అన్వేషించండి

AP Control Room Numbers: ఏపీకి తుపాను ముప్పు.. జిల్లాల వారీగా కంట్రోల్ రూం నెంబర్స్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

Cyclene Montha Effect on Andhra Pradesh | తుపాను ముప్పుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తం అయింది. జిల్లాల వారీగా కంట్రోల్ రూం నెంబర్స్ ఏర్పాటు చేసి చర్యలు చేపట్టింది.

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రాబోయే 24 గంటల్లో తుపానుగా బలపడనుండగా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అప్రమత్తమైంది. తుపాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆమె విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షించారు. కోస్తా తీరం వెంబడి జిల్లాల్లో రేపు (సోమవారం), ఎల్లుండి (మంగళవారం) అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, బలమైన ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి సూచించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు, మంత్రులు, సెక్రటరీలు, ఐఏఎస్‌లు, కలెక్టర్లు, జిల్లాల యంత్రాంగం అంతా తుపానుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారని హోంమంత్రి అనిత వివరించారు. ఇప్పటికే మంత్రులు వారీగా శాఖలపై క్షేత్రస్థాయి అధికారుల వరకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. సహాయక చర్యల కోసం ప్రభావం చూపే జిల్లాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే మరిన్ని బృందాలను రంగంలోకి దించడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్న సందర్భంలో వినియోగించేందుకు వీలుగా శాటిలైట్ ఫోన్లను జిల్లాలకు పంపించారు.AP Control Room Numbers: ఏపీకి తుపాను ముప్పు.. జిల్లాల వారీగా కంట్రోల్ రూం నెంబర్స్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

కంట్రోల్ రూమ్ నెంబర్లు..
1. APSDMA రాష్ట్ర కంట్రోల్ రూమ్ నెంబర్లు  -   112, 1070, 1800 425 0101
2. శ్రీకాకుళం   -       08942-240557
3. విజయనగరం  - 08922-236947
4. విశాఖపట్నం  - 0891-2590102/100
5. అనకాపల్లి   - 089242 22888
6. కాకినాడ   -  0884-2356801
7. BR అంబేద్కర్ కోనసీమ- 08856-293104
8. వెస్ట్ గోదావరి  - 08816-299181
9. కృష్ణుడు   - 08672-252572
10. బాపట్ల   - 08643-220226
11. ప్రకాశం   - i/c 9849764896
12. నెల్లూరు   - 0861-2331261, 7995576699
13. తిరుపతి   -  0877-2236007

బీచ్‌లకు అనుమతించకూడదు

ప్రాణ నష్టం జరగకుండా చూడటం మనందరి బాధ్యత అని పునరుద్ఘాటించిన హోంమంత్రి అనిత, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక సూచనలు జారీ చేస్తూ, నదులు, సముద్ర తీరాల్లో అన్ని బోటింగ్ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని, బీచ్‌లకు పర్యాటకుల ప్రవేశాన్ని నిషేధించాలని ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులు కాలువలు, వాగులకు ఉన్న అడ్డంకులను వెంటనే తొలగించాలని సూచించారు. బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున పట్టణాల్లో ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్ను వెంటనే తొలగించాలని ఆమె ఆదేశించారు. సహాయ శిబిరాల (రిలీఫ్ క్యాంపులు) రూట్ మ్యాప్స్‌ను ముందే చూసుకోవాలని, రిలీఫ్ క్యాంపుల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, అవసరమైతే స్కూల్స్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు కూడా వినియోగించుకోవాలని తెలిపారు.


AP Control Room Numbers: ఏపీకి తుపాను ముప్పు.. జిల్లాల వారీగా కంట్రోల్ రూం నెంబర్స్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు

హుదూద్ వంటి గత తుపాన్ల అనుభవంతో అదనపు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, మత్స్యకారుల బోట్లు, వలలకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తుపానుపై వదంతులు పెట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా సహాయం కావాలంటే స్టేట్ లేదా జిల్లాల కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు 112, 1070, 18004250101 లను ప్రజలు తప్పనిసరిగా సేవ్ చేసి పెట్టుకోవాలని, తుపాను జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని హోంమంత్రి వంగలపూడి అనిత విజ్ఞప్తి చేశారు. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, అత్యవసరమైతే తప్ప రేపు, ఎల్లుండి బయటకు రావొద్దని కోరారు. మీ ఇళ్లు ప్రమాదకరంగా ఉంటే సురక్షిత ప్రాంతానికి వెళ్లండి అని సూచించారు. పీఆర్&ఆర్ డీ, ఇరిగేషన్, సివిల్ సప్లైస్, మెడికల్, విద్యుత్తు శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అనిత ఆదేశించారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget