అన్వేషించండి

Cyclone Montha Impact on AP: మొంథా తుపానుపై ఏపీ సన్నద్ధత, రూ.14 కోట్లు విడుదల.. జిల్లాలకు ప్రత్యేక అధికారులు

Cyclone Montha Latest News Updates | మొంథా తుపానుపై ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది. 11 జిల్లాలకు రూ.14 కోట్లు విడుదల చేసింది. జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.

Andhra Pradesh Rains | అమరావతి: బంగాళాఖాతంలో ‌ ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణశాఖ హెచ్చరించింది. అక్టోబర్‌ 28న మొంథా అనే తీవ్ర తుఫాను రూపంలో ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని తాకే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అప్రమత్తమైంది. మొంథా తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌  తీర ప్రాంత జిల్లాలన్నింటికీ సీనియర్‌ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. అధికారులు తక్షణమే తమ తమ జిల్లాలకు చేరుకొని సైక్లోన్‌ కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేసి, కలెక్టర్లతో సమన్వయంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ జిల్లాలపై తుపాను ప్రభావం అధికం..

ఆర్‌.పి. సిసోడియాను తూర్పు తీర ప్రాంతాల జోనల్‌ ఇన్‌చార్జిగా నియమించారు. సిసోడియా పశ్చిమ గోదావరి జిల్లా నుండి చిత్తూరు వరకు సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. అజయ్‌ జైన్‌కు శ్రీకాకుళం జిల్లా నుండి  కోనసీమ జిల్లాల పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. మొంథా తుఫాను ప్రభావం ఈ జిల్లాల్లోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఇతర జిల్లాలకు కూడా సీఎస్ ప్రత్యేక అధికారులను నియమించారు. కె.వి.ఎన్‌. చక్రధరబాబు (శ్రీకాకుళం), పట్టణశెట్టి రవి సుబాష్‌ (విజయనగరం), నారాయణ భారత్‌ గుప్తా (పార్వతీపురం మన్యం), వదరేవు వినయ్‌ చంద్‌ (అల్లూరి సీతారామరాజు), వి.ఆర్‌. కృష్ణ తేజ (కాకినాడ), కె. కన్నా బాబు (తూర్పు గోదావరి), విజయరామరాజు (కొనసీమ), వి. ప్రసన్న వెంకటేశ్‌ (పశ్చిమ గోదావరి), కాంతిలాల్‌ డాండే (ఏలూరు), అమ్రపాలి కాటా (కృష్ణా), శశిభూషణ్‌ కుమార్‌ (ఎన్టీఆర్), ఎం. వేణుగోపాల్‌ రెడ్డి (బాపట్ల), కోనా సశిధర్‌ (ప్రకాశం), ఎన్‌ యువరాజ్‌ (నెల్లూరు), పి. అరుణ్‌ బాబు (తిరుపతి), పి.ఎస్‌. గిరీశా (చిత్తూరు)లను ఆయా జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా నియమించారు. 

అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలి

ఈ అధికారులు మొంథా తుఫాను సమయంలో ఉపశమన, రక్షణ, సహాయక చర్యలను సమన్వయం చేసుకోవాలి. ప్రతి బాధిత కుటుంబానికి సాయం చేరేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలి. తుఫాను అనంతరం నష్టం అంచనా, పరిహారం పంపిణీ, ప్రజల సాధారణ జీవన పునరుద్ధరణ వరకు ఈ అధికారులు సేవలు అందించనున్నారు. వీరు అన్ని శాఖల మధ్య (రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ఇంధనం, రోడ్లు & భవనాలు, నీటివనరులు, ఆరోగ్యం) సమన్వయంతో పనిచేయనున్నారు. అనుభవజ్ఞులైన అధికారులు సిసోడియా, అజయ్‌ జైన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం రాష్ట్రంపై మొంథా తుఫాను ప్రభావాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది. ప్రజలు మరో మూడు రోజులపాటు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

11 జిల్లాలకు రూ.14 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం 
అమరావతి: మొంథా తుపాను ప్రభావంతో కొనసాగుతున్న భారీ వర్షాలు, వరదల సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తక్షణ సాయంగా 11 జిల్లాలకు రూ.14 కోట్లు విడుదల చేసింది. వరద ప్రభావిత ప్రాంతాలు, అధిక వర్షపాతం నమోదైన మండలాల్లో ఆహారం, తాగునీరు, నిత్యావసర వస్తువులు, అత్యవసర సదుపాయాలకు ఈ నిధులు వినియోగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకుని అవసరమైన సహాయాన్ని అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Advertisement

వీడియోలు

Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్‌లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Bangladesh Violence : బంగ్లాదేశ్‌లో మరో హిందువును సజీవ దహనం చేసే ప్రయత్నం! ముందు కత్తితో పొడిచి ఆపై పెట్రోల్ పోసి నిప్పు!
బంగ్లాదేశ్‌లో మరో హిందువును సజీవ దహనం చేసే ప్రయత్నం! ముందు కత్తితో పొడిచి ఆపై పెట్రోల్ పోసి నిప్పు!
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
Embed widget