్సిపల్‌ కార్యాలయం వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. చిన్న కాన్వెంట్‌ సమీపంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఎదురుపడ్డారు. ఇరు పార్టీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఒక్కసారిగా ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు, సీసాలు విసురుకుని దాడులకు పాల్పడ్డారు. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులకు దిగాయి. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రదర్శన నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని టీడీపీ నేతలకు పోలీసులు సూచించారు. మాచర్ల నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. మాచర్ల పట్టణంలో 144 సెక్షన్‌ విధించారు. ఇద్దరు వైసీపీ కార్యకర్తలకు గాయాలు కావడంతో వారిని స్థానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మాచర్లలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నించి వారిని వదిలే ప్రసక్తి లేదన్నారు డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి. ప్రస్తుతానికి అక్కడ శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ... పూర్తి స్థాయి విచారణ చేస్తున్నట్టు వెల్లడించారు. పూర్తి స్థాయి విచారరణకు ఐజీ త్రివిక్రమ్‌ను మాచర్ల పంపించారు. 

ఫ్యాక్షన్ లీడర్ల పనే -ఎస్పీ  
పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ, వైసీపీ శ్రేణులు మధ్య ఘర్షణకు ఫ్యాక్షన్ లీడర్లే కారణమని పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై మాట్లాడిన పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి... ఫ్యాక్షషన్‌ నేర చరిత్ర ఉన్న వ్యక్తుల రావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Embed widget