By: Harish | Updated at : 31 Mar 2023 12:21 PM (IST)
ప్రియురాలి చేతిలో హత్యకు గురైన ప్రియుడు రాము
గుంటూరు జిల్లా జిల్లా తెనాలి మండలం కఠివరం గ్రామంలో ఘోరం జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న గద్దె రాముకు ఆమని అనే మహిళతో పరిచయం ఉంది. రాముకు వివాహం కాలేదు. ఆమనికీ మాత్రం వివాహమైంది. ప్రస్తుతం ఆమె భర్తతో విడిపోయి దూరంగా ఉంటోంది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు. రాము,ఆమని మధ్య ఏర్పడిన పరిచయం కాలక్రమంలో వివాహేతర సంబంధానికి దారి తీసింది. అదే ఇప్పుడు హత్యకు పురికొల్పింది.
పోలీసులకు తప్పుడు సమాచారం...
తెనాలి శివారు కఠివరం కాలువ కట్టమీద రాము, ఆమెని నివాసం ఉంటున్నారు. ఈ ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు తమ ఇంటికి వచ్చి రాము గొంతు కోసిపారిపోయారని ఆమని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమని ఫిర్యాదుతో రంగంలోకి తిగిన పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి కోసం చాలా సమయం గాలించారు. సమీపంలో అన్ని సీసీటీవీ ఫుటేజ్‌తోపాటు అన్ని మార్గాల్లో అన్వేషించారు. అనుమానితులు ఎవరూ కనిపించలేదు.
ఎవరు చేసి ఉంటారా అనే ఆలోచనలో ఉన్న పోలీసులకు ఆమని కదలికలపై అనుమానం వచ్చింది. దీంతో దర్యాప్తును రివర్స్‌లో మొదలు పెట్టారు. ఆమనిని పోలీసులు గట్టిగా ప్రశ్నించటంతో అసలు విషయం చెప్పేసింది.
మూడేళ్ళుగా వివాహేతర సంబంధం..
పెయింటర్‌గా పని చేసే గద్దె రాముకు 30 సంవత్సరాలు. కఠివరం కాలువ కట్ట మీద నివసించే ఆమనితో గత మూడు సంవత్సరాల క్రితం వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే గత కొన్నిరోజులుగా ఇరువురికి మనస్పర్ధలు వచ్చాయి. ఈ కారణంగా రోజూ ఏదో గొడవ జరుగుతూనే ఉందది. గత రాత్రి కూడా వివాదం మొదలైంది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రాముతో గొడవపడింది ఆమని. అదే కోపంతో రాము గొంతు కోసి హత మార్చింది.
కఠివరం కాలువ కట్ట`మీద నివాసం ఉంటున్న రాము గొంతు కోసి హత మార్చినట్టు తమకు సమాచారం రావటంతో ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ ప్రసన్న కుమార్ తెలిపారు. అయితే ఆమని ఒక్కరే హత్యకు పాల్పడిందా లేక మరెవరయినా సహకరించారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామిన పోలీసులు వివరించారు.
గుంటూరులో వరుస ఘటనలు..
గుంటూరులో ఇటీవల కాలంలో ప్రేమికుల ఆత్మహత్య ఘటన సంచలనం రేకెత్తింది. పెద్దలు అడ్డుచెప్పారని.. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి రైల్వేగేటు వద్ద చోటు చేసుకుంది.ఇప్పుడు తెనాలి కేంద్రంగా ప్రియుడిని ప్రియురాలు హత్య చేసిన ఘటనతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు.
సెలపాడు గ్రామానికి చెందిన ఉయ్యూరు శ్రీకాంత్.. అదే గ్రామానికి చెందిన పులి త్రివేణి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. త్రివేణి మూడు రోజుల క్రితం తెనాలిలోని డిగ్రీ కళాశాలకు వెళ్లింది. ఆ తర్వాత శ్రీకాంత్‌తో వెళ్లడాన్ని ఆమె స్నేహితులు గమనించారు. అయితే అదే సమయంలో తమ కుమార్తె కనిపించటం లేదని త్రివేణి తల్లిదండ్రులు స్నేహితులను వాకబు చేయటంతో,శ్రీకాంత్‌తో వెళ్ళినట్లుగా సమాచారం అందించారు. త్రివేణి కుటుంబ సభ్యులు మంగళవారం చేబ్రోలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.
ఈ క్రమంలో సుద్దపల్లి రైల్వేగేటు వద్ద మృతదేహాలను గ్యాంగ్‌మెన్ గుర్తించారు. మృతి చెందింది తమ కుమార్తే అని త్రివేణి కుటుంబ సభ్యులు నిర్ధారించుకుని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రెండు రోజుల గ్యాప్ లో వరుసగా ఘటనలు వెలుగు చూడటం కలకలం రేపింది. రాము,ఆమని కేసులో పోలీసులు క్లూస్ టీంను, పోలీసు జాగిలాలను కూడా రంగంలోకి దింపారు. రాము మరొక వివాహానికి రెడీ కావటంతోనే గొడవ మొదలైందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల
Guntur News: రెండేళ్ల కన్నకూతుర్ని బండకేసి కొట్టిన తండ్రి! స్పాట్‌లోనే చిన్నారి మృతి
Top Headlines Today: నేటి నుంచి యువగళం పునఃప్రారంభం, విజయవాడలో సీఎం జగన్ టూర్
Top 10 Headlines Today: చెన్నై పాంచ్ పవర్, ఐదో ఏట అడుగు పెట్టిన జగన్ సర్కారు, చేరికలపై ఈటల నిరాశ
మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్ చేసేందుకు సీఐడీకీ అనుమతి
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
Delhi Murder Case: మాట్లాడటం లేదనే ఢిల్లీలో బాలిక హత్య- నేరాన్ని అంగీకరించిన సాహిల్
Prabhas Vs Bollywood Heroes : ప్రభాస్ కంటే శ్రీ రాముని పాత్రకు ఆ హిందీ హీరోలు బెటరా?
కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !