Andhra Pradesh: అమరావతి నిర్మాణానికి పింఛన్ సొమ్ము 10వేలు విరాళంగా ఇచ్చిన దివ్యాంగుడు ముకేష్
Nara Lokesh:అమరావతి నిర్మాణానికి విరాళాలు భారీగ వచ్చి చేరుతున్నాయి. పింఛన్ పంపిణీలో పాల్గొన్న మంత్రికి ఓ దివ్యాంగులు రాజధాని కోసం విరాళమిచ్చాడు.
: మంగళగిరి నియోజకవర్గంలోని ముకేష్ అనేదివ్యాంగుడు చేసిన పని వైరల్‌గా మారుతోంది. తనకు వచ్చిన పింఛన్‌లో పదివేల రూపాయలను ప్రభుత్వానికి విరాళంగా ప్రకటించాడు. ఆ డబ్బులను అమరావతి నిర్మాణానికి ఖర్చు పెట్టాలని రిక్వస్ట్ పెట్టుకున్నాడు ముకేష్.
చూపు లేని ముకేష్‌కు ప్రభుత్వం పదివేల రూపాయల పింఛన్ అందించింది. ఆ డబ్బులను బ్యాంకులో వేసిన ముకేష్ చెక్ రూపంలో మళ్లీ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశాడు. అమరావతి నిర్మాణం పూర్తైతే డిగ్రీ పూర్తి చేసి ఖాలీగా ఉండే తన లాంటి వారికి ఉద్యోగాలు లభిస్థాయిని అభిప్రాయపడ్డారు.
ముకేష్ చేసిన పని తన మనసుకు ఎంతగానో హత్తుకుందున్నారు మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్. ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన లోకేష్... ముకేష్ చర్య తనతోపాటు ఎంతోమందిని కదలించిందన్నారు. ఇది ప్రజల స్పూర్తికి డ్రైవింగ్ ఫోర్స్‌గా పని చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇలా నగుదును విరాళంగా ఇచ్చిన ముకేష్‌కు లోకేష్ థాంక్స్ చెప్పారు. ఆయన్ని చూస్తే చాలా గర్వంగా ఉందన్నారు.
I’m deeply moved and inspired by Mukesh’s gesture today. A son of Penumaka in Mangalagiri, Mukesh has donated Rs. 10,000 from his pension towards building Amaravati. The spirit of the people of Andhra Pradesh is our driving force. Thank you very much, brother. We’re proud of you. pic.twitter.com/YFlkHNVoHB
— Lokesh Nara (@naralokesh) July 1, 2024