By: ABP Desam | Updated at : 23 Apr 2022 05:45 PM (IST)
అమరావతిలో మళ్లీ నిర్మాణాలు ప్రారంభిస్తున్న కాంట్రాక్ట్ కంపెనీలు
Amaravati Constructions : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సివిల్ సర్వీస్ అధికారుల భవనాల నిర్మాణాలను నాగార్జన కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ మళ్లీ ప్రారంభించింది. మూడేళ్ల కిందట ఆ భవనాలు దాదాపుగా 70 శాతం వరకూ పూర్తయ్యాయి. ప్రభుత్వం మారిన తర్వాత పనులన్నంటినీ ఆపేయాలని ఆదేశాలిచ్చారు. ఇటీవల అమరావతి నిర్మాణాలను కొనసాగించి తీరాలని హైకోర్టు తీర్పు చెప్పడంతో మళ్లీ నిర్మాణాలు ప్రారంభించారు. పనులు ప్రారంభించడానికి వచ్చినా ఎన్‌సీసీ కంపెనీ సిబ్బందికి అమరావతి రైతులు సారర స్వాగతం పలికారు.
పోలీసులు భద్రత కల్పించడంలేదు, నాకేదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? : వివేకా డ్రైవర్ దస్తగిరి
ఎన్‌సీసీ కంపెనీ మళ్లీ నిర్మాణాలు ప్రారంభించడానికి ఒక్క రోజు ముందే రైతులు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని పనులు చేయడం లేదని .. కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక్క రోజునే నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. 70 శాతానికిపైగా పూర్తయిన ఏఐఎస్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస సముదాయాల నిర్మాణ పనులు.. అలాగే హైకోర్టు న్యాయమూర్తుల నివాస భవనాల నిర్మాణ పనులు కూడా నవంబరు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నిధుల కోసం ప్రభుత్వం బ్యాంకులను అప్పు అడుగుతోంది. బ్యాంకుల కన్సార్షియం నుంచి ఓ విడత రుణం అందింది.
ప్రేమించి పెళ్లి, ఏడేళ్లు కాపురం ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధం, భర్త ఇంటి ముందు యువతి నిరసన
రూ.200 కోట్లు ఇచ్చేందుకు బ్యాంకుల కన్సార్షియం అంగీకరించింది. కొద్ది రోజుల క్రితం రూ.95 కోట్లు విడుదల చేశాయి. నిర్మాణాలు ప్రారంభించాలంటే ముందు కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించాలి. బ్యాంకుల నుంచి వచ్చే రుణం మేరకు వారికి చెల్లించే ఏర్పాట్లు చేశారు. తక్కువ నిధులతో అందుబాటులోకి వచ్చే భవనాల జాబితాను తీసుకుని ఆ మేరకు పనులను ప్రారంభిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత బ్యాంకుల కన్సార్షియం ఇచ్చే రుణం అఖిల భారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్లకు సరిపోతుంది.
టైప్ 1, 2, నాలుగో తరగతి ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణాలు 65 శాతం పూర్తయ్యాయి. వీటి పనులు తిరిగి ప్రారంభించేందుకు మరో మార్గంలో రుణం కోసం సీఆర్‌డీఏ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో పరిపాలనా వ్యవహారాలన్నీ అమరావతి నుంచే సాగుతున్నాయి. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాలు ప్రారంభించాలన్న డిమాండ్ పెరుగుతోంది.
Breaking News Live Telugu Updates: యశోద హాస్పిటల్లో కేసీఆర్‌ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి
Chandra Babu Comments on Tickets: తెలంగాణ ఫలితాలతో చంద్రబాబు అలర్ట్ -అలాంటి వారికి డోర్స్ క్లోజ్
APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా
APPSC Group-1: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా
AP Tenth: 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!
Singareni Elections: సింగరేణి ఎన్నికల కోసం రాహుల్ గాంధీ, పోలింగ్ తేదీ ఖరారు - మంత్రి వెల్లడి
Balineni YSRCP : మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నా - వైసీపీ మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు
Revanth Reddy Canvoy: ట్రాఫిక్‌లో ఇరుక్కున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కొత్త కాన్వాయ్ నంబర్ ఇదే
హైవేపై ఘోర ప్రమాదం, ట్రక్‌ని ఢీకొట్టిన కార్‌లో మంటలు - ఓ చిన్నారి సహా 8 మంది ఆహుతి
/body>