Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం
Ponnur Ambedkar Statue: దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పట్టణంలో ఆందోళన చేపట్టాయి. దీంతో జీబీసీ రోడ్డులో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది.
Guntur Latest News: పొన్నూరు పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అపచారం జరిగింది. గుర్తు తెలియని ఓ వ్యక్తి పూటుగా మద్యం సేవించి విగ్రహం వద్ద హల్చల్ చేశాడు. విగ్రహం మెట్ల పైన చొక్కా విప్పేసి అసభ్యంగా ప్రవర్తించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ వ్యక్తిని స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పట్టణంలో ఆందోళన చేపట్టాయి. దీంతో జీబీసీ రోడ్డులో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు దళిత నాయకులతో చర్చిస్తున్నారు.
విగ్రహం మెట్ల పైన చొక్కా విప్పేసి బహిరంగంగా అసభ్యంగా ప్రవర్తించడంతో.. ఈ తంతు చూసిన నెటిజన్లు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సమాచారం అందుకున్న పొన్నూరు అర్బన్ పోలీసులు ఆ వ్యక్తిని బలవంతంగా కిందకు దింపి పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో అంబేద్కర్ సెంటర్లో ఆందోళన చేపట్టారు. దళిత సంఘాల ఆందోళన నేపథ్యంలో జీబీసీ రోడ్డులో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది.
సమాచారం అందుకున్న పొన్నూరు అర్బన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దళిత సంఘాల నాయకులతో చర్చిస్తున్నారు. ఇదిలా ఉండగా... ఆ నిందితుడు విశ్రాంత సైనికుడని, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల కోసమే అంబేద్కర్ విగ్రహం వద్ద అర్థనగ్న ప్రదర్శన చేశాడని, అంబేద్కర్ ను విమర్శించే ఉద్దేశం అతనికి ఏమాత్రం లేదని అతని కుటుంబ సభ్యులు, బంధువులు చెబుతున్నారు. నిందితుడు పూటుగా మద్యం సేవించి ఉండటంతో అతని విచారణ ఆలస్యమైందని, అతనికి మద్యం మత్తు దిగిన తర్వాత అతనిని పూర్తిగా విచారిస్తామని పోలీసులు తెలిపారు. అంబేద్కర్ విగ్రహాం పైకి ఎక్కి ఓ వ్యక్తి అవమానించాడని జై భీమ్ కమిటీ సభ్యులు, అంబేద్కర్ సంఘాలు శనివారం ఆందోళన చేపట్టి ఆదివారం పట్టణ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెనాలి డీఎస్పీ జనార్ధన రావు పట్టణంలో ప్రత్యేక పోలీసు బలగాలతో మోహరించారు. పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.